Hospitality Education: హాస్పిటాలిటీ రంగంలో ఎన్నో అవకాశాలు.. IIHM ఇన్‌స్టిట్యూట్‌లో అందిస్తున్న అద్భుత కోర్సులు.

ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న హాస్పిటాలిటీ రంగంలో అనేక మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌కి (IIHM) చెందిన నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కోవిడ్‌ 19 మహమ్మారి ప్రభావం తర్వాత ఈ మార్పులు మరింత వేగవంతమయ్యాయి. ఈ రంగంలో వచ్చిన పోకడలు ప్రపంచవ్యాప్తంగా హాస్పిటాలిటీ విద్యలో క్లిష్టమైన మార్పులకు...

Hospitality Education: హాస్పిటాలిటీ రంగంలో ఎన్నో అవకాశాలు.. IIHM ఇన్‌స్టిట్యూట్‌లో అందిస్తున్న అద్భుత కోర్సులు.
IIHM Courses
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 16, 2023 | 12:39 PM

ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న హాస్పిటాలిటీ రంగంలో అనేక మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌కి (IIHM) చెందిన నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కోవిడ్‌ 19 మహమ్మారి ప్రభావం తర్వాత ఈ మార్పులు మరింత వేగవంతమయ్యాయి. ఈ రంగంలో వచ్చిన పోకడలు ప్రపంచవ్యాప్తంగా హాస్పిటాలిటీ విద్యలో క్లిష్టమైన మార్పులకు దారి తీశాయి. IIHM వంటి అత్యంత అనుభవం, భవిష్యత్తుపై అంచనా ఉన్న హాస్పిటాలిటీ ఇన్‌స్టిట్యూట్‌లు మాత్రమే ఈ మార్పులను గ్రహించి అందుకు అనుగుణంగా పాఠ్యాంశాలను మార్చుకుంటున్నాయి.

కరోనా ప్రభావం తర్వాత హాస్పిటాలిటీ రంగంలో కొత్త టెక్నాలజీల వినియోగం భారీగా పెరిగింది. అతిథి రంగాన్ని మరింత మెరుగుపరచడానికి టెక్నాలజీపై ఆధారపడడం ప్రారంభించాయి. వీటిలో కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి కీలెస్‌ ఎంట్రీ వరకు ఉన్నాయి. మారుతోన్న కాలానికి అనుగుణంగా హాస్పిటాలిటీ కోర్సుల్లో డేటా అనలటిక్స్‌, కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ (CRM), రెవెన్యూ మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో డిజిటల్ మార్కెటింగ్ అందుబాటులోకి వచ్చింది. అలాగే ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా.. హాస్పిటాలిటీ విద్యా విధానంలో వేస్ట్ మేనెజ్‌మెంట్‌, గ్రీన్‌ బిల్డింగ్‌ వంటి కోర్సులను జోడిస్తున్నారు. IIHM ఇప్పటికే తమ కర్క్యూలమ్‌లో ఈ సబ్జెక్స్‌ను చేర్చాయి.

కోవిడ్‌ 19 కారణంగా ఆతిథ్య రంగంలో ఏర్పడ్డ అంతరాయాన్ని భర్తీ చేసేందుకు గాను హాస్పిటాలిటీ ఇన్‌స్టిట్యూట్‌లు తమ విద్యార్థులకు మరిన్ని ఇంటర్న్‌షిప్‌లు, ఇండస్ట్రీ ప్లేస్‌మెంట్స్‌, ప్రాక్టికల్‌ ట్రైనింగ్ అందించాల్సిన అవసరం ఉంది. ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్‌షిప్‌లతో సహా సంబంధిత ఎక్స్‌పోజర్ కోసం పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం గాను విద్యార్థులకు పలు టూర్‌లకు తీసుకెళ్తున్నారు. ప్రాక్టికల్ నాలెడ్జ్‌ అందించడం ద్వారా విద్యార్థుల కెరీర్‌కు ఎంతగానో ఉపయోపడుతుంది. హాస్పిటాలిటీ రంగంలో విద్యనభసిస్తున్న విద్యార్థులు లింగ నిష్పత్తి ఉండడం కూడా ముఖ్యమైన అంశం. ఈ రంగంలో మహిళల ప్రాధాన్యతను పెంచాల్సి అనసరం ఉంది. అలాగే ఆతిథ్య రంగంలో కమ్యూనికేషన్‌ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. పలు ప్రాంతాలకు చెందిన వ్యక్తులతో సంభాషించాల్సిన అవసరం ఉంటుంది అందుకే విద్యార్థులకు సాఫ్ట్‌ స్కిల్స్‌ పెంచాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే విదేశీ భాషలకు సంబంధించిన కోర్సును కూడా కర్క్యూలమ్‌లో చేరుస్తున్నారు.

