Viral Video: వార్నీ రీల్స్ పిచ్చి తగలేయా..! కాలు జారి 70మీటర్ల లోయల్లో పడ్డ మహిళ..

సోషల్‌ మీడియాలో పాపులారిటీ కోసం ప్రమాదకరంగా రీల్స్‌ చేస్తున్న యువత ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ తరహా సంఘటన తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ కొండపై ప్రమాదకరంగా రీల్‌ చేస్తూ లోతైన లోయలోకి పడిపోయింది. ఆమె పరిస్థితి

Viral Video: వార్నీ రీల్స్ పిచ్చి తగలేయా..! కాలు జారి 70మీటర్ల లోయల్లో పడ్డ మహిళ..
Woman Making Reel Falls
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 27, 2024 | 7:11 AM

ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ అతి ముఖ్యమైన వస్తువుగా మారింది. ఇక విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చి ఇంటర్‌నెట్‌ సౌకర్యంతో ప్రజలు బాగా బిజీగా మారిపోయారు. పిల్లల నుంచి పెద్దల వరకు సెల్ఫీలు, రీళ్ల మోజులో పడికొట్టుకుంటున్నారు. ఈ పిచ్చి ప్రస్తుతం తారాస్థాయికి చేరుకుంది. రీల్స్‌ కోసం చాలా మంది తమ ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు. సోషల్‌ మీడియాలో పాపులారిటీ కోసం ప్రమాదకరంగా రీల్స్‌ చేస్తున్న యువత ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ తరహా సంఘటన తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ కొండపై ప్రమాదకరంగా రీల్‌ చేస్తూ లోతైన లోయలోకి పడిపోయింది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఓ మహిళ రీల్స్ చేస్తూ లోయలో పడిపోయిన ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన ఒక కుటుంబం శనివారం మానసా దేవి ఆలయాన్ని సందర్శించింది. అదే ఫ్యామిలీకి చెందిన 28 ఏళ్ల రేషు అక్కడి కొండపై రీల్ చేసింది. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు ఆమె కాలు జారి.. 70 మీటర్ల లోతైన లోయలోకి పడిపోయింది. గమనించిన కొందరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన ఆ మహిళను పైకి తీసుకొచ్చారు.. అంబులెన్స్‌లో తొలుత స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

ప్రథమ చికిత్స అనంతరం బాధితురాలిని మెరుగైన చికిత్స కోసం రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. వీడియోపై నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలు తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ క్లిక్ చేయండి..

సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?