AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నంబర్ 40’ పిజ్జాకి ఒక్కసారిగా పెరిగిన డిమాండ్.. ఎందుకా అని ఆరాతీయగా కళ్లుబైర్లు కమ్మే నిజం..!

దీని తర్వాత, ఈ రాకెట్‌కు సూత్రధారిగా భావిస్తున్న 22 ఏళ్ల యువకుడితో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. 12 చోట్ల జరిపిన దాడుల్లో 350కి పైగా మొక్కలున్న రెండు గంజాయి పొలాలు, నగదు, తుపాకులు, కత్తులు, ఖరీదైన గడియారాలు స్వాధీనం చేసుకున్నారు.  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

'నంబర్ 40' పిజ్జాకి ఒక్కసారిగా పెరిగిన డిమాండ్.. ఎందుకా అని ఆరాతీయగా కళ్లుబైర్లు కమ్మే నిజం..!
Popular Pizza
Jyothi Gadda
|

Updated on: Oct 25, 2024 | 1:38 PM

Share

ఒక రెస్టారెంట్‌లో ప్రత్యేకమైన పిజ్జాకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. అది ఎంతలా అంటే..ఫుడ్‌ సేఫ్టీ అధికారులను సైతం ఒక్కసారిగా షాక్ అయ్యేలా చేసింది. ఉన్నట్టుండి ఇంత విస్తృతంగా అమ్ముడవుతున్న ఆ పిజ్జా కథేంటో తెలుసుకోవాలని ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ అనుమానంతో ఆరా తీయగా అసలు విషయం బట్టబయలైంది. దీంతో రెస్టారెంట్‌పై చర్యలు తీసుకున్నారు. పెద్ద సంఖ్యలో అరెస్ట్‌లు కూడా జరిగాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..

జర్మన్ పోలీసులు ఇటీవల ఓ రెస్టారెంట్‌పై దాడి చేశారు. అక్కడ కస్టమర్‌లు ఎగబడి కొంటున్న పిజ్జేరియా మెనూలోని ఐటెమ్ నంబర్ 40 అసాధారణంగా అమ్ముడవుతున్న విషయంపై లోతైన విచారణ చేపట్టారు. దాంతో నంబర్‌ 40గా పిలిచే ఆ పిజ్జా కొకైన్‌తో తయారు చేస్తున్నట్టుగా ఫుడ్‌ సేఫ్టీ అధికారులు నిర్దారించారు. రెస్టారెంట్ మెనూలో ‘నంబర్ 40’ పిజ్జా అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ రెస్టారెంట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న పిజ్జాలో కొకైన్‌ను కలుపుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దాంతో వెంటనే పిజ్జా హాట్‌ మేనేజర్‌ను అరెస్టు చేశారు.

అయితే, పోలీసులు రావటం గమనించిన 36 ఏళ్ల పిజ్జా మేనేజర్ కొకైన్ బ్యాగ్‌ను కిటికీలోంచి విసిరేందుకు ప్రయత్నించాడు. కానీ, ఆ బ్యాగ్‌ను క్రింద నిలబడి ఉన్న పోలీసు అధికారులు పట్టుకున్నారు. అతని అపార్ట్‌మెంట్ నుంచి కిలోన్నర కొకైన్, 400 గ్రాముల గంజాయి, 2,90,378 డాలర్లు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత విడుదలైన అతడు మళ్లీ డ్రగ్స్ వ్యాపారంలోనూ అతడు భాగస్వామిగా ఉన్నాడని సమాచారం.

ఇవి కూడా చదవండి

దీని తర్వాత, ఈ రాకెట్‌కు సూత్రధారిగా భావిస్తున్న 22 ఏళ్ల యువకుడితో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. 12 చోట్ల జరిపిన దాడుల్లో 350కి పైగా మొక్కలున్న రెండు గంజాయి పొలాలు, నగదు, తుపాకులు, కత్తులు, ఖరీదైన గడియారాలు స్వాధీనం చేసుకున్నారు.  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, డ్రగ్స్ పిజ్జా ధర ఎంతన్నది మాత్రం పోలీసులు వెల్లడించలేదు. జర్మనీ కఠినమైన గోప్యతా చట్టాల కారణంగా, పోలీసులు రెస్టారెంట్ పేరు, చిరునామా, యజమాని పేరును కూడా విడుదల చేయలేదు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం..
Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం..
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..