AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు గేటుకు తాళాలే..!

నవంబర్‌ నెలలో సాధారణ వారాంతాలు సహా మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ నెలలో బ్యాంక్ సెలవుల అధికారిక జాబితాను విడుదల చేసింది. ఈ సెలవులు రాష్ట్రాల వారీగా మారుతుంటాయి. అవి మీరు గమనించడం ముఖ్యం. ఇకపోతే, ముందుగా దీపావళి సందర్భంగా మన దేశంలో ఉన్న అన్నీ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు వరుసగా

Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు గేటుకు తాళాలే..!
Bank Holiday
Jyothi Gadda
|

Updated on: Oct 25, 2024 | 10:32 AM

Share

మరికొన్ని రోజుల్లో అక్టోబర్ మాసం పూర్తి కానుంది. నవంబర్ నెల ఆరంభానికి సమయం దగ్గరపడింది. వర్కింగ్ ప్రొఫెషనల్స్‌లో లాంగ్ వీకెండ్‌లు, రాబోయే సెలవుల గురించి ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. అలాంటి వారికి ఈ వార్త తప్పనిసరి..నవంబర్‌ నెలలో సాధారణ వారాంతాలు సహా మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ నెలలో బ్యాంక్ సెలవుల అధికారిక జాబితాను విడుదల చేసింది. ఈ సెలవులు రాష్ట్రాల వారీగా మారుతుంటాయి. అవి మీరు గమనించడం ముఖ్యం. ఇకపోతే, ముందుగా దీపావళి సందర్భంగా మన దేశంలో ఉన్న అన్నీ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు వరుసగా 3 రోజులు బంద్‌ ఉండనున్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

నవంబర్‌ 2024లో బ్యాంక్ సెలవులు

నవంబర్ 1 – దీపావళి అమావాస్య చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు హాలీడే ప్రకటించాయి. త్రిపుర, కర్ణాటక, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్, మహారాష్ట్ర, మేఘాలయ, సిక్కిం, మణిపూర్‌లలో బ్యాంకులు మూతపడనున్నాయి.

ఇవి కూడా చదవండి

నవంబర్ 2 – దీపావళి పండగను పురస్కరించుకుని గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరాఖండ్, సిక్కిం, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో బ్యాంకులు మూసివేయబడతాయి.

నవంబర్ 3 – ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు, కొన్ని ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలు వంటి విద్యాసంస్థలు కూడా బంద్‌.

నవంబర్ 7, 8 – ఛత్ పూజ సందర్బంగా అసోం, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించాయి.

నవంబర్ 8 – వంగల పండుగ సందర్భంగా మేఘాలయల్లో బ్యాంకు కార్యకలాపాలకు సెలవు ప్రకటించాయి.

నవంబర్ 9 – రెండవ శనివారం దేశవ్యాప్తంగా బంద్.. బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించారు. పొరపాటున మర్చిపోయి వెళ్లినా కూడా గేట్లకు తాళాలు దర్శనమివ్వటం ఖాయం.

నవంబర్ 10 – ఆదివారం దేశవ్యాప్తంగా బంద్

నవంబర్ 12 – ఎగాస్ బగ్వాల్ ,మేఘాలయలో సెలవు

నవంబర్ 15 – గురునానక్ జయంతి, కార్తీక పూర్ణిమ సందర్భంగా ఒడిశా, తెలంగాణ, చండీగఢ్, పంజాబ్, అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అసోం, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, లడఖ్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరం, నాగాలాండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్

నవంబర్ 17 – ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు దినం.

నవంబర్ 18 – కనకదాస జయంతి సందర్భంగా కర్ణాటకలో బ్యాంకులకు సెలవు ప్రకటించాయి.

నవంబర్ 22 – లబాబ్ డుచెన్ సందర్భంగా సిక్కింలో సెలవు. బ్యాంకుల మూసి ఉంటాయి.

నవంబర్ 23 – నాల్గో శనివారం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు దినం.

నవంబర్ 24 – ఆదివారం యధాతథం..దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు దినం.. ఇలా నవంబర్‌ నెలలో దాదాపు సగం రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. నవంబర్‌లో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. 14 రోజులు సెలవులు ఉంటే ఇక బ్యాంకులు పనిచేసేది దాదాపు సగం రోజులే. అయితే ఈ బ్యాంకు సెలవులు ఆయా రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..