మారనున్న టీమిండియా జెర్సీ బ్రాండ్..!

టీమిండియా ఆటగాళ్ల జెర్సీలపై ఒప్పో బ్రాండ్‌కు బదులు మరో కొత్త బ్రాండ్ దర్శనమివ్వబోతోంది. సెప్టెంబర్ 15న ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా ఆటగాళ్లు కొత్త బ్రాండ్‌ జెర్సీతో దర్శనమివ్వబోతున్నట్లు తెలుస్తోంది. బెంగళూరుకు చెందిన ఆన్‌లైన్ ట్యుటోరియల్ సంస్థ బైజుస్‌ తన బ్రాండ్‌ను టీమిండియా జెర్సీపై కొనసాగించనున్నట్లు సమాచారం. కాగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ ఒప్పో.. 2017 మార్చిలో టీమిండియా స్పాన్సర్‌షిప్‌ను రూ.1079కోట్లకు ఐదేళ్ల పాటు బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఆ సంస్థ […]

  • Updated On - 4:13 pm, Thu, 25 July 19 Edited By:
మారనున్న టీమిండియా జెర్సీ బ్రాండ్..!

టీమిండియా ఆటగాళ్ల జెర్సీలపై ఒప్పో బ్రాండ్‌కు బదులు మరో కొత్త బ్రాండ్ దర్శనమివ్వబోతోంది. సెప్టెంబర్ 15న ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా ఆటగాళ్లు కొత్త బ్రాండ్‌ జెర్సీతో దర్శనమివ్వబోతున్నట్లు తెలుస్తోంది. బెంగళూరుకు చెందిన ఆన్‌లైన్ ట్యుటోరియల్ సంస్థ బైజుస్‌ తన బ్రాండ్‌ను టీమిండియా జెర్సీపై కొనసాగించనున్నట్లు సమాచారం.

కాగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ ఒప్పో.. 2017 మార్చిలో టీమిండియా స్పాన్సర్‌షిప్‌ను రూ.1079కోట్లకు ఐదేళ్ల పాటు బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఆ సంస్థ ఇప్పుడు తమ స్పాన్సర్‌షిప్‌ను రద్దు చేసుకోవాలనుకుంటోందట. 2017లో అధిక వ్యయానికి ఒప్పందం కుదుర్చుకున్నామనే కారణంతో ఇప్పుడు తప్పుకోవాలని చూస్తోందట. మరోవైపు బైజుస్ సంస్థ అదే కాల వ్యవధికి అంతే మొత్తంలో బీసీసీఐకి చెల్లించడానికి ముందుకు వచ్చిందని, దీంతో సెప్టెంబర్ నుంచి 2022 మార్చి వరకు బైజుస్ స్పాన్సర్‌షిప్ చేస్తుందని సమాచారం.