Yippee Toss: ‘టాస్’.. అసలు విషయం చెప్పేసిన బుమ్రా, సూర్యకుమార్, ద్రవిడ్
ఈ సమయంలో క్రికెట్ ఫీవర్ క్యాష్ చేసుకుంది ఐటీసీ కంపెనీకి చెందిన ప్రముఖ ఇన్‌స్టంట్ న్యూడిల్ సంస్థ ఇప్పి. తాజాగా ద్రవిడ్‌తో పాటు టీమిండియా ప్లేయర్స్ జస్ప్రీత్ బుమ్రా, సూర్య కుమార్ యాదవ్‌లతో 'టాస్' పేరుతో ఓ ప్రచారాన్ని నిర్వహించింది. నెట్టింట ఆసక్తిగా మారిన ఈ 'టాస్' క్యాంపెయిన్ అసలు విషయం ఏంటో తాజాగా విడుదల చేశారు...
ప్రస్తుతం దేశంలో క్రికెట్ ఫీవర్ నడుస్తోంది. అమెరికాలో జరుగుతోన్న టీ20 వరల్డ్ కప్‌ను క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో చూస్తున్నారు. తాజాగా టీమిండియా తన చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ జట్టుపై భారీ విజయాన్ని నమోదు చేయడంతో టీ20పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. భారత్ ఈసారి కచ్చితంగా టీ20 వరల్డ్ కప్ కొడుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమయంలో క్రికెట్ ఫీవర్ క్యాష్ చేసుకుంది ఐటీసీ కంపెనీకి చెందిన ప్రముఖ ఇన్‌స్టంట్ న్యూడిల్ సంస్థ ఇప్పి. తాజాగా ద్రవిడ్‌తో పాటు టీమిండియా ప్లేయర్స్ జస్ప్రీత్ బుమ్రా, సూర్య కుమార్ యాదవ్‌లతో ‘టాస్’ పేరుతో ఓ ప్రచారాన్ని నిర్వహించింది. నెట్టింట ఆసక్తిగా మారిన ఈ ‘టాస్’ క్యాంపెయిన్ అసలు విషయం ఏంటో తాజాగా విడుదల చేశారు.
గత కొన్ని రోజుల క్రితం బుమ్రా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ‘టాస్‌కు నేను సిద్ధంగా ఉన్నాను’ అంటూ ఓ పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫోస్ట్ వైరల్‌గా మారింది. అసలు ఈ పోస్ట్ అర్థం ఏంటో తెలియక తికమకపడ్డారు. కొందరైతే ఏకంగా బుబ్రా కెప్టెన్ కానున్నాడా అంటూ కామెంట్స్ చేశారు. ఇక అలాగే సూర్య కుమార్ యాదవ్ సైతం ‘టాస్ కోసం చాలా ఆతృతతో ఉన్నాను’ అంటూ ఓ పోస్ట్ చేశాడు. ఇది కూడా నెట్టింట వైరల్‌గా మారింది. అసలు వీరు దేని గురించి మాట్లాడుతున్నారని అంతా ఆసక్తికగా ఎదురుచూశారు. వీరితో పాటు బుమ్రా భార్య సంజనా.. సైతం ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ చేశారు. ‘బుబ్రా టాస్ కోసం ఎదురు చూస్తున్నాను’ అంటూ చేసిన పోస్ట్ సైతం వైరల్‌గామారింది. ఇక సూర్య కుమార్ భార్య దేద్విషా సైతం ఇలాంటి ఓ పోస్ట్ చేయడం నెట్టింట ట్రెండ్ అయ్యింది. అసలు వీళ్లు దేని గురించి పోస్ట్ చేస్తున్నారని అంతా ఆసక్తితో ఎదురుచూశారు.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
అయితే ఎట్టకేలకు టాస్ క్యాంపెయినింగ్ అసలు విషయం తెలిసిపోయింది. ప్రముఖ ఇన్‌స్టంట్ న్యూడిల్ తయారీ సంస్థ ఇప్పి.. ద్రవిడ్, సూర్యకుమార్, బుమ్రాలతో కలిసి ఒక ప్రకటన రూపొందించారు. దీనిపై బజ్ క్రియేట్ చేయడానికి ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేశరు. తాజాగా కంపెనీ ఈ యాడ్కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. బస్సులో విండో సీట్ కోసం బుమ్రా, సూర్యకుమార్‌లు గొడవపడుతుంటే.. ద్రవిడ్ వాళ్లకి న్యూడిల్స్‌తో ఓ వెరైటీ టాస్‌ను వివరిస్తాడు. ఈ నేపథ్యంగా ఫన్నీ యాడ్‌ను రూపొందించారు.
ఈ యాడ్ గురించి ఐటీసీ లిమిటెడ్ ఛీప్ ఆపరేటింగ్ ఆఫీసర్ కవిత చదుర్వేది మాట్లాడుతూ.. భారత దేశంలో క్రికెట్ అనేది ఒక భావోద్వేగం. అందుకే వారికి మా ప్రొడక్ట్‌ను చేరువ చేసేందుకు క్రికెట్‌ను ఉపయోగించామని చెప్పుకొచ్చారు. ఇక బుమ్రా మాట్లాడుతూ ఇప్పీ.. క్యాంపెయినింగ్ చేయడం చాలా సరదాగా సాగిందని తెలిపాడు. అలాగే సూర్యకుమార్ సైతం ఈ విషయమై స్పందిస్తూ.. ‘ఇప్పీ ప్రచారంలో భాగమైనందుకు చాలా థ్రిల్ అయ్యాను. ఎందుకంటే ఫీల్డ్‌తో పాటు బయట మా ఇద్దరి స్నేహాన్ని ఈ యాడ్ ప్రతిబించిందించి’ అని అన్నాడు. ఇక బుమ్రా, సూర్యకుమార్‌లతో కలిసి పనిచేయడం తనకు ఒక మరిచిపోలేని అనుభూతిని వచ్చిందని ద్రవిడ్ చెప్పుకొచ్చారు.