AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: కెరీర్ లో గ్రోత్ ఉండాలా .. పొరపాటున కూడా బెడ్ రూమ్ లో ఈ పని చేయవద్దు..

ఉద్యోగం చేస్తున్న చోట కూడా కెరీర్‌లో ఎదుగుదల ఉండదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉండిపోతారు. అయితే ఇలాంటి వారు కొన్ని వాస్తు చిట్కాలు పాటించి చూస్తే జీవితంలో కొన్ని మార్పులు జరగవచ్చు. కొన్నిసార్లు జీవితంలో చిన్న చిన్న విషయాలే పెను మార్పు చేస్తాయి. మనం ఎలా జీవిస్తున్నాం? మన జీవన విధానం ఏమిటి? మనకిస్తున్న మర్యాదలు ఏమిటి? ఇవన్నీ మానవ జీవితంలో ముఖ్యమైనవి. వాస్తు ప్రకారం జీవితంలో ఈ 4 విషయాలను జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభిస్తే మీ కెరీర్‌లో ఉన్నత స్థాయికి ఎదగకుండా ఎవరూ ఆపలేరు.

Vastu Tips: కెరీర్ లో గ్రోత్ ఉండాలా .. పొరపాటున కూడా బెడ్ రూమ్ లో ఈ పని చేయవద్దు..
Vastu Tips For Money
Surya Kala
|

Updated on: Aug 31, 2024 | 2:57 PM

Share

జీవితాన్ని నడపాలంటే అతి ముఖ్యమైనది డబ్బు. డబ్బులేని వాడు డుబ్బుకు కొరగాడు, డబ్బుకు లోకం దాసోహం వంటి సామెతలతో పెద్దలు ఏనాడో డబ్బుకున్న విలువ చెప్పారు. డబ్బుల లేని మనిషి బతకడం కష్టం. నేటి యుగంలో ఉద్యోగాలపై పూర్తిగా ఆధారపడి జీవిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. వీరికి డబ్బులు సంపాదించడానికి వేరే ఆప్షన్ లేదు. అయితే ఇలా ఉద్యోగం చేస్తున్న చోట కూడా కెరీర్‌లో ఎదుగుదల ఉండదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉండిపోతారు. అయితే ఇలాంటి వారు కొన్ని వాస్తు చిట్కాలు పాటించి చూస్తే జీవితంలో కొన్ని మార్పులు జరగవచ్చు. కొన్నిసార్లు జీవితంలో చిన్న చిన్న విషయాలే పెను మార్పు చేస్తాయి. మనం ఎలా జీవిస్తున్నాం? మన జీవన విధానం ఏమిటి? మనకిస్తున్న మర్యాదలు ఏమిటి? ఇవన్నీ మానవ జీవితంలో ముఖ్యమైనవి. వాస్తు ప్రకారం జీవితంలో ఈ 4 విషయాలను జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభిస్తే మీ కెరీర్‌లో ఉన్నత స్థాయికి ఎదగకుండా ఎవరూ ఆపలేరు.

కూర్చునే ప్రాంతం

అన్నింటిలో మొదటిది మీరు పనిచేసే చోట వాతావరణం ఎలా ఉందో చూసుకోవడం అతి ముఖ్యం. మీ పని సృజనాత్మకంగా ఉంటే కూర్చోవడానికి బహిరంగ స్థలాన్ని ఎంచుకోవాలి. అప్పుడు తాజాదనాన్ని కాపాడుతుంది. ఆఫీసులో ఉన్నప్పుడు ప్రధాన తలుపు ముందు కూర్చోకూడదు. మీరు ప్రధాన ద్వారానికి దూరంగా కూర్చోవడానికి ప్రయత్నించండి.

పడకగదిలో పని చేయవద్దు

నేడు కాలం మారింది. ఇంటి నుండి పని చేసే వారు చాలా మంది ఉన్నారు. ఈ వ్యక్తులు వాస్తు ప్రకారం కొన్ని ప్రత్యేక విషయాలపై కూడా శ్రద్ధ వహించాలి. మీరు పడకగదిలో ఎప్పుడూ పని చేయకూడదు. మీరు ఎల్లప్పుడూ స్టడీ రూమ్ లేదా మీరు విశ్రాంతి తీసుకునే ప్రదేశాన్ని పని చేయడానికి ఎంచుకోవాలి. పడకగదిలో పని చేయడం వల్ల ప్రతికూల శక్తి ప్రభావం పెరుగుతుంది. మీ పనిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇలాంటి కుర్చీని ఎంచుకోండి

చాలా మందికి ఆఫీసులో ఎక్కువ పని ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు కూర్చున్న కుర్చీ పరిస్థితిని కూడా గుర్తుంచుకోవడం ముఖ్యం. ఎల్లప్పుడూ ఎత్తైన వెనుక వైపు వీపు ఆనుకునే విధంగా ఉండే కుర్చీని ఎంచుకోండి. ఇది పురోగతికి మార్గం తెరుస్తుంది. అంతేకాదు ప్రధాన ద్వారం వైపు మీ వెన్ను చూపే విధంగా ఎప్పుడూ కూర్చోకూడదు. దీనివల్ల ప్రతికూలత కూడా వ్యాపిస్తుంది.

టేబుల్ ఎలా ఉండాలంటే

మీరు పని చేస్తున్న విధానం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు పని చేస్తున్నప్పుడు ఉపయోగించే టేబుల్ ఓవల్ ఆకారాన్ని కలిగి ఉండేలా ప్రయత్నించండి. చతురస్రం కాదు. అంతేకాదు టేబుల్ చెక్క లేదా గాజుతో చేసినట్లయితే.. అది వాస్తు ప్రకారం మరింత సరైనదిగా పరిగణించబడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండ్

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు