AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aditi Rao Hydari: సిద్ధార్థ్‏తో రహస్యంగా నిశ్చితార్థం.. ఫోటో షేర్ చేయడానికి రీజన్ ఇదే.. హీరోయిన్ అదితి కామెంట్స్..

తెలంగాణంలోని వనపర్తి జిల్లాలోని 400 ఏళ్లనాటి పురాతన రంగనాయక ఆలయంలో వీరు తమ నిశ్చితార్థాన్ని జరుపుకున్నారు. ఎలాంటి హడావిడి లేకుండా ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పటికీ కేవలం ఒక ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు క్లారిటీ ఇచ్చేశారు. చాలా రోజుల తర్వాత మొదటిసారి అదితి తమ ఎంగేజ్మెంట్ వేడుక గురించి రియాక్ట్ అయ్యింది.

Aditi Rao Hydari: సిద్ధార్థ్‏తో రహస్యంగా నిశ్చితార్థం.. ఫోటో షేర్ చేయడానికి రీజన్ ఇదే.. హీరోయిన్ అదితి కామెంట్స్..
Aditi Rao Hydari, Siddarth
Rajitha Chanti
|

Updated on: May 03, 2024 | 6:48 AM

Share

టాలీవుడ్ హీరోయిన్ అదితి రావు హైదరీ, హీరో సిద్ధార్థ్ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు గత నెలలో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ఈ వేడుకకు కేవలం కుటుంబసభ్యులు, సన్నిహితులు మాత్రమే హజరయ్యారు. తెలంగాణంలోని వనపర్తి జిల్లాలోని 400 ఏళ్లనాటి పురాతన రంగనాయక ఆలయంలో వీరు తమ నిశ్చితార్థాన్ని జరుపుకున్నారు. ఎలాంటి హడావిడి లేకుండా ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పటికీ కేవలం ఒక ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు క్లారిటీ ఇచ్చేశారు. చాలా రోజుల తర్వాత మొదటిసారి అదితి తమ ఎంగేజ్మెంట్ వేడుక గురించి రియాక్ట్ అయ్యింది. తన తల్లికి కంటిన్యూగా కాల్స్ వస్తున్నందున తమ నిశ్చితార్థం గురించి రియాక్ట్ కావాల్సి వస్తుందని అన్నారు అదితి. ప్రస్తుతం ఆమె హీరామండి వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే.

ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల బాలీవుడ్ బబుల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అదితి మాట్లాడుతూ.. “ప్రతి ఒక్కరు తమ జీవితంలో జరిగే వేడుకలను ప్రత్యేక ప్రదేశాల్లో ప్రారంభించాలనుకుంటారు. అందుకే నేను కూడా మా కుటుంబానికి చెందిన 400 ఏళ్లనాటి ఆలయంలో మా కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నారు. అందుకే నేను అక్కడి వెళ్లి పూజా చేయాలనుకున్నాను. మేము నిశ్చితార్థం చేసుకున్నాము. కానీ దానికి చాలా రూమర్స్ సృష్టించారు. అందుకే మా ఫోటో షేర్ చేసి వాటికి క్లారిటీ ఇవ్వాలనుకున్నాము. ఎందుకంటే మా అమ్మకు కంటిన్యూగా కాల్స్ వస్తున్నాయి. అందుకే మా ఫోటో షేర్ చేస్తూ అందరికి స్పష్టత ఇచ్చాము.” అంటూ చెప్పుకొచ్చింది అదితి.

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలిగిన సిద్ధార్థ్ ఇప్పుడు తమిళంలో సినిమాలు చేస్తున్నారు. ఇక అదితి బాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తుంది. వీరిద్దరు కలిసి మహా సముద్రం సినిమాలో నటించారు. అదే సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ కలిసి ఈవెంట్స్, పార్టీలలో పాల్గొనడంతో వీరి ప్రేమ విషయం బయటకు వచ్చింది. గత నెలలో తెలంగాణలోని వనపర్తి జిల్లాలోని శ్రీరాంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో వీరి నిశ్చితార్థం జరిగింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి