Betel Plant: ఇంట్లో తమలపాకు మొక్క పెడితే ఏం జరుగుతుంది.. ఏ దిక్కులో ఉంచాలి?

| Edited By: Shaik Madar Saheb

Sep 07, 2024 | 11:00 PM

తమలపాకు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. తమల పాకులు లేనిదే వ్రతాలు, పూజలు పూర్తి కావు. అఅలాగే తమలపాకు లేనిదే తాంబూలం కూడా ఇవ్వరు. ఆధ్యాత్మికంగానే కాకుండా.. ఆరోగ్య పరంగా కూడా తమలపాకుతో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. తమలపాకు తినడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. చాలా మంది ఇప్పుడు తమలపాకుల మొక్కలను ఇంట్లో కూడా..

Betel Plant: ఇంట్లో తమలపాకు మొక్క పెడితే ఏం జరుగుతుంది.. ఏ దిక్కులో ఉంచాలి?
Betel Plant
Follow us on

తమలపాకు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. తమల పాకులు లేనిదే వ్రతాలు, పూజలు పూర్తి కావు. అఅలాగే తమలపాకు లేనిదే తాంబూలం కూడా ఇవ్వరు. ఆధ్యాత్మికంగానే కాకుండా.. ఆరోగ్య పరంగా కూడా తమలపాకుతో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. తమలపాకు తినడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. చాలా మంది ఇప్పుడు తమలపాకుల మొక్కలను ఇంట్లో కూడా పెంచుకుంటున్నారు. అయితే వాస్తు ప్రకారం చూస్తే.. కొన్ని రకాల మొక్కలను ఇంట్లో అస్సలు పెంచకూడదు. ఇలా పెంచడం వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొనాల్సి ఉంటుంది. అలాగే వాస్తు ప్రకారం కొన్ని మొక్కల్ని పెంచడం వల్ల ధన లాభం కూడా కలుగుతుంది. మరి తమలపాకు మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి? అసలు ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవచ్చా? పెంచుకుంటే ఏ దిక్కులో ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం.

డబ్బుకు లోటు ఉండదు..

తమలపాకు మొక్కను నాగవల్లి అని కూడా పిలుస్తారు. హిందూ సంప్రదాయాల ప్రకారం ఈ మొక్కకు ఎంతో విశిష్టత ఉంది. ఆయుర్వేదంలో కూడా తమల పాకును పలు వ్యాధులను తగ్గించడంలో ఔషధంగా ఉపయోగిస్తారు. అయితే ఏ ఇంట్లో తమలపాకు చెట్టు ఉంటుందో.. ఆ ఇంట్లో శనీశ్వరుడు ఉండడు అనే నానుడు ఉంది. తమలపాకు మొక్క ఇంట్లో ఉంటే ఆర్థిక కష్టాలు కూడా ఉండవని, ఇంట్లో డబ్బుకు లోటు ఉందని చెబుతారు. సరిగ్గా కలిసి వస్తే పట్టిందల్లా బంగారం అని అంటారు.

లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుంది..

తమలపాకు తీగ ఇంట్లో ఉండటం వల్ల సాక్షాత్తూ లక్స్మీదేవి, ఆంజనేయ స్వామి ఇంట్లో ఉన్నట్టే అంట. ఈ మొక్క ఏపుగా చక్కగా పెరిగితే.. అప్పుల బాధలు ఉండవని కూడా చెబుతారు. అంతే కాకుండా బుధ గ్రహం అను కూలాం కూడా కలుగుతుందని చెబుతారు.

ఇవి కూడా చదవండి

తూర్పు వైపు ఉంచాలి..

ఈ మొక్క బాగా పెరగాలంటే.. సూర్య రశ్మి బాగా తగిలే చోట పెట్టాలి. అలాగని మరీ ఎండలో పెడితే మొక్క మాడిపోతుంది. గట్టి ఎండ తగలని చోటులో ఉంచండి. అలాగే ఈ మొక్కను తూర్పు వైపు ఉంచితే చాలా మంచిదట. కాబట్టి తమలపాకు మొక్కను ఎలాంటి డౌట్ లేకుండా ఇంట్లో పెంచుకోవడం వల్ల మంచిదే.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)