AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vinayaka Chavithi: పూజ గదిలో లక్ష్మీదేవి గణపతి విగ్రహాల విషయంలో ఈ తప్పు చేస్తున్నారా.. జాగ్రత్త సుమా.. జీవితాంతం ఆర్ధిక కష్టాలే..

హిందూ మత విశ్వాసంలో గణేశుడు జ్ఞానానికి అధినేత. లక్ష్మీదేవి సంపద, శ్రేయస్సుకు అధి దేవతగా పరిగణించబడుతుంది. కనుక పూజ గదిలో ఇద్దరినీ కలిపి ఉంచాలి. దీపావళి, అక్షయ తృతీయ వంటి ప్రత్యేక శుభ సందర్భాలలో ఇద్దరు దేవతలను కలిసి పూజిస్తారు. ఎవరికైనా జ్ఞానం లేకపోతే.. అతని చేతిలోని డబ్బును దుర్వినియోగం అవుతుందని నమ్మకం. కనుక వినాయకుడిని, లక్ష్మిదేవిని పూజా స్థలాలలో పక్క పక్కన ఉంచుతారు.

Vinayaka Chavithi: పూజ గదిలో లక్ష్మీదేవి గణపతి విగ్రహాల విషయంలో ఈ తప్పు చేస్తున్నారా.. జాగ్రత్త సుమా.. జీవితాంతం ఆర్ధిక కష్టాలే..
Ganesha Lakshmi Puja
Surya Kala
|

Updated on: Aug 31, 2024 | 2:29 PM

Share

వాస్తు శాస్త్రంలో గణపతి లక్ష్మీదేవి విగ్రహాలు శుభానికి చిహ్నాలుగా భావిస్తారు. అందువల్ల వీటిని సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. శాస్త్రాల ప్రకారం పూజ గదిలో లక్ష్మీ దేవి విగ్రహాన్ని సరైన దిశలో ఉంచడం వల్ల విశేష ప్రయోజనాలు, సంపద లభిస్తాయి. వాస్తు ప్రకారం గణపతి లక్ష్మీదేవి విగ్రహాలను ఏ దిక్కున ఉంచితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

గణేశుడు, లక్ష్మి విగ్రహాలను కలిపి ఉంచండి

హిందూ మత విశ్వాసంలో గణేశుడు జ్ఞానానికి అధినేత. లక్ష్మీదేవి సంపద, శ్రేయస్సుకు అధి దేవతగా పరిగణించబడుతుంది. కనుక పూజ గదిలో ఇద్దరినీ కలిపి ఉంచాలి. దీపావళి, అక్షయ తృతీయ వంటి ప్రత్యేక శుభ సందర్భాలలో ఇద్దరు దేవతలను కలిసి పూజిస్తారు. ఎవరికైనా జ్ఞానం లేకపోతే.. అతని చేతిలోని డబ్బును దుర్వినియోగం అవుతుందని నమ్మకం. కనుక వినాయకుడిని, లక్ష్మిదేవిని పూజా స్థలాలలో పక్క పక్కన ఉంచుతారు.

పూజ గదిలో గణపతి, లక్ష్మీదేవి

పూజా గదిలో లేదా పూజ చేసుకునే చోట గణేశుడు, లక్ష్మి దేవి విగ్రహాలు ఒకచోట ఉంచుతారు. పురాణ శాస్త్రాల ప్రకారం ఇంటి పూజా గదిలో గణేశుడు, లక్ష్మిదేవి విగ్రహాలను ఉత్తరం వైపున ఉంచాలి. ఈ నమ్మకం వెనుక ఒక పురాణం కూడా ఉంది. దీని ప్రకారం ఒకసారి శివుడు కోపించి గణేశుడి తలను అతని రీరం నుండి వేరు చేశాడు. ఆ తర్వాత గణపతి తన సొంత కొడుకు అని తెలుసుకుని శివ గణాలను ఉత్తర దిశా కు పంపాడు, ఈ దిశలో మొదట కనిపించే వ్యక్తీ తలను తీసుకుని రమ్మన మని ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత ఆ శివ గణాలు తమకు ఉత్తర దిశలో నిద్రపోతున్న ఏనుగు తల నరికి తీసుకున్ని వెళ్ళారు. ఉత్తర దిశలో తల పెట్టి నిద్రపోతున్న ఐరావతాన్ని పరిశీలించడానికి ఉత్తరం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

ఇవి కూడా చదవండి

అది ఎప్పటికీ మర్చిపోవద్దు

చాలా సార్లు వినాయకుని ఎడమ వైపున లక్ష్మి విగ్రహాన్ని ఉంచడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వాస్తవానికి పురుషులకు ఎడమ వైపున వారి భార్యలు కూర్చున్నారు. లక్ష్మి వినాయకుని భార్య కానప్పటికీ, ఆమెను వినాయకుడికి ఎడమ వైపున ఉంచడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. ఆర్థిక సంక్షోభం ప్రారంభమవుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, లక్ష్మీ దేవి విగ్రహాన్ని వినాయకుడికి కుడి వైపున ఉంచాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండ్

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు