Sreenidhi University: శ్రీనిధి యూనివర్సిటీ ఔత్సాహిక ఇంజనీర్లకు స్వర్గధామం.. ఆ కోర్సు అందించే ఏకైక వర్సిటీ ఇదే!
నేటి పోటీ ప్రపంచంలో ఇంజనీరింగ్ పట్టా అనేది కేవలం డిగ్రీ మాత్రమేకాదు. ఇది ఒక ఉన్నత స్థానానికి చేర్చే ఓ అయుధం కూడా. హైదరాబాద్‌లోని శ్రీనిధి యూనిరవర్సిటీ అటు ఔత్యాహిక ఇంజనీరింగ్ విద్యార్ధులకు ఓ మంచి ఎంపిక. ఇక్కడి విద్య.. ఆవిష్కరణలు, పరిశ్రమ ఏకీకరణ, విద్యార్థుల సాధికారత చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది. ఈ యూనివర్సిటీ ధోరణులను..

ఇంజనీరింగ్ చదవాలనుకునే విద్యార్ధులు.. ఎక్కడ అభ్యసించాలి అనే విషయం వారి భవిష్యత్తు కోసం తీసుకునే అతి ముఖ్యమైన నిర్ణయాలలో ఒకటి. నేటి పోటీ ప్రపంచంలో ఇంజనీరింగ్ పట్టా అనేది కేవలం డిగ్రీ మాత్రమేకాదు. ఇది ఒక ఉన్నత స్థానానికి చేర్చే ఓ అయుధం కూడా. హైదరాబాద్‌లోని శ్రీనిధి యూనిరవర్సిటీ అటు ఔత్యాహిక ఇంజనీరింగ్ విద్యార్ధులకు ఓ మంచి ఎంపిక. ఇక్కడి విద్య.. ఆవిష్కరణలు, పరిశ్రమ ఏకీకరణ, విద్యార్థుల సాధికారత చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది. ఈ యూనివర్సిటీ ధోరణులను గుడ్డిగా అనుసరించదు.. వాటిని సెట్ చేస్తుంది. అందుకే మిగతా కాలేజీల్లో ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రత్యేక కార్యక్రమాలు, ఎక్సలెన్స్ సెంటర్స్, స్టార్టప్ సపోర్ట్.. ప్రతి విద్యార్ధిని అభివృద్ధి చెందేలా చేసే శక్తివంతమైన స్టూడెంట్ కల్చర్ ఉంటుంది.
శ్రీనిధి యూనివర్సిటీ ప్రత్యేకతలివే..
ఫ్యూచర్ ఫోకస్‌డ్ విజన్
శ్రీనిధి యూనివర్సిటీ.. 21వ శతాబ్దంలో విద్యను పునర్నిర్మించడానికి దార్శనికత, విజనరీ అకడమిక్ లీడర్‌షిప్ పునాదిపై నిర్మించబడింది. ఇక్కడి విద్యా కార్యక్రమాలు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అంతర్-విభాగాలుగా, ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే సమయంలో మార్పు, ఆవిష్కరణ, నాయకత్వం కోసం సిద్ధంగా ఉండే మనస్తత్వాన్ని కలిగి ఉండేలా ఇక్కడి విద్యాబోధన ఉంటుంది.
హైదరాబాద్ ఇన్నోవేషన్ కారిడార్‌లో వ్యూహాత్మక ఏర్పాటు
భారతదేశంలోని ప్రముఖ IT, స్టార్టప్ హబ్‌లలో ఒకటైన హైదరాబాద్‌లోని శ్రీనిధి యూనివర్సిటీ స్పష్టమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఇండస్ట్రీ మెంటర్‌షిప్, ఇంటర్న్‌షిప్‌లు, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను అందించడంలో వర్సిటీ మేటీ. ఇక్కడి విద్యార్థులు క్రమం తప్పకుండా టెక్ లీడర్స్‌తో టచ్‌లో ఉంటారు. వారి నెట్‌వర్కింగ్ ఈవెంట్‌లకు హాజరవుతారు.
