AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mobile Phone Alert: మీ ఫోన్‌ బ్యాక్‌ కవర్‌లో డబ్బులు, ఆధార్ కార్డ్‌ పెడుతున్నారా.. ప్రమాదంలో పడతారు జాగ్రత్త..!

సాధారణంగా చాలా మంది ఫోన్ కవర్ వెనుక ఆధార్‌ కార్డు, ఏటీఎం కార్డు, డబ్బు వంటి వాటిని ఉంచుతారు. ఇప్పుడు తెలంగాణలో కొత్తగా అమల్లోకి వచ్చిన ఫ్రీ బస్‌ సదుపాయంలో ఆధార్ కార్డు, ఓటర్‌ ఐడీ తప్పని సరి అయింది. దాంతో చాలా మంది ఇలాగే చేస్తున్నారు. మీ ఈ అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Mobile Phone Alert: మీ ఫోన్‌ బ్యాక్‌ కవర్‌లో డబ్బులు, ఆధార్ కార్డ్‌ పెడుతున్నారా.. ప్రమాదంలో పడతారు జాగ్రత్త..!
keep money and Aadhaar Card on the back cover
Jyothi Gadda
|

Updated on: Oct 25, 2024 | 9:23 AM

Share

స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ స్మార్ట్‌ఫోన్‌నే ఉపయోగిస్తున్నారు. అయితే ఈ ఫోన్‌లను ఉపయోగించే విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. చాలా చోట్ల స్మార్ట్‌ఫోన్లు పేలుతున్నట్లు వార్తలు కూడా వింటుంటాం. అసలు ఫోన్ పేలిపోవడానికి కారణం ఏమిటో చాలా మందికి తెలియదు. ఇది మీరు స్మార్ట్‌ఫోన్‌ను ఎలా ఉపయోగిస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. మనం చేసే కొన్ని తప్పిదాల వల్ల స్మార్ట్ ఫోన్లు పేలిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాంటి తప్పులు ఏమిటో తెలుసుకుందాం.

మొబైల్ ఛార్జింగ్ కోసం ఎప్పుడూ మంచి కంపెనీ ఛార్జర్‌ని ఉపయోగించండి. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఎలాంటి ఇతర తక్కువ ధరకు లభించే ఛార్జర్‌తో ఫోన్‌ను ఛార్జ్ చేయవద్దు. దీని వల్ల మొబైల్ పేలిపోయే ప్రమాదం ఉంది.

ఫోన్‌ను ఎక్కువసేపు ఛార్జ్ చేయడం కూడా తప్పు. అలాగే చాలా మంది తమ ఫోన్‌ను ఛార్జింగ్‌ చేస్తూనే వాడుతుంటారు. అలాంటి సమయంలో ఫోన్ వాడటం పెద్ద తప్పు. అలా చేస్తే ఫోన్‌ను వేడి చేస్తుంది కాబట్టి, పేలిపోయే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

ఫోన్ ఛార్జింగ్ పెట్టి గేమ్స్ ఆడకండి. ఇది కూడా మీ మొబైల్‌ ఫోన్ బ్యాటరీపై ప్రభావం చూపుతుంది. అలాగే, అధిక ఉష్ణోగ్రత మీ ఫోన్‌కు ప్రమాదకరం.

వేసవిలో ఫోన్ పేలిపోవడానికి మరిన్ని కారణాలు ఉన్నాయి. విపరీతమైన వేడి సమయంలో ఫోన్‌ను మీ కారులో ఉంచవద్దు. ఒకవేళ ఫోన్‌లోని బ్యాటరీ వీక్‌గా ఉంటే అది పేలిపోయే ప్రమాదం లేకపోలేదు.

మరో విషయం మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. అదేంటంటే.. సాధారణంగా చాలా మంది ఫోన్ కవర్ వెనుక ఆధార్‌ కార్డు, ఏటీఎం కార్డు, డబ్బు వంటి వాటిని ఉంచుతారు. కానీ, అలా చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఇది ఫోన్‌ను త్వరగా వేడెక్కేలా చేస్తుంది. ఒక్కోసారి దీంతో మీ ఫోన్ పేలిపోయే ప్రమాదం కూడా ఎక్కువ. ఇప్పుడు తెలంగాణలో కొత్తగా అమల్లోకి వచ్చిన ఫ్రీ బస్‌ సదుపాయంలో ఆధార్ కార్డు, ఓటర్‌ ఐడీ తప్పని సరి అయింది. దాంతో చాలా మంది ఇలాగే చేస్తున్నారు. మీ ఈ అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..