Bundesliga Women 2024: SGS ఎసెన్‌పై వోల్ఫ్స్‌బర్గ్ టీమ్ ఘన విజయం.. పాయింట్ల పట్టికలో దూకుడు
Bundesliga Women 2024, Wolfsburg vs SGS Essen: ప్రతిష్ఠాత్మక బుండెస్లిగా మహిళల ఫుట్‌బాల్ టోర్నమెంట్ లో వోల్ఫ్స్‌బర్గ్ టీమ్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆ జట్టు ఆడిన 7 మ్యాచుల్లో ఐదింటిలో విజయం సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్ లోనూ SGS ఎస్సెన్ ను 2-0తో చిత్తు చేసింది.
Bundesliga Women 2024, Wolfsburg vs SGS Essen: జర్మనీ వేదికగా జరుగుతోన్న బుండెస్లిగా మహిళల ఫుట్‌బాల్ టోర్నమెంట్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎనిమిదో రోజు అంటే ఆదివారం (అక్టోబర్ 20) జరిగిన 40వ మ్యాచ్‌లో SGS ఎస్సెన్, వోల్ఫ్స్‌బర్గ్ జట్లు తలపడ్డాయి. ఆద్యంతం హోరాహీరోగా జరిగిన ఈ మ్యాచ్‌లో వోల్ఫ్స్‌బర్గ్ 2-0తో SGS ఎసెన్‌ను ఓడించగలిగింది. ఈ విజయంతో వోల్ఫ్స్‌బర్గ్ జట్టు టోర్నీలో 5వ విజయాన్ని నమోదు చేసింది. తద్వారా పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి ఎగబాకింది. మరోవైపు SGS ఎసెన్ జట్టు 4వ ఓటమితో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. స్టేషన్ ఎసెన్‌లో జరిగిన మ్యాచ్‌లో మొదటి అర్ధభాగం ముగియడానికి కొన్ని సెకన్లు మిగిలి ఉండగానే వోల్ఫ్స్‌బర్గ్ జట్టు మొదటి గోల్ చేయగలిగింది. జట్టులోని మిడిల్ ఫీల్డర్ జనినా మింగే ప్రత్యర్థి జట్టు డిఫెన్స్‌ను ఛేదించి మ్యాచ్ 25వ నిమిషంలో గోల్‌ను నమోదు చేసింది. ఎస్సెన్ గోల్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, వోల్ఫ్స్‌బర్గ్ జట్టు డిఫెన్స్‌ను ఛేదించడంలో విఫలమైంది. ఇక విరామం అనంతరం మ్యాచ్ ద్వితీయార్థంలో ఇరు జట్లు గోల్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. మ్యాచ్ 72వ నిమిషంలో వోల్ఫ్స్‌బర్గ్ రెండో గోల్ చేసింది. ఈసారి ఆ జట్టు ప్రో స్ట్రైకర్ లినెత్ బీరెన్‌స్టెయిన్ గోల్ చేయగలిగింది. ఎస్సెన్ జట్టు కూడా గోల్ కోసం తీవ్రంగా శ్రమించినా వోల్ఫ్స్ బర్గ్ జట్టు డిఫెన్సివ్ బలంగా ఉండడంతో కుదరలేదు. దీంతో 2-0తో వోల్ఫ్స్‌బర్గ్ విజయం సాధించింది.
పాయింట్ల పట్టిక ఇలా..
టోర్నీలో ఇప్పటి వరకు ఇరు జట్ల ప్రదర్శన గురించి మాట్లాడుకుంటే…. వోల్ఫ్స్‌బర్గ్ జట్టు ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 1 మ్యాచ్‌లో ఓడిపోయింది. మిగతా మ్యాచ్‌లు డ్రాగా ముగియడంతో జట్టు మొత్తం 16 పాయింట్లతో ఉంది. ఎస్‌జీఎస్ ఎస్సెన్ జట్టు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 2 మ్యాచ్‌లు గెలిచి 4 మ్యాచ్‌ల్లో ఓడింది. 1 మ్యాచ్ డ్రాగా ముగియడంతో ఆ జట్టు 7 పాయింట్లు సాధించింది.
వోల్ఫ్స్‌బర్గ్ వర్సెస్ SGS ఎసెన్ జట్ల మధ్య మ్యాచ్.. వీడియో ఇదిగో..
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..