స్టూడెంట్ ఆధారిత క్లబ్‌లు- అద్భుతమైన క్యాంపస్ సంస్కృతి
తరగతి గది లోపలేకాదు వెలుపల విషయాలు కూడా అంతే ముఖ్యం. శ్రీనిధి యూనివర్సిటీలో కోడింగ్, రోబోటిక్స్, వ్యవస్థాపకత, నృత్యం, సాహిత్యం మరిన్ని డొమైన్‌లలో విద్యార్థుల నేతృత్వంలోని క్లబ్‌లకు నిలయంగా ఉంటుంది. కల్చరల్ ఫెస్ట్, ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్, స్పోర్ట్స్ లీగ్స్, టెక్ కాన్ క్లేవ్‌లతో క్యాంపస్ లైఫ్ భలే జోష్‌గా ఉంటుంది.
ఇన్నోవేషన్ ల్యాబ్‌లు,ప్రాజెక్ట్‌ల ద్వారా హ్యాండ్స్-ఆన్ లెర్నింగ్
శ్రీనిధిలో ఇంజనీరింగ్ విద్య తరగతి గదికే పరిమితం కాదు. విద్యార్థులు ప్రాజెక్ట్-ఆధారిత అభ్యాసంలోనూ పాలు పంచుకుంటారు. AI, రోబోటిక్స్, IoT, హ్యాండ్స్-ఆన్ ఎక్స్‌ప్లోరేషన్.. ల్యాబ్‌ల ద్వారా స్థిరమైన సాంకేతికతను నేర్చుకుంటారు. ప్రయోగాలు, ప్రోటోటైపింగ్ చేయడం ద్వారా ఎక్కవ నేర్చుకోవడాన్ని అవకాశం ఉంటుంది.
కెరీర్ డెవలప్‌మెంట్ సెంటర్ (CDC)
కెరీర్ డెవలప్‌మెంట్ సెంటర్ విద్యార్థుల విజయానికి ఒక లాంచ్ ప్యాడ్ వంటిది. రెజ్యూమ్-బిల్డింగ్ నుంచి మాక్ ఇంటర్వ్యూలు, గ్లోబల్ ఇంటర్న్‌షిప్‌లు, ప్లేస్‌మెంట్ డ్రైవ్‌ల వరకు CDC ఏడాది పొడవునా విద్యార్థులను అగ్రశ్రేణి కంపెనీలు, కెరీర్ మార్గాలతో అనుసంధానించడానికి పనిచేస్తుంది. యూనివర్సిటీలో ఆకర్షణీయమైన ప్యాకేజీలతో యేటా ప్లేస్‌మెంట్‌లను కూడా నిర్వహిస్తుంది. ప్రపంచ టెక్ దిగ్గజాల నుంచి రూ.40 లక్షల వరకు ప్యాకేజీతో జాబ్ ఆఫర్స్ అందిస్తుంది.
స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ – బియాండ్ ప్లేస్‌మెంట్స్
CDC మాత్రమే కాకుండా శ్రీనిధి వర్సిటీలో నైపుణ్య అభివృద్ధి సెంటర్లు కూడా ఉంటాయి. సర్టిఫికేషన్ల నుంచి కమ్యూనికేషన్, డిజిటల్ అక్షరాస్యత, నాయకత్వం వరకు భవిష్యత్తుకు అవసరంమైన సామర్థ్యాలను నిర్మించడంపై ఈ కేంద్రం దృష్టి సారిస్తుంది. తర్వాత విద్యార్థులు కేవలం ఉపాధి పొందడానికి మాత్రమే కాకుండా, వారిని అసాధారణమైనవారినిగా తయారు చేస్తుంది.
