Nikhat Zareen: తెలుగమ్మాయి పవర్‌ పంచ్‌లకు ఆనంద్‌ మహీంద్రా ఫిదా .. గోల్డెన్‌ గర్ల్‌ నిఖత్‌కు ఏం గిఫ్ట్‌ ఇచ్చాడో తెలుసా?

|

Mar 28, 2023 | 3:03 PM

తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. ఢిల్లీ వేదికగా జరిగిన ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణపతకం సాధించింది నిఖత్‌. 50 కేజీల విభాగంలో వియత్నాం బాక్సర్‌ ఎన్‌గెయెన్‌ థి టామ్‌పై పూర్తి ఆధిపత్యం కొనసాగించిన జరీన్‌ 5-0తో గెలిచింది.

Nikhat Zareen: తెలుగమ్మాయి పవర్‌ పంచ్‌లకు ఆనంద్‌ మహీంద్రా ఫిదా .. గోల్డెన్‌ గర్ల్‌ నిఖత్‌కు ఏం గిఫ్ట్‌ ఇచ్చాడో తెలుసా?
Anand Mahindra, Nikhat
Follow us on

తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. ఢిల్లీ వేదికగా జరిగిన ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణపతకం సాధించింది నిఖత్‌. 50 కేజీల విభాగంలో వియత్నాం బాక్సర్‌ ఎన్‌గెయెన్‌ థి టామ్‌పై పూర్తి ఆధిపత్యం కొనసాగించిన జరీన్‌ 5-0తో గెలిచింది. తద్వారా ప్రతిష్ఠాత్మక టోర్నీలో మరోసారి బంగారు పతకంతో మెరిసింది. వరల్డ్‌ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెల్చుకోవడం నిఖత్‌కు ఇది వరుసగా రెండోసారి కావడం విశేషం. గతేడాది కూడా 52 కేజీల విభాగంలో మొదటిసారి ప్రపంచ ఛాంపియన్‌గా జయకేతనం ఎగరవేసింది. భారత బాక్సింగ్‌ చరిత్రలో సరికొత్త ఆధ్యాయాన్ని లిఖించిన తెలంగాణ ముద్దుబిడ్డపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆమెను పొగుడుతూ పోస్టులు పెడుతున్నారు. ఈక్రమంలో క్రీడారంగంలో అత్యుత్తమ విజయాలు సాధించిన వారికి కార్లను బహుమతిగా ఇస్తూ ప్రోత్సహించే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా నిఖత్‌కు కూడా ఓ స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చారు.

నిఖత్ జరీన్‌ విజయాన్ని గర్విస్తూ ఆమెకు గోల్డెన్‌ గర్ల్‌గా కితాబిచ్చిరు ఆనంద్‌ మహీంద్రా. ఈ సందర్భంగా ఆమెకు ‘మహీంద్రా ఎమర్జింగ్ బాక్సింగ్ ఐకాన్‌’ అవార్డుతో పాటు మహీంద్రా కంపెనీ థార్ SUV బహుమతిగా ఇస్తున్నట్లు మహీంద్రా ఆటోమోటివ్ సంస్థ పేర్కొంది. కాగా మహీంద్రా థార్ విషయానికి వస్తే, ఇండియన్‌ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఇది ఒకటి. ఇందులో రెండు డీజిల్ ఇంజిన్స్, ఒక పెట్రోల్ ఇంజిన్ ఆప్సన్స్ అందుబాటులో ఉంటాయి. ఇక ఫీచర్లతో పాటు పనితీరు అత్యద్భుతంగా ఉంటుంది. మహీంద్రా థార్ ధర రూ. 9.99 లక్షల నుండి రూ. 16.49 లక్షల వరకు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..