Watch Video: అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
Ganesh Chaturthi At Antilia: అంబానీ ఫ్యామిలీ ప్రతియేటా గణేష్ చతుర్థిని అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటుంది. ఈ ఏడాది కూడా ముంబైలోని అంబానీ నివాసం ఆంటిలియాలో గణేష్ చతుర్థి వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌కు వివాహం తర్వాత వారి ఇంట్లో జరుగుతున్న తొలి గణేష్ చతుర్థి కావడంతో ఈసారి వేడుకలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
అంబానీ ఫ్యామిలీ ప్రతియేటా గణేష్ చతుర్థిని అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటుంది. ఈ ఏడాది కూడా ముంబైలోని అంబానీ నివాసం ఆంటిలియాలో గణేష్ చతుర్థి వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌కు వివాహం తర్వాత వారి ఇంట్లో జరుగుతున్న తొలి గణేష్ చతుర్థి కావడంతో ఈసారి వేడుకలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అంబానీ కుటుంబ సభ్యులందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. జూలైలో వివాహ బంధంతో ఒక్కటైన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ శుక్రవారం రాత్రి భారీ గణపతి విగ్రహానికి స్వాగతం పలకడంతో.. వారి ఇంట్లో వేడుకలు మొదలయ్యాయి. శనివారంనాడు గణేష చతుర్థి వేడుకలో ముకేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులతో ముకేష్ అంబానీ మాతృమూర్తి కోకిలాబెన్ అంబానీ, వారి ఇతర కుటుంబ సభ్యులందరూ పాల్గొని గణపయ్యకు హారతి ఇచ్చారు. ఈ వేడుకలకు సంబింధించిన వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారాయి.
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..

