Fact Check: కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత స్టార్ స్ప్రింటర్ హిమాదాస్ గోల్డ్ మెడల్ గెలిచిందా..? నిజం ఏంటంటే..?
భారత స్టార్ స్ప్రింటర్ హిమాదాస్ కామన్‌వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిందన్న వార్త నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. ఈ వార్తలో ఎంతమేర నిజం ఉందంటే..?
Commonwealth Games 2022: ఇంగ్లాండ్‌లోని బర్మింగ్ హామ్‌లో జరుగుతున్న కామెన్వెల్త్ గేమ్స్‌లో ఇండియా ఫస్ట్ మెడల్ సాధించింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో 55 కేజీల సెగ్మెంట్‌లో సంకేత్ మహదేవ్ సార్గర్(Weightlifter Sanket Mahadev)సిల్వర్ మెడల్ సాధించాడు. టోటల్‌గా 248 కిలోలు ఎత్తి కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్ బోణీ కొట్టేలా చేశాడు. ఈ విభాగంలో మలేషియా వెయిట్ లిఫ్టర్ అనిక్ కస్డాన్ మొత్తం 249 కిలోలు ఎత్తి గోల్డ్ సిల్వర్ దక్కించుకోగా.. లంకకు చెందిన దిలంక కుమారా 225 కిలోల బరువు లిఫ్ట్ చేసి కాంస్య పతకం సాధించాడు. అయితే ఇక్కడి వరకు ఓకే గానీ భారత స్టార్ స్ప్రింటర్ హిమాదాస్(Hima Das) 400 మీటర్ల రన్నింగ్ రేస్‌లో గోల్డ్ మెడల్ దక్కించుకున్నట్లు వార్తలు సర్కులేట్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో చాలామంది ఈ వార్తను స్ప్రెడ్ చేస్తున్నారు. కొన్ని వార్తా చానల్స్ కూడా ఈ వార్తను క్యారీ చేశాయి. అయితే ఆమె గోల్డ్ నెగ్గిందన్న మాట పూర్తిగా అవాస్తవం. అది 2018 నాటి ఓల్డ్ వీడియో. పలు జాతీయ వార్తా సంస్థలు.. Commonwealth Games అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసిన అనంతరం ఈ వార్త పూర్తిగా ఫేక్ అని నిర్దారించడమైనది. నిజం చెప్పాలంటే హిమాదాస్ పార్టిసిపేట్ చేయాల్సిన 400 మీటర్ల రేస్ ఆగస్టు 6న షెడ్యూల్ చేయబడింది. ఎనీ వే ఆమె ఇండియాకు గోల్డ్ తీసుకువారావాలని మనందరం ఆశిద్దాం.
There is a video of Hima Das winning gold at CWG 2022 in Birmingham. It has thousands of RTs and hundreds of QTs. Except:
Video is from 2018. SAYS IN THE VIDEO. A Romanian wins silver. The event hasn’t even started in Birmingham
People are absolutely hopeless.
— T. H. Houghton (@sidin) July 30, 2022
సర్కులేట్ అవుతున్న ఓల్డ్ వీడియో దిగువన చూడండి…
Hima Das wins 400m Gold in CWG at Birmingham ??? pic.twitter.com/ziTYoZy7K7
— Pegasus (@srao7711) July 30, 2022
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి.