News9 Plus World Exclusive: 1993 ముంబై పేలుళ్లలో ఉపయోగించిన పేలుడు పదార్థాలను ఐఎస్‌ఐ ఇండియాలోకి ఎలా తీసుకొచ్చింది.?
1993 Mumbai Blasts: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 1993లో జరిగిన ఉగ్రదాడి చరిత్ర ఎన్నటికీ మరవని మారణ హోమాల్లో ఒకటి. భారత్‌పై జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడుల్లో ఇదీ ఒకటి. మార్చి 12వ తేదీ, 1993లో జరిగిన ఈ నెత్తుటి ఘటనలో 257 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 1400 మందికిపైగా..
1993 Mumbai Blasts: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 1993లో జరిగిన ఉగ్రదాడి చరిత్ర ఎన్నటికీ మరవని మారణ హోమాల్లో ఒకటి. భారత్‌పై జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడుల్లో ఇదీ ఒకటి. మార్చి 12వ తేదీ, 1993లో జరిగిన ఈ నెత్తుటి ఘటనలో 257 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 1400 మందికిపైగా గాయపడ్డారు. వరుస పేలుళ్ల ఘటన భారత భూభాగంపై జరిగిన మొదటి అతిపెద్ద ఘటనే కాకుండా అత్యంత ప్రమాదకరమైన ఆర్‌డిఎక్స్‌ను పేలుళ్లలో వాడారు. ఈ మరణహోమం జరిగి 30 ఏళ్లు గడుస్తోంది. ఇంతటి మారణ హోమాన్ని సృష్టించడానికి ఐఎస్‌ఐ పేలుడు పదార్థాలను భారత్‌లోకి ఎలా తీసుకొచ్చిందో న్యూస్9 ప్లస్ ప్రత్యేక వెబ్ సిరీస్ (The Jehadi Genaral)గా రూపొందించింది.
ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందంటే..
ఫిబ్రవరి 2, 1993 అర్థరాత్రి.. ముంబైకి సుమారు 100 కి.మీల దూరంలో దక్షిణంగా రాయగఢ్ తీరానికి ఒక గుర్తుతెలియని వాణిజ్య నౌక వచ్చింది. సముద్ర ఒడ్డున దావూద్ ఇబ్రహీం లెఫ్టినెంట్ టైర్ మీమన్ నౌకలో ఉన్న వ్యక్తితో వాకీ టాకీతో ఏదో మాట్లాడాడు. అనంతరం ఒడ్డు నుంచి ఒక చిన్న బోట్ వెళ్లి నౌకలో నుంచి కార్డ్‌బోర్డ్ బాక్సులను తీరానికి తీసుకొచ్చింది. ఇలా రెండు మూడు సార్లు జరిగాయి. ఈ సంఘటన జరిగిన నెల రోజుల తర్వాత ముంబయి పట్టణాన్ని 12 వరుస పేలుళ్లు కుదిపేశాయి. ఈ పేలుళ్లలో 1400 మంది గాయపడ్డారు, 257 మంది మరణించారు. ఇంతకీ ఆ నౌకలో వచ్చిన బాక్సుల్లో ఉన్నవి మరెంటో కాదు అత్యంత ప్రమాదకరమైన ఆర్‌డీఎక్స్ బాంబులు. వీటిని పాకిస్థాన్ ఆర్మీ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజనెన్స్ ముంబయికి పంపించింది.
న్యూస్ 9 ప్లస్ దర్యాప్తులో అప్పటి డైరెక్టర్ జనరల్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) లెఫ్టినెంట్ జనరల్ జావేద్ నసీర్ 1993 పేలుళ్ల సూత్రధారి అని తేలింది. ఈ ప్లాన్‌ను దావూద్ ఇబ్రహీంకు చెందిన అండర్ వరల్డ్ అమలు చేసింది. 2 టన్నులకు పైగా RDX, 62 టైప్ 56 అసాల్ట్ రైఫిల్స్, 691 ARGES – హ్యాండ్ గ్రెనేడ్‌లు. RDX ఘోరమైన నష్టాన్ని మిగిల్చాయి. ఈ పేలుడు మందు సాధారణ కార్లు, స్కూటర్‌లను భవనాలను ధ్వంసం చేసే పేలుడు పరికరాలుగా మార్చేసింది. ఇంతటి ప్రమాదకరమైన పేలుడు పదార్థాలను రోడ్డు మార్గంలో నగరంలోకి తరలించడం ఆశ్చర్యకరమైన విషయం.
