సెలబ్రిటీ పేరిట.. అమ్మాయిలను ట్రాప్ చేసిన పాక్ క్రికెటర్!
దాయాది పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆటగాళ్ల బండారం ఒక్కొక్కటిగా సోషల్ మీడియా వేదికగా బయటపడుతున్నాయి. రీసెంట్‌గా పాక్ మాజీ పేసర్ అబ్దుల్ రజాక్ తనకు ఐదారుగురు అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బహిరంగంగా వ్యాఖ్యానించి సంచలనం రేపాడు. ఇది జరిగి వారం రోజులు కాకముందే.. మరో క్రికెటర్ ప్రేమాయణం బయటపడింది. పాకిస్థాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హాక్ పలువురు యువతుల్ని మోసం చేశాడంటూ పాక్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. […]

దాయాది పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆటగాళ్ల బండారం ఒక్కొక్కటిగా సోషల్ మీడియా వేదికగా బయటపడుతున్నాయి. రీసెంట్‌గా పాక్ మాజీ పేసర్ అబ్దుల్ రజాక్ తనకు ఐదారుగురు అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బహిరంగంగా వ్యాఖ్యానించి సంచలనం రేపాడు. ఇది జరిగి వారం రోజులు కాకముందే.. మరో క్రికెటర్ ప్రేమాయణం బయటపడింది.
పాకిస్థాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హాక్ పలువురు యువతుల్ని మోసం చేశాడంటూ పాక్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా ట్విట్టర్ వేదికగా వైరల్ అయ్యాయి. ‘ఇమామ్ తన సెలబ్రిటీ స్టేటస్ ఉపయోగించి అనేకమంది యువతుల్ని మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతులతో శారీరక సంబంధాలు కూడా కొనసాగించాడని’ పాక్‌కు చెందిన ఓ మీడియా సంస్థ పేర్కొంది. ప్రపంచకప్ సమయంలో కూడా ఈ వ్యవహారాలు నడిపించాడని ఆ మీడియా తెలిపింది.
ఇక దీనిపై ఇమామ్ ఉల్ హాక్ ఇప్పటివరకు స్పందించలేదు. ప్రపంచకప్‌లో ఫామ్ సరిగ్గాలేదని విమర్శలు ఎదుర్కుంటున్న అతడికి ఇది మరో తలనొప్పిగా మారింది. ఇది ఇలా ఉండగా ఇమామ్.. పాక్ చీఫ్ సెలక్టర్ ఇంజమాముల్ హక్ మేనల్లుడు కావడం విశేషం. దీనితో పాక్ బోర్డులో రానున్న రోజుల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి.
Here is?@ImamUlHaq12 #Imamulhaq #ImamUlHaqExposed #metoo pic.twitter.com/rvDx3eywPn
— Qaنdeel ?? (@Qandeelgulzar) July 25, 2019
So apparently Mr. @ImamUlHaq12 was dating 7 to 8 (that we know of) women and kept using them and manipulating them. He kept telling them the whole time how he’s single. Some of the screenshots attached from girl 1: pic.twitter.com/UzIl98ryAw
— Aman (@LalaLoyalist) 24 July 2019
