BJP: 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారా? కాంగ్రెస్ ఆరోపణలపై మోదీ క్లారిటీ..
సొంత పార్టీ రాజ్యాంగాన్ని గౌరవించలేని కాంగ్రెస్.. దేశ రాజ్యాంగాన్ని ఎలా గౌరవిస్తుంది? సూటిగా ఇదే సమాధానం ఇచ్చారు ప్రధాని మోదీ. రాజ్యాంగ పవిత్రతను, రాజ్యాంగ గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ దెబ్బ తీసిందని, కాంగ్రెస్ పార్టీ నీలం సంజీవరెడ్డిని అధికారికంగా రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినా ఓడించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అసలు రాజ్యాంగంతో ఆటలాడిందే కాంగ్రెస్ అని విమర్శించారు. నెహ్రూను ప్రజాస్వామ్య ప్రముఖుడిగా కాంగ్రెస్ చెప్పుకుంటుంది గానీ.. పార్లమెంట్‌లో నెహ్రూ చేసిన తొలి రాజ్యాంగ సవరణ వాక్ స్వాతంత్య హక్కును హరించేలా చేసిన సవరణే అని గుర్తు చేశారు.
సొంత పార్టీ రాజ్యాంగాన్ని గౌరవించలేని కాంగ్రెస్.. దేశ రాజ్యాంగాన్ని ఎలా గౌరవిస్తుంది? సూటిగా ఇదే సమాధానం ఇచ్చారు ప్రధాని మోదీ. రాజ్యాంగ పవిత్రతను, రాజ్యాంగ గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ దెబ్బ తీసిందని, కాంగ్రెస్ పార్టీ నీలం సంజీవరెడ్డిని అధికారికంగా రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినా ఓడించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అసలు రాజ్యాంగంతో ఆటలాడిందే కాంగ్రెస్ అని విమర్శించారు. నెహ్రూను ప్రజాస్వామ్య ప్రముఖుడిగా కాంగ్రెస్ చెప్పుకుంటుంది గానీ.. పార్లమెంట్‌లో నెహ్రూ చేసిన తొలి రాజ్యాంగ సవరణ వాక్ స్వాతంత్య హక్కును హరించేలా చేసిన సవరణే అని టీవీ9కు ఇచ్చిన ఇంటర్వూలో గుర్తు చేశారు.
తొలి రాజ్యాంగ ప్రతిని రూపొందించినప్పుడు అందులో ప్రతి పేజీలో పెయింటింగ్స్ ఉన్నాయన్నారు మోదీ. ఆ చిత్రాలు వేల సంవత్సరాల సంస్కృతిని జోడించేవని, భారత సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర అంతా ఆ చిత్రాల్లో పొందుపరిచారని చెప్పుకొచ్చారు. అలాంటి రాజ్యాంగ మూలప్రతిలో ఉన్న చారిత్రక, సాంస్కృతిక భావాన్ని కాంగ్రెస్ నష్టపరిచిందని విమర్శించారు. అసలు ఆ పేజీలే తొలగించేశారని, ఆ తర్వాత అవి ప్రింట్ కూడా కాలేదన్నారు. తాము కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ సమయంలో అసలైన రాజ్యాంగ ప్రతిని ముద్రించి ఎంపీలకు ఇచ్చామన్నారు మోదీ.
ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ఉపయోగించుకుందన్నారు మోదీ. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి వయనాడ్‌లో గెలిచారా? అలాంటి ఒప్పందం ఏమైనా కుదిరిందా? దీని బదులుగా దేశంలో ఎన్నికలు గెలిచారా? అని ప్రశ్నించారు. ఇదే రాజ్యాంగం ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు లభించిన రిజర్వేషన్లను లాక్కోడానికి కాంగ్రెస్ దారులు వెతుకుతోందని విమర్శించారు. కాంగ్రెస్ మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటోందని దానికి బీజేపీ వ్యతిరేకం అని చెప్పుకొచ్చారు. అసలు రాజ్యాంగం తయారైనప్పుడు మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొచ్చా అనే విషయంపై పెద్ద చర్చే జరిగిందని, అందరూ ఏకాభిప్రాయంతో మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వరాదని నిర్ణయించారని చెప్పుకొచ్చారు. అలాంటిది మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలంటూ కాంగ్రెస్ బయలుదేరిందని కామెంట్ చేశారు.
రాజ్యాంగం అంత పవిత్రమైనప్పుడు కశ్మీర్‌లో రాజ్యాంగం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఆర్టికల్ 370ని అడ్డుగోడగా పెట్టి భారత రాజ్యాంగాన్ని ఈ పరిస్థితికి ఎందుకు తెచ్చారని, ఇది అంబేద్కర్‌ను అవమానించడం కాదా అని కాంగ్రెస్‌కు సూటి ప్రశ్న వేశారు. తాను రాజ్యాంగానికి అతి పెద్ద సేవ చేసి, కశ్మీర్ నుంచి ఆర్టికల్ 370 తొలగించి భారత రాజ్యాంగం అమలయ్యేలా చేశానన్నారు.
తాను పార్లమెంట్‌కు వచ్చినప్పుడు రాజ్యాంగ దినోత్సవం జరపాలనే ప్రస్తావన తెస్తే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందన్నారు మోదీ. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న ఖర్గే పార్లమెంట్‌లో ప్రకటన చేస్తూ.. జనవరి 26 ఉండగా రాజ్యాంగ దినోత్సవ అవసరమేంటని ప్రశ్నించారని గుర్తు చేశారు. రాజ్యాంగానికి 75 ఏళ్లయిన సందర్భంగా ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించి, రాజ్యాంగ పవిత్రతను, మహత్యాన్ని ప్రజలు అర్థం అయ్యేలా చేసిన వ్యక్తిగా.. కాంగ్రెస్ ఆరోపణలను ఖండిస్తున్నానని టీవీ9కు ఇచ్చిన ఇంటర్వూలో ప్రస్తావించారు ప్రధాని మోదీ.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..