AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: తలుపులు లేని దేవాలయం.. ఇక్కడి అమ్మవారిని దర్శించుకుంటే చాలు.. సకల సౌఖ్యాలు మీ సొంతం..!

ఓ అమ్మవారి ఆలయానికి తలుపులు లేక పోవడంతో పాటు 24 గంటలు 365 రోజులు దర్శనం ఇచ్చే ఆలయం ఏపీ లో ఉందని ఎంత మందికి తెలుసు...? అసలు అమ్మవారి ఆలయానికి తలుపులు పెట్టేందుకు తెచ్చిన చెక్కలు ఓ మహా వృక్షంగా మారిపోయాయని, ఎంత మందికి తెలుసు..? అసలు ఆలయానికి తలుపులు ఎందుకు ఉండవు అనే విషయం తెలియాలంటే ఏపీ లోని

Andhra Pradesh: తలుపులు లేని దేవాలయం.. ఇక్కడి అమ్మవారిని దర్శించుకుంటే చాలు.. సకల సౌఖ్యాలు మీ సొంతం..!
Sullurpeta Chengalamma Temp
Ch Murali
| Edited By: Jyothi Gadda|

Updated on: Oct 25, 2024 | 9:07 AM

Share

మనం ఇప్పటి వరకు ఎన్నో ఆలయాలు దర్శించి ఉంటాం….శని సింగనాపూర్ లో శనీశ్వర ఆలయానికి అయితే ఏకంగా తలుపులు లేక పోవడం తో పాటు ఏకంగా ఆ ఊరిలో ఏ ఒక్క ఇంటికి తలుపులు ఉండవని చాలా మంది చెబుతుంటే వినే ఉంటాం.  అలాగే, ఏపీలోనూ ఓ విశిష్ట ఆలయం ఉంది. ఇక్కడి వెలసిన అమ్మవారి ఆలయానికి ఎలాంటి తలుపులు, తాళాలు ఉండవు.. అనునిత్యం అమ్మవారు ప్రజల్ని కనిపెట్టుకునే ఉంటారని భక్తులు చెబుతున్నారు.  ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ఆరాధ్య దైవం దక్షిణ ఖాళీగా గుర్తింపు తెచ్చుకున్న ఏకైక ఆలయం సూళ్లూరుపేట చెంగలమ్మ ఆలయం….పై నాలుగు రాష్ట్రాల్లో చెంగాలమ్మ అమ్మవారి గురించి తెలియని భక్తుడు లేడని చెబితే అతిసియోక్తి కాదు…..అయితే చెంగాలమ్మ ఆలయం గురించి అందరికి తెలిసినా ఈ అమ్మవారి అలయంకి అసలు తలుపులు ఉండవని కొందరికే తెలిసి వుండవచ్చు.. అయితే ఈ ఆలయానికి ఎందుకు తలుపులు లేవు అనే విషయం తెలుసుకుందాం….

సూళ్లూరుపేట గ్రామదేవత చెంగాలమ్మ పరమేశ్వరీ దేవీ ఆంధ్రా తమిళనాడు సరిహద్దు ప్రాంతం లోని సూళ్లూరుపేట వద్ద కాలంగి నది తీరానా వెలసి దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఆలసట లేకుండా ప్రతి నిత్యం ఇరవై నాలుగు గంటలు భక్తులు కు దర్శన భాగ్యం కల్పిస్తూ,, భక్తులు ఆరాథ్యంగా కొలుస్తూ పూజలు అందుకుంతుంది.. . సుమారు ఐదు వందల సంవత్సరాలు క్రితం సూళ్లూరుపేట లోని కాలంగి నదీ ఒడ్డున వెలసింది….అప్పట్లో కొంతమంది పశువుల కాపరులు కాళంగి నదీ ఒడ్డున పశువులు మేపుతూ ఉన్న తరుణంలో కొంతమంది పశువులు కాపరులు కాళంగి నదిలో స్నానం చేస్తూ ఉన్న సమయంలో నీటి సుడిగుండాల్లో ఓ కుర్రోడు చిక్కుకున్న నేపథ్యంలో దిక్కుతోచని స్థితిలో ఏమి చేయాలో తెలియక భగవంతుడా కాపాడు అని వేడుకొగా నీటిలో చిక్కుకున్న కుర్రాడుకు ఏదో ఒక బండ రాయి తగిలింది, ఇంతలో అబండ రాయి ని గట్టిగా పట్టుకొగా ఆరాయి ఆకుర్రాడు ఇద్దరు ఒక్కసారి గా నది ఒడ్డుకు వచ్చి పడ్డారు. ఒడ్డున పడిన కుర్రోడు సృహ కోల్పోయి మెలుకువ వచ్చి చూసుకోగా తనను ఎవరు తీసుకొని వచ్చి ఇక్కడ పడవేశారు అని చూడగా అటు పక్కనే ఓ విగ్రహం లా కనిపిస్తున్న రాయి ని చూచి తను ఆశ్చర్యం చెందినట్లు పురాణాల సారాంశం…

ఆ కుర్రవాడు ఊరిలోకి వెళ్లి గ్రామస్తులు కు సమాచారం అందించగా గ్రామస్థులు అందరు నది ఒడ్డుకు వచ్చి చూడగా నది ఒడ్డున దక్షణ ముఖం పెట్టుకుని నిటారుగా ఉన్న అమ్మవారి విగ్రహం కనిపించింది. అది చూసిన గ్రామస్తులు ఆ విగ్రహానికి పూజలు చేద్దాం.. అనుకుని ఆ నిటారుగా ఉన్న విగ్రహాన్ని  కదిపెందుకు ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నం చేసినా ప్రయోజనం లేదు..  రాత్రి పొద్దుపోయింది. కానీ, విగ్రహం ఇంచుకూడా కదల్లేదు.. ఇక అదే రోజు రాత్రి అమ్మవారు గ్రామస్థుల కలలోకి వచ్చి తనను ఎవ్వరు కదపవద్దు అంటూ చెప్పడంతో అక్కడే అమ్మవారి కి చిన్నపాటి గుడి కట్టి పూజలు చేస్తూ నీటి సుడిలో పుట్టిన అమ్మవారు కాబట్టి.. ఈ ప్రాంతానికి సూళ్లూరు అని నామకరణం చేశారు.  అమ్మవారికి శ్రీ చెంగాలమ్మ అని పేరు పెట్టి ప్రతి నిత్యం పూజలు చేయడం ప్రారంభించారు.

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

ఇదిలా ఉండగా, అమ్మవారి గుడికి తలుపులు చెక్కడానికి నమద్ది చెట్టు దుంపలు తెచ్చారట.  అయితే, అంతలోనే అమ్మవారు ఆలయ పూజారికి స్వప్నంలో కనపడి తన ఆలయానికి తలుపులు వద్దని చెప్పిందట. దాంతో  అమ్మవారి ఆలయానికి తలుపులు లేకుండా ఆ చెక్కలను పక్కన పెటేశారట… అలా పక్కన పెట్టిన ఆచెక్కలు మొలకలు రావడం ఆది మహా వృక్షం కావడంతో, అప్పటి నుండి 365 రోజులు 24 గంటలు పాటు అమ్మవారు భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.

అయితే ఆనాడు తలుపుల కోసం తెచ్చిన చెక్కలు నేటికీ మహా వృక్షంలా మారడంతో అమ్మవారి దర్శనం కోసం వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ మహా వృక్షానికి పూజలు చేస్తుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..