వెల్‌నెస్‌ మేనేజ్‌మెంట్‌, స్పా ఆపరేషన్స్‌, మైండ్‌ ఫుల్‌నెస్‌ వంటి అంశాలను హాస్పిటాలిటీ కర్క్యూలమ్‌లో చేర్చాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. హాస్పిటాలిటీ రంగం అనేది నిత్యం మార్పులకు గురయ్యే రంగం. ఆన్‌లైన్‌ కోర్సులు, ఫ్లెక్సీ లెర్నింగ్ ప్రోగ్రామ్స్‌ ద్వారా మార్పులను అందుకోవచ్చు. ఐఐహెచ్‌ఎమ్‌కు చెందిన ఎఫ్‌ఐఐహెచ్‌ఎమ్‌ విద్యార్థుల కోసం పలు సెషన్‌లను నిర్వహిస్తుంది. ఇవి విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్‌లో ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూల్ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్ హాస్పిటాలిటీ ఎడ్యుకేషన్‌ కరిక్యూలమ్‌ విషయానికొస్తే.. IIHM యునైటెడ్ కింగ్‌డమ్‌లోని కొన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలతో కలిసి పలు అంతర్జాతీయ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వీటిలో వెస్ట్ లండన్ విశ్వవిద్యాలయం నుంచి హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌లో ప్రతిష్టాత్మకమైన BSc (ఆనర్స్) డిగ్రీ ఒకటి.

IIHMకి చెందిన ‘గ్లోబల్ కనెక్ట్’ ప్రోగ్రామ్‌ ద్వారా విదేశాలకు చెందిన 70 ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకునే అవకాశం కల్పించింది. ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీ ఎక్సేంజ్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ఈ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన ఉపాధ్యాయులు ఐఐఎహెచ్‌ఎమ్‌లో బోధిస్తుంటారు. ప్రొఫెసర్‌ డేవిడ్‌ ఫోస్కెట్‌ అధ్యక్షతన ఉండే ప్రోగ్రామ్‌లో హాస్పిటాలిటీ రంగంలో గ్లోబల్‌ ట్రెండ్స్‌ను విద్యార్థులకు పరిచయం చేస్తారు. విద్యార్థులకు టెక్నాలజీని చేరువ చేసేందుకు గాను ఐఐఎహెచ్‌ఎమ్‌ పలు టెక్‌ దిగ్గజాలతో ఒప్పందం చేసుకుంది. విద్యార్థులకు డిజిటల్‌ మార్కెటింగ్ విభాగాల్లో గూగుల్‌ యాడ్స్‌, గూగుల్‌ ట్రావెల్‌, గూగుల్‌ హోటల్స్‌ వంటి వాటిపై శిక్షణ ఇస్తారు.

ఐఐఎహెచ్‌ఎమ్‌ నిర్వహించే కార్యక్రమాల్లో ఇంటర్నేషనల్ యంగ్ చెఫ్ ఒలింపియాడ్ ఒకటి.. ఇది 60 దేశాలను ఒకే ప్లాట్‌ఫారమ్‌పై ఏకం చేస్తుంది. విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర విద్యార్థులతో ఇంటరాక్ట్‌ అయ్యే అవకాశాన్ని కల్పిస్తుంది. ఫ్రాన్స్‌, స్కాట్‌లాండ్‌, ఐరోపాలలో చేపట్టే కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు గ్లోబల్‌ ఎక్స్‌పోజర్‌ను అందిస్తున్న అతికొద్ది హోస్పిటిలాటిఈ ఇన్‌స్టిట్యూట్‌లలో ఐఐఎహెచ్‌ఎమ్‌ ఒకటి. ఇక ఐఐఎహ్‌చ్‌ఎమ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అలుమిని నెట్‌వర్క్‌ ద్వారా విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు లభించేందుకు దోహదపడింది. ఐఐఎహ్‌హెచ్‌లో విద్యనభ్యసించిన ఎంతో మంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హాస్పిటాలిటీ కంపెనీల్లో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. హయత్‌ ఖట్మండు, GM ఆశిష్‌ కుమారు, మారిట్‌ లండ్‌ రిజెంట్స్‌ పార్క్‌, GM ఆలోక్‌ డీక్సిట్ వీరిలో కొందరు. IIHM 50కి పైగా దేశాల్లోని లీడింగ్‌ హాస్పిటాలిటీ ఇన్‌స్టిట్యూట్స్‌తో MOU ఒప్పందం చేసుకుంది. కేవలం డిగ్రీని అందించడమే కాకుండా, విద్యార్థులకు ఇండస్ట్రీలో నిలదొక్కుకునే నైపుణ్యాలను అందిస్తుంది. IIHMలో ప్రస్తుతం అడ్మిషన్స్‌ ప్రక్రియకొనసాగుతోంది. హాస్పిటాలిటీ రంగంలో కెరీర్‌ను నిలదొక్కుకోవాలనుకునే వారికి ఈ ఇన్‌స్టిట్యూట్ మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చు.