Viral Video: ట్రాఫిక్ పోలీస్‌ను కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్.. షాకింగ్ వీడియో వైరల్
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఎస్‌యూవీ కారు నడుపుతున్న ఓ వ్యక్తి అతి వేగంగా డ్రైవింగ్ చేస్తున్నందుకు ట్రాఫిక్ పోలీస్ ఆపమని అడిగాడు. ఆ డ్రైవర్ కారు ఆపకుండా ఎదురుగా ఉన్న ట్రాఫిక్ పోలీసుని ఢీకొట్టి కారు బానెట్‌పై 100 మీటర్లకు పైగా ఈడ్చుకెళ్లాడు.
సోషల్ మీడియాలో ఓ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో వేగంగా వైరల్ అవుతోంది. అందులో విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసును ఓ వ్యక్తి కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఎస్‌యూవీ కారు నడుపుతున్న ఓ వ్యక్తి అతి వేగంగా డ్రైవింగ్ చేస్తున్నందుకు ట్రాఫిక్ పోలీస్ ఆపమని అడిగాడు. ఆ డ్రైవర్ కారు ఆపకుండా ఎదురుగా ఉన్న ట్రాఫిక్ పోలీసుని ఢీకొట్టి కారు బానెట్‌పై 100 మీటర్లకు పైగా ఈడ్చుకెళ్లాడు.
వైరల్ అవుతున్న వీడియోకు సంబందించిన వివరాల్లోకి వెళితే..ఈ షాకింగ్ సంఘటన కర్ణాటకలోని శివమొగ్గ చోటుచేసుకుంది. ఎస్‌యూవీ కారులో అతివేగంగా వెళ్తున్న వ్యక్తి మిథున్ అనే వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. ఈ క్రమంలో అదే రూట్‌లో వాహనాలను చెక్ చేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రభు.. మిథున్ వాహనానికి అడ్డంగా వెళ్లి పక్కకు ఆపమన్నాడు. దీంతో అతను కారును రోడ్డు పక్కకు ఆపాడు. కానిస్టేబుల్ ఆ కారు ముందు నిల్చొని ఏదో చెక్ చేస్తుండగా.. మిథున్ కారును ఒక్కసారిగా ముందుకు పోనిచ్చే ప్రయత్నం చేశాడు.
ఈ వీడియోపై క్లిక్ చేయండి..
అది గమనించి, వెంటనే అప్రమత్తమైన కానిస్టేబుల్ కారు బ్యానెట్‌పైకి ఎక్కాడు. అనంతరం కారును మిథున్ తన కారును అలాగే ముందుకు పోనిచ్చాడు. దాదాపు 100 మీటర్ల వరకూ వెళ్లి ఆపేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై శివమొగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సదరు నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. వైరల్ వీడియోపై నెటిజన్లు సైతం పెద్ద సంఖ్యలో స్పందించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..