Strain virus: స్ట్రెయిన్ వైర‌స్‌పై ప్ర‌స్తుత వ్యాక్సిన్‌లు ప‌ని చేయ‌వ‌ని ఆధారాలేమి లేవు: కేంద్ర ప్ర‌భుత్వం

ఒక వైపు క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తుంటే మ‌రో వైపు కొత్త ర‌కం స్ట్రైయిన్ వైర‌స్ మ‌రింత భ‌య‌పెట్టిస్తోంది. క‌రోనాను అరిక‌ట్టేందుకు భార‌త్‌తో పాటు ప్ర‌పంచ దేశాలు సైతం ....

Strain virus: స్ట్రెయిన్ వైర‌స్‌పై ప్ర‌స్తుత వ్యాక్సిన్‌లు ప‌ని చేయ‌వ‌ని ఆధారాలేమి లేవు: కేంద్ర ప్ర‌భుత్వం
Follow us

|

Updated on: Dec 29, 2020 | 8:29 PM

ఒక వైపు క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తుంటే మ‌రో వైపు కొత్త ర‌కం స్ట్రైయిన్ వైర‌స్ మ‌రింత భ‌య‌పెట్టిస్తోంది. క‌రోనాను అరిక‌ట్టేందుకు భార‌త్‌తో పాటు ప్ర‌పంచ దేశాలు సైతం వ్యాక్సిన్ త‌యారీలో త‌ల‌మున‌క‌ల‌వుతున్నాయి. ఈ వ్యాక్సిన్ బ‌య‌ట‌కు రాక‌ముందే మ‌రో కొత్త వైర‌స్ ద‌డ పుట్టిస్తోంది. భార‌త్‌లో ప‌లు వ్యాక్సిన్లు తుది ప్ర‌యోగ ద‌శ‌లో ఉన్నాయి. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో వ్యాక్సినేష‌న్ ప్రారంభిస్తామ‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

ఇక కోవిడ్ -19ను ఎదుర్కొనేందుకు ప్ర‌స్తుతం అందుబాటులోకి వ‌స్తున్న వ్యాక్సిన్లు కొత్త స్ట్రైయిన్ వైర‌స్‌పై ప‌ని చేయ‌వ‌ని ఎలాంటి ఆధారాలు లేవ‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. వ్యాక్సిన్ స్ట్రైయిన్‌పై కూడా ప‌ని చేస్తుంద‌ని భార‌త ప్ర‌భుత్వ ప్రిన్సిప‌ల్ సైంటిఫిక్ అడ్వైజ‌ర్ ప్రొఫెస‌ర్ కె. విజ‌య్ రాఘ‌వ‌న్ తెలిపారు. అయితే ముందు ఎదుర్కొన్న క‌రోనా వైర‌స్‌తో పోల్చుకుంటే ఈ కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ ఇత‌రుల‌కు వేగంగా సోకే ప్ర‌మాదం ఉంద‌ని పేర్కొన్నారు.

క‌రోనా రూపాంత‌రం చెంది స్టైయిన్ వైర‌స్‌గా మారిన‌ప్ప‌టికీ, ఆ వైర‌స్ కేవ‌లం మ‌నిషి రోగ నిరోధ‌క శ‌క్తిని మాత్ర‌మే త‌గ్గించ‌గ‌ల‌ద‌ని, వ్యాక్సిన్ ప‌ని చేయ‌కుండా ఉండే ప‌రిస్థితి ఏమి లేద‌ని అన్నారు. కానీ క‌రోనా వైర‌స్ రూపాంత‌రం చెందుతున్న ‌త‌రుణంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తం ఉంటూ జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం మంచిద‌ని సూచించారు. యూకేలోఎ వెలుగు చూసిన కొత్త స్ట్రైయిన్ వైర‌స్ అక్క‌డి నుంచి భార‌త్‌కు వ‌చ్చిన వారిలో ఆరుగురికి సోకింది. వారిని క్వారంటైన్‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అప్ర‌మ‌త్త‌మైన కేంద్రం యూకే నుంచి భార‌త్‌కు వ‌చ్చే విమానాలపై సైతం నిషేధం విధించింది.

Also Read:

క‌ల‌వ‌ర పెడుతున్న స్ట్రైయిన్ ‌.. మరి కొంత కాలం బ్రిటన్‌కు విమానాలు రద్దు: కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్

కొత్త రకం కరోనా ప్రాణాంతకం కాదు.. వేగంగా విస్తరిస్తుందే కానీ చంపేంత ప్రమాదకరం కాదన్న ఆరోగ్య మంత్రి ఈటల

Latest Articles