AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో అత్యధిక దేవాలయాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటో తెలుసా..? 79000 ఆలయాలు ఇక్కడే ఉన్నాయి..!

మనదేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో దేవుడికి ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి. దేవాలయం అనగానే భగవంతుడు కొలువై ఉన్న ప్రదేశం అని భక్తులంతా నమ్ముతారు. గుడికి వెళ్లి దేవుడిని ప్రార్థిస్తారు... అయితే, మన భారతదేశంలో అత్యధిక సంఖ్యలో హిందూ దేవాలయాలు ఉన్న రాష్ట్రం ఏంటో తెలుసా? ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

దేశంలో అత్యధిక దేవాలయాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటో తెలుసా..? 79000 ఆలయాలు ఇక్కడే ఉన్నాయి..!
Temples In India
Jyothi Gadda
|

Updated on: Oct 25, 2024 | 6:52 AM

Share

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రసిద్ధి చెందిన భారతదేశం ఇస్లాం, క్రైస్తవం, బౌద్ధమతం వంటి అనేక మతాలకు నిలయం. అయితే వీటన్నింటికీ మించి హిందువులు మెజారిటీగా జీవిస్తున్నారు. భారతదేశం హిందూమతం, ప్రాచీన సంప్రదాయాలకు పుట్టినిల్లు. భిన్న మతాలకు చెందిన వారు ఇక్కడ సామరస్యంగా జీవిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ సంప్రదాయాలను, ఆచారాలను పాటిస్తూ మతసామరస్యాన్ని కాపాడుతున్నారు. అందుకే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వ దేశంగా పేరొందింది. ఇక్కడ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో దేవుడికి ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి. దేవాలయం అనగానే భగవంతుడు కొలువై ఉన్న ప్రదేశం అని భక్తులంతా నమ్ముతారు. గుడికి వెళ్లి దేవుడిని ప్రార్థిస్తారు… అయితే, మన భారతదేశంలో అత్యధిక సంఖ్యలో హిందూ దేవాలయాలు ఉన్న రాష్ట్రం ఏంటో తెలుసా? ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

రాజస్థాన్: రాజస్థాన్ ఏడవ స్థానంలో ఉంది. ఇక్కడ వివిధ దేవుళ్లకు చెందిన ఆలయాలు సుమారు 39,000 వరకు ఉన్నాయి. వీటిల్లో ప్రముఖమైనవి పుష్కర్‌లోని బ్రహ్మ దేవాలయం, ఉదయపూర్‌లోని ఎక్లింగ్‌జీ ఆలయం, జగత్‌లోని అంబికా మాత ఆలయం, దేశ్‌నోక్‌లోని కర్ణి మాత మందిర్, సలాసర్‌లోని సలాసర్ బాలాజీ ఆలయం, కరౌలిలోని మెహందీపూర్ బాలాజీ ఆలయం, రాణి వద్ద సాయి ధామ్, జైపూర్‌లోని బిర్లా మందిర్, మోతీ దుంగారి ఆలయం, ఖనియా-బాలాజీలోని గల్తాజీ ఆలయం.

ఆంధ్రప్రదేశ్‌: భారతదేశంలో అత్యధిక దేవాలయాలు ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో దాదాపు 47,000 దేవాలయాలు ఉన్నాయి. వీటిలో అత్యంత ముఖ్యమైనది, ప్రపంచ ప్రసిద్ధిగాంచినది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీకాళహస్తీశ్వరాలయం, విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం మల్లికార్జున, కాణిపాక వరసిద్ధి వినాయక, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి, నెల్లూరు రంగనాథ దేవాలయం మొదలైనవి ప్రసిద్ధి చెందినవి.

ఇవి కూడా చదవండి

గుజరాత్‌: అత్యధిక దేవాలయాలున్న ఐదవ రాష్ట్రం గుజరాత్. ఇక్కడ దాదాపు 50,000 దేవాలయాలు ఉన్నాయి. వీటిల్లో ప్రముఖమైనవి ద్వారకాధీశ దేవాలయం, సోమనాథ జ్యోతిర్లింగం, నాగేశ్వర జ్యోతిర్లింగం, భాగవత కొండ, అంబాజీ ఆలయం, అక్షరధామ్ ఆలయం, దేవరేశ్వర్ మహాదేవ ఆలయం, రుక్మణి దేవి, ద్వారక, రామచోట్రై ఆలయం ఠాగూర్, కేత, శ్రీ స్వామినారాయణ ఆలయం కలుపూర్, అహ్మదాబాద్ మొదలైనవి ప్రసిద్ధి చెందినవి.