ASCEND – స్టూడెంట్ స్టార్టప్ అండ్ ఇంక్యుబేషన్ హబ్
ASCEND అనేది వర్సిటీకి చెందిన స్టార్టప్, వ్యవస్థాపకత మద్దతు కేంద్రం. ఇక మార్గదర్శకత్వం, నిధుల యాక్సెస్, ఇంక్యుబేషన్ స్థలం, నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌లతో ASCEND నిండి ఉంటుంది. ఇది విద్యార్థుల ఆలోచనలకు జీవం పోయడంలో సహాయపడుతుంది. విద్యార్ధులు యాప్‌ను నిర్మించినా లేదా సామాజిక సంస్థను ప్రారంభించినా, దార్శనికతను వెంచర్‌గా మార్చడానికి అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తుంది.
CETLI – సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్, లెర్నింగ్, ఇన్నోవేషన్
సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్, లెర్నింగ్ అండ్ ఇన్నోవేషన్ (CETLI) క్యాంపస్.. విద్యా ఆవిష్కరణలను అందిస్తుంది. ఫ్లిప్డ్ లెర్నింగ్, డిజైన్ థింకింగ్, టెక్-ఎనేబుల్డ్ టీచింగ్ వంటి తాజా బోధనా పద్ధతులపై అధ్యాపకులను సన్నద్ధం చేస్తుంది. విద్యార్థుల ఇంటరాక్టివ్, ఎంగేజింగ్, డీప్ ఇంపాక్‌కు ఉపకరిస్తుంది.
శ్రీనిధి SDG ఇంపాక్ట్ ప్రోగ్రామ్
శ్రీనిధి యూనివర్సిటీలో విద్య విధానం.. తరగతి గదులు, పాఠ్యపుస్తకాలకు మించి ఉండాలనేది వర్సిటీ నిర్వాహకుల ఉద్దేశ్యం. ఈ విధానం వర్సిటీకి వచ్చే విద్యార్ధులను గ్రాడ్యుయేట్‌లుగా మాత్రమే కాకుండా వారిలో సమూల మార్పును తీసుకువస్తుంది. శ్రీనిధి SDG ఇంపాక్ట్ ప్రోగ్రామ్ వెనుక ఉన్న దార్శనికత, లక్ష్యాన్ని పెంపొందించడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, స్థిరమైన, వాస్తవ-ప్రపంచ ప్రభావాన్ని సృష్టించడానికి, విద్యార్థులను శక్తివంతం చేయడానికి రూపొందించబడిన పరివర్తనాత్మక నాలుగు సంవత్సరాల ప్రయాణం ఇది.
దక్షిణ భారత్‌లో క్లౌడ్ ERP (SAP)తో CSE బ్రాంచ్ కలిగిన BTech కోర్సు అందించే ఏకైక వర్సిటీ
క్లౌడ్ ERP (SAP)లో స్పెషలైజేషన్‌తో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో BTechను అందించే దక్షిణ భారత ఏకైక యూనివర్సిటీ శ్రీనిధి ఒక్కటే. SAP-సర్టిఫైడ్ శిక్షణతోపాటు ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ ఎడ్జ్‌తో విద్యార్థులు డిగ్రీ పట్టా అందుకుంటారు. ఇది ఇండస్ట్రీ వరల్డ్ అధిక డిమాండ్ ఉన్న కోర్సు.
శ్రీనిధి యూనివర్సిటీలో విద్యార్ధుల ప్రయాణం వారి భవిష్యత్తుకు స్వర్గధామం
శ్రీనిధి యూనివర్సిటీలో విద్యార్ధులు కేవలం డిగ్రీని మాత్రమే సంపాదించరు. ఆవిష్కరణ, శ్రేష్ఠత,విద్యార్థుల సాధికారతలోనూ ముఖ్య భాగం అవుతారు. స్టార్టప్‌ను నిర్మించాలన్నా, భవిష్యత్ సాంకేతికతలో నైపుణ్యం సాధించాలన్నా, ఇంజనీరింగ్‌లో ప్రపంచ నాయకుడిగా ఎదగాలని కోరుకునేవారికి శ్రీనిధి యూనివర్సిటీకి మించిన మరో విద్యాసంస్థలేదంటే అతిశయోక్తి కాదేమో!
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




