Diwali 2024: లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే.. దీపావళి పండగ పూట ఏ కలర్ డ్రస్ వేసుకోవాలో తెలుసా..?
పండుగల సమయంలో కొత్త బట్టలు, కొత్త వస్తువులు కొంటారు. అయితే, దీపావళి పండుగలో ఏ రంగు అదృష్టాన్ని తెస్తుందో తెలుసుకోవడం మంచిది. లక్ష్మీదేవికి నచ్చే రంగుల్లో సంప్రదాయ దుస్తులను ధరించడం ఉత్తమం. అప్పుడే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం సమృద్ధిగా లభిస్తుంది.
దీపావళి పండగ రానే వచ్చింది. పండగ రోజున ప్రత్యేకించి ధరించడానికి కొత్త బట్టలు కొనడానికి పెద్ద ఎత్తున షాపింగ్ చేస్తుంటారు ప్రజలు. అయితే, ముందు మీరు ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలంటున్నారు జ్యోతిశాస్త్ర నిపుణులు. అదేంటంటే.. దీపావళి సందర్భంగా మీకు ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిది..? ఎలాంటి రంగులకు దూరంగా ఉండాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు.. దీపావళి రోజున కొన్ని రంగుల బట్టలు ధరించడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం మీపై ఉంటుందని చెబుతున్నారు. ఆ వివరాల్లేంటో ఇక్కడ తెలుసుకుందాం..
దీపావళి ఆనందాల పండుగ, వెలుగుల పండుగలో తమ జీవితాలు కూడా సంతోషంగా వెలగాలని అందరి ఆకాంక్ష. దీపావళి పండుగ వచ్చిందంటే చాలు చాలా మంది నెల రోజుల ముందు నుంచే షాపింగ్‌లు ప్రారంభిస్తారు. పండుగల సమయంలో కొత్త బట్టలు, కొత్త వస్తువులు కొంటారు. అయితే, దీపావళి పండుగలో ఏ రంగు అదృష్టాన్ని తెస్తుందో తెలుసుకోవడం మంచిది. లక్ష్మీదేవికి నచ్చే రంగుల్లో సంప్రదాయ దుస్తులను ధరించడం ఉత్తమం. అప్పుడే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం సమృద్ధిగా లభిస్తుంది.
మన జీవితంలో రంగులు చాలా ముఖ్యమైనవి. రంగు మీ మానసిక స్థితిపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని శాస్త్రీయంగా నిరూపించబడింది. దీని అర్థం ప్రతి రంగు దానితో అనుబంధించబడిన భావోద్వేగాలను కలిగి ఉంటుంది. మతపరంగా, కొన్ని రంగులు సానుకూలత, ప్రతికూలతను కలిగిస్తాయి. మతపరమైన పండుగలు, వేడుకల సమయంలో కొన్ని రంగులను ధరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
పండుగలకు ధరించాల్సిన రంగులు దీపావళికి కొత్త బట్టలు కొనే ముందు సరైన రంగులు తెలుసుకోవడం ముఖ్యం. తద్వారా మీరు సరైన దుస్తులను ఎంచుకోవచ్చు. దీపావళి రోజున మీరు గులాబీ, బంగారం, నీలం, ఆకుపచ్చ, ఎరుపు, నారింజ, పసుపు, తెలుపు వంటి ప్రకాశవంతమైన, ఆకర్షణీయమైన రంగులను ధరించటం మంచిది.
పండుగలలో ధరించకూడని రంగులు దీపావళికి మీరు ధరించే దుస్తుల రంగుతో పాటుగా, దూరం పెట్టాల్సిన రంగుల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఎంచుకోవాలి. దీపావళికి నల్ల బట్టలు ధరించకూడదు. మతపరంగా నలుపు దుఃఖం, పేదరికానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు నలుపు రంగు, దాని విభిన్న షేడ్స్ ధరించకపోవడమే మంచిదని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)