పశ్చిమ బెంగాల్ : పశ్చిమ బెంగాల్ నాలుగో స్థానంలో ఉంది. ఇక్కడ మొత్తం 53,500 దేవాలయాలు ఉన్నాయి. దక్షిణేశ్వర్ కాళీ దేవాలయం, కోల్‌కతా, కాళీఘాట్ కాళీ దేవాలయం కోల్‌కతా, బేలూర్ మఠం, హౌరా, ఇస్కాన్ దేవాలయం. మాయాపూర్, నందికేశ్వరి ఆలయం సైంథియా, మదన్మోహన్ దేవాలయం, బిష్ణుపూర్, శ్రీ శ్రీ మాతృ మందిరం జయరాంబటి, తారకనాథ్ ఆలయం తారకేశ్వర్, డార్జిలింగ్ శాంతి పగోడా డార్జిలింగ్, బిర్లా దేవాలయం కోల్‌కతా, పరస్నాథ్ మందిరం కోల్‌కతా, మహాకాల్ దేవాలయం డార్జిలింగ్ వంటి అనేక ప్రసిద్ధ ప్రదేశాలు, దేవాలయాలు ఉన్నాయి.

కర్ణాటక: కర్ణాటక మూడో స్థానంలో ఉంది. రాష్ట్రంలో దాదాపు 61,000 దేవాలయాలు ఉన్నాయి. ఈ ప్రసిద్ధ దేవాలయాలలో శ్రీరంగపట్నం రంగనాథ స్వామి, శృంగేరి శారదా పీఠం, గోకర్ణం మహాబలేశ్వర్ ఆలయం మొదలైనవి ఉన్నాయి.

మహారాష్ట్ర: అత్యధిక దేవాలయాల జాబితాలో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. ఇక్కడ దాదాపు 77,000 దేవాలయాలు ఉన్నాయి. మహారాష్ట్రలో ముంబా దేవి ఆలయం, అష్ట వినాయక క్షేత్రాలు, కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి గుడి, షిరిడీ సాయినాథ్ గుడి, త్రయంబకేశ్వరం, భీమశంకర జ్యోతిర్లింగం, మోరేశ్వర్, శని సింగనాపూర్, గిరిజా మాత, కైలాస దేవాలయం, నాగేశ్వర జ్యోతిర్లింగం, పులేశ్వర్, అమృత్‌సర్, శ్రీ మయూరేశ్వర్ మొదలైనవి ఉన్నాయి.

తమిళనాడు: భారతదేశంలో అత్యధిక సంఖ్యలో దేవాలయాలు ఉన్న రాష్ట్రం తమిళనాడు. ఇక్కడ దాదాపు 79,000 దేవాలయాలు ఉన్నాయి. తమిళనాడు హిందూ మతంతో సహా అన్ని మతాలకు నిలయం. ఇక్కడి ప్రసిద్ధ ఆలయాల్లో మీనాక్షి అమ్మన్ కోవెల మదురై, ఆది కుంబేశ్వరర్ కుంభకోణం, బృహదీశ్వరాలయం తంజావూరు, శ్రీ రంగనాథస్వామి దేవాలయం శ్రీరంగం, శ్రీ రాజగోపాల స్వామి దేవాలయం మన్నార్గుడి, జంబుకేశ్వర ఆలయం, తిరువానైకావల్, కంచి కైలాసనాథర్ ఆలయం కాంచీపురం, ఏకాంబరేశ్వర ఆలయం కాంచీపురం, రామనాథస్వామి దేవాలయం రామేశ్వరం, మయూరనాథస్వామి ఆలయం మైలాడుతురై, కపాలీశ్వర ఆలయం చెన్నై, ఏకశిలా రాతి దేవాలయాలు మహాబలిపురం, పాపనాశం దేవాలయం తిరునెల్వేలి సహా ఇక్కడ దేవాలయాలు వేల సంవత్సరాల నాటివి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..