Car Insurance: టాటా AIG కారు ఇన్సూరెన్స్ కొనుగోలు చేస్తున్నారా.? ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి.
కారు ఇన్సూరెన్స్ విషయంలో చాలా రకాల అపోహలు, అనుమానాలు ఉంటాయి. ఇన్సూరెన్స్ కొనుగోలు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత కారు బీమా క్లెయిమ్‌ను సెటిల్ చేసే సమయంలో ఒత్తిడికి గురి చేస్తుంటుంది. అయితే కొన్ని విషయాలను తెలుసుకోవడం ద్వారా బీమా క్లెయిమ్‌ను సులభంగా..
కారు ఇన్సూరెన్స్ విషయంలో చాలా రకాల అపోహలు, అనుమానాలు ఉంటాయి. ఇన్సూరెన్స్ కొనుగోలు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత కారు బీమా క్లెయిమ్‌ను సెటిల్ చేసే సమయంలో ఒత్తిడికి గురి చేస్తుంటుంది. అయితే కొన్ని విషయాలను తెలుసుకోవడం ద్వారా బీమా క్లెయిమ్‌ను సులభంగా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే ఫోర్ వీలర్ వాహనాల భీమా క్లెయిమ్‌లను తిరస్కరించడం అసాధారణం. చాలా మంది దీనిని ప్రాక్టికల్‌గా చూసే ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో క్లెయిమ్ ఎందుకు రిజక్ట్ అయ్యిందో కస్టమర్లకు అవగాహన ఉండాల్సి ఉంటుంది. ఇంతకీ కారు క్లెయిమ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? టాటా AIG ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫైల్ చేసే సమయంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..
మీరు ఇన్సూరెన్స్ చేస్తున్న కారు హోండా కానీ మారుతి కానీ ముందుగా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కస్టమర్లు ఈ 5 పాయింట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
* ప్రమాదం జరిగిన వెంటనే విషయాన్ని స్థానికంగా ఉన్న పోలీసులకు తెలియజేసీ ఫస్ట్ ఇన్మర్మేషన్ రిపోర్ట్ (FIR)ను ఫైల్ చేయాలి. చాలా వరకు ఇన్సూరెన్స్‌లను ప్రమాదాలు, దొంగతనాలు, థర్డ్ పార్టీ ప్రమాదాలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. పోలీసుల నుంచి తీసుకున్న FIR అదనపు కాపీని మీ వద్ద ఉంచుకోవాలి. ఆలస్యం కాకుండా మీ ఇన్సూరెన్స్ క్లెయిల్ కావాలంటే ఎఫ్‌ఐఆర్ కచ్చితంగా ఉండాలి.
* మీ ఇన్సూరెన్స్ పూర్తిగా క్లెయిమ్ అవ్వాలంటే ప్రమాదం లేదా దొంగతనం జరిగిన ప్రదేశంలో సాక్ష్యాలను సేకరించాల్సి ఉంటుంది. ఈ సమయంలో కొన్న విషయాలను గుర్తు పెట్టుకోవాలి. 1) మీ వాహనానికి జరిగిన డ్యామేజ్‌కి సంబంధించి నాణ్యతతో కూడిన ఫొటోను తీసుకోవాలి.
2) దొంగతనం లేదా ప్రమాదం జరిగిన ప్రదేశంలో వీడియో చిత్రీకరించాలి.
3) ప్రమాదం జరిగిన ప్రదేశంలో జరిగిన సంఘటనలకు సంబంధించిన వివరాలను క్షుణ్నంగా నోట్ చేసుకోవాలి.
4) ప్రమాదం జరిగిన ప్రదేశంలో ప్రత్యక్ష సాక్షికి సంబంధించిన పేరు, ఫోన్ నెంబర్, చిరునామాను సేకరించాలి.
5) క్లెయిమ్ చేసే సమయంలో FIR కాపీతోపాటు సంబంధిత ప్రూఫ్స్‌ను సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది.
