సింధు బయోపిక్‌ ఎందుకు లేటవుదంటే..!

దేశంలో అత్యున్నత పౌర పురస్కారంగా భావించే ‘పద్మభూషన్’ అవార్డుకు ఇటీవలే ఎంపికైంది భారత బాట్మింటన్ స్టార్ పీవీ సింధు. ఈ నేపథ్యంలో ఆమెను పీబీఎల్‌ హైదరాబాద్‌ హంటర్స్‌ టీమ్‌ ఘనంగా సన్మానించింది. ఈ సీజన్‌లో సింధు సారథ్యంలో హంటర్స్‌ టీమ్‌ తప్పక విజయం సాధిస్తుందని యాజమాన్యం అభిప్రాయపడింది. సింధు కూడా హంటర్స్  తరఫున ఆడటం ఆనందంగా ఉందని పేర్కొంది. రాబోయే మ్యాచ్‌ల్లో గెలిచేందుకు అన్ని ఎఫర్ట్స్ పెడతామని తెలిపింది. మరోవైపు సింధు బయోపిక్ ప్రస్తుతానికి ఆగిపోయినట్టు తెలుస్తోంది. […]

  • Ram Naramaneni
  • Publish Date - 9:38 pm, Tue, 28 January 20
సింధు బయోపిక్‌ ఎందుకు లేటవుదంటే..!

దేశంలో అత్యున్నత పౌర పురస్కారంగా భావించే ‘పద్మభూషన్’ అవార్డుకు ఇటీవలే ఎంపికైంది భారత బాట్మింటన్ స్టార్ పీవీ సింధు. ఈ నేపథ్యంలో ఆమెను పీబీఎల్‌ హైదరాబాద్‌ హంటర్స్‌ టీమ్‌ ఘనంగా సన్మానించింది. ఈ సీజన్‌లో సింధు సారథ్యంలో హంటర్స్‌ టీమ్‌ తప్పక విజయం సాధిస్తుందని యాజమాన్యం అభిప్రాయపడింది. సింధు కూడా హంటర్స్  తరఫున ఆడటం ఆనందంగా ఉందని పేర్కొంది. రాబోయే మ్యాచ్‌ల్లో గెలిచేందుకు అన్ని ఎఫర్ట్స్ పెడతామని తెలిపింది.

మరోవైపు సింధు బయోపిక్ ప్రస్తుతానికి ఆగిపోయినట్టు తెలుస్తోంది. కొన్ని పరిమితులు విషయంలో మూవీ ప్రొడక్షన్ హౌజ్‌కు తమకు పూర్తి ఏకాభిప్రాయం రాలేదని..అవన్నీ సెట్ అవ్వగానే మూవీ ప్రారంభం అవుతుందని సింధు తండ్రి తెలిపారు. ఇక ప్రిమియర్ బాట్మింటన్ లీగ్‌లో హైదరాబాద్ హంటర్స్ మంచి ప్రదర్శన ఇస్తోంది.