అయితే పేలుళ్లు జరిగిన ముప్పై ఏళ్ల తర్వాత వారు రాయ్‌ఘడ్ నుంచి ఎలా వచ్చారు అనేది మిస్టరీగా మిగిలిపోయింది. పేలుళ్లపై పోలీసులు దర్యాప్తు చేయలేదని ముంబై మాజీ పోలీసు కమిషనర్ ఎంఎన్ సింగ్ అన్నారు. “ఇది కేంద్ర సంస్థల పని” ఈ ప్రశ్నలను ఏ ఏజెన్సీలు అడగలేదని విచారణలో తేలింది. (అప్పుడు నేవీ చీఫ్ అడ్మిరల్ ఎల్ రాందాస్ వ్యాఖ్య కోసం న్యూస్9 ప్లస్ ఫోన్ కాల్‌లకు స్పందించలేదు). ఇక దీనిపై వైస్ అడ్మిరల్ బిఎస్ రంధావా (రిటైర్డ్), మెటీరియల్ మాజీ చీఫ్, ఇండియన్ నేవీ మాట్లాడుతూ.. ‘RDXతో పాటు ఇతర పేలుళ్లను డెలివరీ చేయడానికి ప్లాన్ చేసి ఏర్పాట్లు చేసిన మాస్టర్‌మైండ్‌ను గుర్తించేందుకు దర్యాప్తు చేయాలి’ అని చెప్పుకొచ్చారు.
ఇది ముమ్మాటికీ పాకిస్థాన్ మిలిటరీ అటాక్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే దీనిని పాకిస్థాన్ ఎప్పటికీ ఒప్పుకోదు. ఈ దాడుల్లో పాకిస్థాన్ నేవీ లేదా వ్యాపారి నౌక ప్రమేయాన్ని పాకిస్థాన్ తోసి పుచ్చుతూ వచ్చింది. అయితే ఎస్ హుస్సేన్ అనే జైదీ రాసిన ‘బ్లాక్ ఫ్రైడే’ పుస్తకంలో పేలుడు పదార్థాలను తీసుకువచ్చిన ‘పెద్ద ఎర్ర స్పీడ్ బోట్’ అని చెప్పారు. కరాచీ నుంచి రాయ్‌గఢ్ మధ్య 500 నాటికల్ మైళ్లను ప్రయాణించే పరిధి ‘స్పీడ్‌బోట్’కు ఉండదు కాబట్టి ఇది అసాధ్యమనే భావనకకలగన మానదు. పేలుడు పదార్థాలను నగరానికి చేర్చడానికి ఐఎస్‌ఐ.. ఎల్‌టీటీఈ లేదా మరే ఇతర దక్షిణాసియా స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లను ట్యాప్ చేసి ఉంటుంది.
‘సీ పావురాలు’ అనే పేరుతో ఉన్న ప్రపంచంలోనే ఏకైక ఉగ్రవాద సంస్థ తమిళ టైగర్లు. లెఫ్టినెంట్ జనరల్ నాసిర్ LTTEకి ఆయుధ ఛానెల్‌ని తెరిచాడు. జనవరి 1993లో చెన్నైకి సమీపంలోMV అహత్, ISI సరఫరా చేసిన ఆయుధాల రవాణాను తీసుకెళుతుండగా ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డులు అడ్డగించారు. అయితే కల్నల్ R హరిహరన్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, IPKF LTTE తమ ప్రమేయాన్ని తోసిపుచ్చారు. ఈలాం యుద్ధం-2తో పోరాడడంలో ఎల్‌టీటీఈ బిజీగా ఉన్నందున పేలుడు పదార్థాలను సరఫరా చేసే అవకాశం లేదని తేలిపోయింది. VR మారిటైమ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, CEO కెప్టెన్ సంజయ్ పరాశర్ మాట్లాడుతూ.. ‘నా అనుమానం ఏంటంటే.. ఐఎస్‌ఐ స్క్రాప్‌కు దగ్గరగా ఉన్న ఒక నౌకను ఉపయోగించి ఉండవచ్చు. అందుకే దానిని ట్రేస్ చేయలేపోయారు’ అని అభిప్రాయపడ్డారు.
500 టన్నుల బరువున్న 35-50 మీటర్ల పొడవున్న ఓడను ఐఎస్‌ఐ ఉపయోగించిందని పరాశర్ అభిప్రాయపడ్డారు. ఈ నౌక తీరానికి దగ్గరగా మూడు మీటర్ల సముద్రపు లోతులో పనిచేయగలదు. కాబట్టి వాటిని అన్‌లోడ్ చేయడానికి, పడవలలోకి బదిలీ చేయడానికి కనీసం అరగంట అయినా సమయం పడుతుందని పరాశర్ అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. ‘అసలు దేశంలోకి ఆయుధాలు ఎలా వచ్చాయన్నది 1993లో దర్యాప్తు చేయని కోణం. కేసు దర్యాప్తులో ఇది పెద్ద లోపంగా భావిస్తున్నాను. ఈ ప్రశ్నను నన్ను అడగడం ఇదే తొలిసారి. దీని గురించి ఎప్పుడు ఆలోచించలేదు, నిజానికి ఇది ఆశ్చర్యంగా ఉంది’ అని కెప్టెన్ పరాశర్ తెలిపారు.
The Jehadi General వెబ్ సిరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..