కారు ఇన్సూరెన్స్‌కు సంబంధించి అన్ని రకాల సమాచారాన్ని సేకరించిన తర్వాత సంబంధిత ఇన్సూరెన్స్ ప్రొవడైర్స్‌కి అందించాల్సి ఉంటుంది. అయితే ఈ సమయంలో కొన్ని విషయాలను గుర్తించాల్సి ఉంటుంది.
* ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫామ్‌ను జాగ్రత్తగా నింపాల్సి ఉంటుంది. ప్రమాదానికి సంబంధించిన అన్ని వివరాలను అందించాలి.
* క్లెయిమ్ ఫామ్‌తో పాటు అవసరమైన అన్ని రకాల ప్రూఫ్స్‌ను సబ్‌మిట్ చేయాలి. వీటిలో ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC), డ్రైవింగ్ లైసెన్స్ కాపీ, ఎఫ్‌ఐఆర్ కాపీ కచ్చితంగా ఉండాలి.
* ఒకవేళ మీరు ఆన్‌లైన్ ఫోర్ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మీకు నచ్చిన చోటు నుంచే అవసరమైన ప్రూఫ్స్‌తో పాటు ఇతర డాక్యుమెంట్స్‌ను సబ్‌మిట్ చేసుకోవచ్చు. టాటా AIG వంటి పేరొందిన ఇన్సూరెన్స్ కంపెనీలు ఆన్‌లైన్‌లోనే క్లెయిమ్ సబ్‌మిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించాయి.
* క్లెయిమ్ సబ్‌మిషన్ చేసిన వెంటనే.. ఇన్సూరెన్స్ కంపెనీలు మీ క్లెయిమ్‌లను రివ్వ్యూ చేస్తాయి. అనంతరం మీ క్లెయిమ్ స్టేటస్ విషయమై మిమ్మల్ని సంప్రదిస్తారు. ఇన్సూరెన్స్ కంపెనీలతో తరచూ టచ్‌లో ఉంటూ ఇతర వివరాలను ఎప్పటికప్పడు తెలుసుకోవచ్చు.
క్లెయిమ్ ఫామ్‌లో ఎంటర్ చేసే వివరాలకు సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్పెల్లింగ్, టైపింగ్ తప్పులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత వినియోగదారుడిదేనని గుర్తుంచుకోండి. ఈ కింది పాయింట్స్‌ను ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు.
* ఫామ్ నింపే సమయంలో కచ్చితమైన, నిజమైన సమాచారాన్ని అందించాలి. తప్పుడు సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు.
* ఫామ్ నింపిన తర్వాత ఇంచ్చిన సమాచారం కరెక్ట్‌గానే ఉందా.? లేదా అన్ని విషయాన్ని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి.
* ఫామ్‌ను సబ్‌మిట్ చేసే ముందు సపోర్టింగ్ డ్యాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయో లేదో డబుల్ చెక్ చేసుకోవాలి.
ఇక కారు డ్యామేజ్ క్లెయిమ్ చేసుకునే ముందు ఇన్సూరెన్స్ పాలసీ షరతులను గుర్తుంచుకోవాలి. మీ ఇన్సూరెన్స్ కవరేజీకి సంబంధించిన వివరాలను క్షుణ్నంగా తనిఖీ చేసుకోవాలి. అయితే ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఫోర్ ఫీలర్‌కు, టూ వీలర్‌కు వ్యత్యాసం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.
కొన్ని సందర్భాల్లో కారు ఇన్సూరెన్స్ రిజక్ట్ అవుతుండొచ్చు. ఇలాంటి తరుణంలో మీ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడాల్సి వస్తుండొచ్చు. క్లెయిమ్ ఎందుకు రిజక్ట్ అయ్యిందన్న దానికి గల కారణాలను అడిగి తెలుసుకోవచ్చు. ఇన్సూరన్స్ రిజక్ట్ కాకూదంటే, సింపుల్‌గా ప్రాసెస్ పూర్తి కావాలంటే టాటా AIG వంటి మంచి పేరున్న ఇన్సూరెన్స్ కంపెనీలోనే బీమా తీసుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..