IND vs SA: 1, 0, 0, 0, 0.. వరస పెట్టి పెవిలియన్ కు క్యూ కడుతున్న దక్షిణాఫ్రికా ఆటగాళ్లు..

భారత్ తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్స్ ఘోరంగా విఫలమయ్యారు. మూడు ఓవర్లు పూర్తికాకుండానే ఐదు వికెట్లను సౌతాఫ్రికా నష్టపోయింది. అర్ష్ దీప్ సింగ్, దీపక్ చహర్ బౌలింగ్ లో అదరగొట్టారు. కేవలం..

IND vs SA: 1, 0, 0, 0, 0.. వరస పెట్టి పెవిలియన్ కు క్యూ కడుతున్న దక్షిణాఫ్రికా ఆటగాళ్లు..
Arshdeep
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 28, 2022 | 7:39 PM

భారత్ తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్స్ ఘోరంగా విఫలమయ్యారు. మూడు ఓవర్లు పూర్తికాకుండానే ఐదు వికెట్లను సౌతాఫ్రికా నష్టపోయింది. అర్ష్ దీప్ సింగ్, దీపక్ చహర్ బౌలింగ్ లో అదరగొట్టారు. కేవలం ఒక ఓవర్ లోనే అర్ష్ దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్ వేసిన మొదటి ఓవర్లో ఒక వికెట్ మూడో ఓవర్ లో మరో వికెట్ తీసుకున్నాడు. దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్ వరుసగా విఫలమవుతూ వచ్చారు. క్వింటన్ డికాక్ 1, కెప్టెన్ బవుమా 0, రిలీ రోసౌ 0, డేవిడ్ మిల్లర్ 0, స్టబ్స్ 0 ఇలా వరుస పెట్టి అవుటవ్వడంతో దక్షిణాఫ్రికా పవర్ ప్లే పూర్తికాకుండానే పీకలోతు కష్టాలో పడింది.

భారత్ బౌలర్లు టీమిండియాకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అర్ష్ దీప్ పై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ తాను వేసిన మొదటి ఒవర్లోనే మూడు వికెట్లు అందించాడు. దక్షిణాఫ్రికాకు నిజానికి మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికి టాప్ బ్యాట్స్ మెన్స్ విఫలమయ్యారు. డికాక్, బవుమా, డేవిడ్ మిల్లర్ కేవలం 1, 0,0 పరుగులకే ఔటయ్యారు. 9 పరుగులకే ఐదు వికెట్లు పడటంతో ఆతర్వాత దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్స్ మార్కరామ్, పర్నీల్ ఆచీతూచీ ఆడుతున్నారు. 2.3 ఓవర్లలో 9 పరుగులకే ఐదు వికెట్లు పడిపోయిన తర్వాత వీరిద్దరూ నెమ్మదిగా ఆడుతూ పవర్ ప్లే పూర్తయ్యేటప్పటికి వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేశారు. పవర్ ప్లే పూర్తయ్యే సమయానికి మార్కరామ్ 17,పర్నీల్ 9 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..

ఇవి కూడా చదవండి