మొలకెత్తిన మెంతులు విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లుతో నిండి ఉంటాయి. ఇవి మన శరీరానికి అనేక రకాలుగా ప్రయోజనం అందిస్తాయి. మొలకెత్తిన మెంతుల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి మొలకెత్తిన మెంతులు చాలా ఉపయోగకరంగా పనిచేస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలకంగా పనిచేస్తాయి.