Telugu News Photo Gallery These things seeing are very auspicious and lucky for people indicates comes money and prosperity
Diwali 2024: పండగ పూట ఈ జంతువులను చూస్తే చాలు అంతా శుభమే?..మీ అదృష్టమే మారిపోతుందట!
దీపావళి..ప్రతీయేటా ఆశ్వీయుజ మాసంలో వచ్చే పండుగ దీపావళి.. నరకాసురుడిని సత్యభామ వధించిన నాడే దీపావళి పండుగగా జరుపుకుంటారు ప్రజలు. పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఆనందగా జరుపుకునే పండుగ దీపావళి. పండుగకు నెలరోజుల ముందుగానే ఏర్పాట్లు ప్రారంభిస్తారు. ఆ రోజున శ్రీ మహాలక్ష్మికి అత్యంత నిష్టతో పూజలు చేస్తారు. ఇంటిని రంగు రంగుల విద్యుత్ దీపాలు, రంగోలితో అలంకరించి దీపాలు వెలిగిస్తారు. ఆనందం, శ్రేయస్సు ఆ అమ్మవారికి తమ కోరికలను విన్నవించుకుంటారు. కొత్తబట్టలు, టపాసులు, పిండివంటలు, స్వీట్లు పంచుకుంటారు. ఇకపోతే, దీపావళి రోజున ముఖ్యంగా కొన్ని రకాల జీవులను చూడటం కూడా శుభప్రదంగా చెబుతున్నారు వాస్తు, జ్యోతిశాస్త్ర నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..