Viral Video: బెట్‌ కట్టి మరీ గోల్‌ కొట్టింది.. మైదానంలోనే బాయ్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్‌ చేసింది.. నెట్టింట్లో వైరల్ వీడియో..

Viral Video: ఇటీవల క్రీడా మైదానాలు లవ్‌ ప్రపోజల్స్‌కు వేదికగా మారుతున్నాయి. చాలామంది ఆటగాళ్లు, క్రీడకారిణులు మైదానాల్లోనే మనసుకు నచ్చినవారికి తమ ప్రేమను తెలియజేస్తున్నారు. అందరిముందే ప్రేమ వర్షం కురిపిస్తున్నారు. తాజాగా అలాంటి సంఘటనే..

Viral Video: బెట్‌ కట్టి మరీ గోల్‌ కొట్టింది.. మైదానంలోనే బాయ్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్‌ చేసింది.. నెట్టింట్లో వైరల్ వీడియో..
Love Proposal

Updated on: Jul 09, 2022 | 9:41 AM

Viral Video: ఇటీవల క్రీడా మైదానాలు లవ్‌ ప్రపోజల్స్‌కు వేదికగా మారుతున్నాయి. చాలామంది ఆటగాళ్లు, క్రీడకారిణులు మైదానాల్లోనే మనసుకు నచ్చినవారికి తమ ప్రేమను తెలియజేస్తున్నారు. అందరిముందే ప్రేమ వర్షం కురిపిస్తున్నారు. తాజాగా అలాంటి సంఘటనే మరొకటి చోటు చేసుకుంది. నెదర్లాండ్‌ రాజధాని అమెస్టర్‌డ్యామ్‌ వేదికగా జరుగుతున్న మహిళల హాకీ ప్రపంచకప్‌లో ఓ క్రీడాకారిణి తన బాయ్‌ ఫ్రెండ్‌కు ప్రపోజ్‌ చేసింది. అందరూ చూస్తుండగానే మోకాలి మీద నిల్చోని తన ప్రేమను వ్యక్తం చేసింది. పట్టరాని ఆనందంతో అతనిని హత్తుకుని ముద్దాడింది ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.

గోల్ కొడితే ప్రపోజ్ చేస్తానంటూ..

మహిళల హాకీ ప్రపంచకప్‌లో భాగంగా పూల్‌-ఏలో నెదర్లాండ్స్‌, చిలీ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ 3-1తో విజయం సాధించింది. ఆతిథ్య జట్టు గెలిచినప్పటికీ ఈ మ్యాచ్‌లో చిలీ క్రీడాకారిణి ఫ్రాన్సిస్కా తాలా స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో చిలీ చేసిన ఏకైక గోలు ఆమెదే. ఈ క్రమంలోనే మ్యాచ్‌ పూర్తయ్యాక గ్యాలరీలో ఉన్న తన బాయ్‌ఫ్రెండ్‌ను పిలిచింది ఫ్రాన్సిస్కా. దీంతో అతను బారికేడ్లను దూకి మైదానంలోకి దూకి వచ్చాడు. వెంటనే అతనికి తన ప్రేమను తెలియజేసింది. మోకాలిపై నిల్చొని ప్రపోజ్‌ చేయమని అతను అడగ్గానే ఆమె అలాగే చేసింది. ప్రియురాలు అంత ప్రేమగా ప్రపోజ్‌ చేస్తే ఎవరు కాదంటారు చెప్పండి. అంతే వెంటనే యస్‌ అన్నాడు. దీంతో ఆ ఇద్దరి ప్రేమికుల ఆనందానికి ఆకాశమే హద్దైంది. వెంటనే ఇద్దరూ హత్తుకొని ముద్దాడుకున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో తాను గోల్‌ కొడితేనే తన బాయ్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్‌ చేసుకుంటానని ముందే చెప్పిందట ఫ్రాన్సిస్కా. దీనికి సంబంధించి తన తోటి క్రీడాకారిణులతో పందెం కూడా కాసిందట. చెప్పినట్లే నెదర్లాండ్‌పై గోల్‌ కొట్టి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తన బాయ్‌ ఫ్రెండ్‌కు ప్రపోజ్‌ చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..