Viral: లక్షల్లో విషపూరిత పాములు కాలు పెట్టారంటే.. నేరుగా యమలోకానికి టికెట్‌ కన్ఫర్మ్.!!

ఆ ద్వీపం బ్రెజిల్‌కి కొంచెం దూరంలో ఉంది. సరీసృపాలకు ఆ ద్వీపం రాజ్యం. ఎన్నో లక్షల విషపూరిత పాములు అక్కడ ఉన్నాయి. మనిషి అనేవాడు అక్కడ జీవించలేడు. వెళ్ళారంటే డైరెక్ట్ యమలోకానికి టికెట్ కన్ఫర్మ్ అయినట్టే. మరి ఇంతకీ ఆ ద్వీపం ఎక్కడుందో తెల్సా.? అక్కడ ఎలాంటి పాములు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..

Viral: లక్షల్లో విషపూరిత పాములు కాలు పెట్టారంటే.. నేరుగా యమలోకానికి టికెట్‌ కన్ఫర్మ్.!!
Snake Island
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 18, 2024 | 6:00 PM

పాములకు రాజ్యం ఆ ద్వీపం. అక్కడికి మనుషులు ఎవ్వరూ వెళ్లలేరు. వెళ్లినా తిరిగి ప్రాణాలతో రాలేరు. ఆ ద్వీపంలో ఉండేవన్నీ కూడా విషపూరిత సర్పాలు. అట్లాంటిక్ మహాసముద్రం, బ్రెజిల్ తీరానికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ద్వీపం. ఈ ద్వీపంపై అడుగుపెట్టేందుకు మనుషులు తెగ భయపడతారు. చివరిసారిగా ఈ ద్వీపంపై అడుగుపెట్టిన వ్యక్తి శవమై తిరిగి వచ్చాడని మీకు తెల్సా..! మరి ఆ విషపూరిత పాములున్న ఐలాండ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

ఈ ద్వీపాన్ని స్నేక్ ఐలాండ్‌గా పిలుస్తారు. పాముల రాజ్యమిది.. ఒకానొకప్పుడు బ్రెజిల్ భూభాగంతో కలిసి ఉంటుంది. కానీ పదివేల సంవత్సరాల క్రితం సముద్రం పెరగడంతో.. బ్రెజిల్‌కు దూరమైంది. అప్పటి నుంచి మానవులు ఆ ద్వీపంపైకి వెళ్లడమే మానేశారు. గతంలో అక్కడ నివసించిన చిట్టచివరి మనిషి 1920లో లైట్ సిగ్నల్స్ ఇస్తూ సాయం కోరేవాడు. కానీ ఈ పాములు అతడ్ని బతకనివ్వలేదు. బలితీసుకున్నాయి. ఆ తర్వాత నుంచి ఏ మనిషి ఈ ద్వీపంలో నివసించేందుకు ధైర్యం చేయలేకపోయాడు.

ఇక్కడ ప్రపంచంలోనే విషపూరిత పాములు ఉండటంతో అక్కడికి వెళ్తే ప్రాణాలతో తిరిగిరాలేరని అక్కడి ప్రజల విశ్వాసం. ముఖ్యంగా అత్యంత విషపూరిత పాములలో ఒకటైన గోల్డెన్ లాన్స్‌హెడ్ వైపర్‌లు 5 వేల వరకు ఉన్నాయి. ఈ ద్వీపంలో దాదాపు 4,30,000 పాములు ఉన్నట్టు అంచనా. ఇక్కడికి ఎవరూ వెళ్లకూడదని నిషేధం ఉంది. నావికాదళ సిబ్బంది, మరమ్మత్తులు చేసే సిబ్బంది మాత్రమే ఇక్కడికి వెళ్లేందుకు అనుమతి ఉందని సమాచారం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

లక్షల్లో విషపూరిత పాములు కాలు పెట్టారంటే.. నేరుగా యమలోకానికి..
లక్షల్లో విషపూరిత పాములు కాలు పెట్టారంటే.. నేరుగా యమలోకానికి..
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ ను గెలుచుకున్న లక్ష్మీ నారాయణ
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ ను గెలుచుకున్న లక్ష్మీ నారాయణ
వరినాట్లు వేయడానికి వచ్చి బిత్తరపోయిన రైతు.. కనిపించింది చూడగా
వరినాట్లు వేయడానికి వచ్చి బిత్తరపోయిన రైతు.. కనిపించింది చూడగా
ఆరేళ్ల తరువాత హైదరాబాద్ ఎందుకు ఇలా వణుకుతోంది.? వీడియో..
ఆరేళ్ల తరువాత హైదరాబాద్ ఎందుకు ఇలా వణుకుతోంది.? వీడియో..
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీని వదలని వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీని వదలని వర్షాలు.!
చింత పండుతో కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టవచ్చు..
చింత పండుతో కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టవచ్చు..
రైలు ప‌ట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న వింత ఆకారం.. ఏంటాని చూడగా..
రైలు ప‌ట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న వింత ఆకారం.. ఏంటాని చూడగా..
కొత్త ఏడాదిలో మొదటి గ్రహణం..! ప్రత్యేకత ఏంటంటే.? వీడియో..
కొత్త ఏడాదిలో మొదటి గ్రహణం..! ప్రత్యేకత ఏంటంటే.? వీడియో..
చోరీకి వచ్చి ఏం ఎత్తుకెళ్ళాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
చోరీకి వచ్చి ఏం ఎత్తుకెళ్ళాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!