India Vs Australia 2020: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టీమిండియా ప్లేయర్స్ ఫోటో.. పుజారా టార్గెట్‌గా..!

జట్టులో సీనియర్ ప్లేయర్లు అంతగా లేకపోయినప్పటికీ అద్భుతమైన ఆటతీరుతో కంగారూలను మట్టికరిపించారు టీమిండియా ప్లేయర్లు.

India Vs Australia 2020: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టీమిండియా ప్లేయర్స్ ఫోటో.. పుజారా టార్గెట్‌గా..!
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 29, 2020 | 8:44 PM

India Vs Australia 2020: జట్టులో సీనియర్ ప్లేయర్లు అంతగా లేకపోయినప్పటికీ అద్భుతమైన ఆటతీరుతో కంగారూలను మట్టికరిపించారు టీమిండియా ప్లేయర్లు. మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ విజయోత్సాహంలో ఉన్న టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేశాడు. అందులో అశ్విన్ సహా టీమ్ మేట్స్ ఉన్నారు. అయితే ఈ ఫోటోలో ఉన్న పుజారా అందరికీ భిన్నంగా నిటారుగా నిల్చోవడంతో నెటిజన్లు పుజారాను తెగ ట్రోల్ చేస్తున్నారు. పుజరా పోజ్‌పై టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ‘పుజారా టూ స్టిఫ్’ అంటూ కామెంట్ చేశాడు. రోహిత్ కామెంట్‌కు స్పందించిన అశ్విన్.. ఆ సమయంలో అతని మనసులో జాతీయ గీతాలాపన చేసుకుంటున్నాడు అంటూ రిప్లై ఇచ్చాడు. మొత్తంగా అశ్విన్ పోస్ట్ చేసిన ఫోటో నెట్టింట హల్ చల్ చేస్తోంది.

Also read:

vakeel saab : పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ .. ‘వకీల్ సాబ్’ షూటింగ్ పూర్తిచేసిన పవన్ కళ్యాణ్

Strain virus: స్ట్రెయిన్ వైర‌స్‌పై ప్ర‌స్తుత వ్యాక్సిన్‌లు ప‌ని చేయ‌వ‌ని ఆధారాలేమి లేవు: కేంద్ర ప్ర‌భుత్వం

Ravichandran Ashwin Tweet:

View this post on Instagram

A post shared by Ashwin (@rashwin99)