Viral Video: అత్తారింటికి వెళ్లనంటూ మొండికేసిన నవ వధువు.. ఆమె సోదరుడు చేసిన పనితో అంతా అవాక్కు!

అలాగే, పెళ్లిలో జరిగే సరదాలు కూడా అంతే ఉంటాయి. ఇక పెళ్లి అనంతరం జరిగే వధువు అప్పగింతలు మాత్రం ప్రతి ఒక్కరినీ కదిలించేలా ఉంటుంది. చివరకు ఒక్కోసారి వరుడు సైతం కన్నీళ్లు పెట్టుకున్న సంఘటనలు కూడా లేకపోలేదు. అలాంటి ఇక్కడో వధువు వీడ్కోలు సందర్బంగా జరిగి సంఘటన ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

Viral Video: అత్తారింటికి వెళ్లనంటూ మొండికేసిన నవ వధువు.. ఆమె సోదరుడు చేసిన పనితో అంతా అవాక్కు!
Bride
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 23, 2024 | 2:12 PM

పెళ్లి విషయంలో ప్రపంచంలో రకరకాల ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయంలో వివాహం జరిపిస్తుంటారు. ఏది ఏమైనప్పటికీ పెళ్లి అంటేనే ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధుర జ్ఞాపకం. దానిని చిరకాలం అందరిలో గుర్తుండిపోయేలా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.. ఇక, వివాహ వేడుకలో జరిగే ప్రతి తంతూ విశిష్టమైనదే. అలాగే, పెళ్లిలో జరిగే సరదాలు కూడా అంతే ఉంటాయి. ఇక పెళ్లి అనంతరం జరిగే వధువు అప్పగింతలు మాత్రం ప్రతి ఒక్కరినీ కదిలించేలా ఉంటుంది. చివరకు ఒక్కోసారి వరుడు సైతం కన్నీళ్లు పెట్టుకున్న సంఘటనలు కూడా లేకపోలేదు. అలాంటి ఇక్కడో వధువు వీడ్కోలు సందర్బంగా జరిగి సంఘటన ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో పెళ్లి అనంతరం అప్పగింతల కార్యక్రమం జరుగుతోంది. అయితే, అత్తింటికి వెళ్లేందుకు వధువు ఇష్టపడడం లేదు. ససేమీరా వెళ్లనంటూ మొండికేసింది. పెద్దగా కేకలు పెడుతూ ఏడుపు ప్రారంభించింది. దీంతో ఆమె సోదరుడు తనను అమాంతంగా ఎత్తుకుని బలవంతంగా కారులో కూర్చోబెట్టారు. అప్పుడు కూడా ఆ వధువు పెద్దగా ఏడుస్తూనే ఉంది. ఇది చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు. ఊహించని రీతిలో జరిగిన ఈ ఘటన చూసి అందరూ నవ్వుకున్నారు.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ @24karattgold1 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. పోస్ట్ చేసిన వెంటనే వీడియో వేగంగా వైరల్‌గా మారింది. ఇప్పటికే దాదాపు 3 లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. ప్రతి ఒక్కరూ ఈ వీడియోపై స్పందించారు. చాలా మంది ఫన్నీ కామెంట్లు చేశారు. ఆమెను కిడ్నాప్ చేస్తున్నారా..? లేదంటే అత్తారింటికి తీసుకెళ్తున్నారా అంటూ కొందరు కామెంట్‌ చేయగా.. స్కూల్‌కు వెళ్లే పిల్లలా ఉంది పాపం అంటూ మరొకరు వ్యాఖ్యనించారు. ఇలా చాలా మంది రకరకాలుగా తమ అభిప్రాయాలను తెలియజేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..