దుర్గమ్మకు దసరా శోభ… ఏ రోజు ఏ అవతారంలో అమ్మ దర్శనం…?

దుర్గమ్మకు దసరా శోభ... ఏ రోజు ఏ అవతారంలో అమ్మ దర్శనం...?

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ వారి దసరా ఉత్సవాల షెడ్యూల్ ను ఆలయ ఈవో ఎంవి.సురేష్ బాబు విడుదల చేశారు. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 8 వ తేదీ వరకు జరగనున్నాయి.  పదిరోజుల పాటు అమ్మవారు పది అలంకారాలలో దర్శనమివ్వనున్నారు. సెప్టెంబరు 29 న తొలిరోజు శ్రీ స్వర్ణకవాచాలంక్రుత దుర్గాదేవి గా దర్శనమిస్తారు సెప్టెంబరు 30 న శ్రీ బాలత్రిపురసుందరీ దేవి అలంకారం ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. […]

Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

Sep 27, 2019 | 5:58 PM

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ వారి దసరా ఉత్సవాల షెడ్యూల్ ను ఆలయ ఈవో ఎంవి.సురేష్ బాబు విడుదల చేశారు. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 8 వ తేదీ వరకు జరగనున్నాయి.  పదిరోజుల పాటు అమ్మవారు పది అలంకారాలలో దర్శనమివ్వనున్నారు.

సెప్టెంబరు 29 న తొలిరోజు శ్రీ స్వర్ణకవాచాలంక్రుత దుర్గాదేవి గా దర్శనమిస్తారు

సెప్టెంబరు 30 న శ్రీ బాలత్రిపురసుందరీ దేవి అలంకారం

ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి.

అక్టోబర్ 1 న శ్రీ గాయత్రీ దేవి అవతారం

ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది.

అక్టోబర్ 2 న శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారు అన్నపూర్ణదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. సకల ప్రాణకోటికి ఆహారాన్ని అందించే జగన్మాత అన్నపూర్ణదేవి అవతారంలో ఓ చేతిలో మధురసాలతో ఉన్న మాణిక్య పాత్ర మరో చేతిలో రతనాల గరిట పట్టుకున్న భక్తులకు దర్శనమిస్తోంది.  జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది.

అక్టోబర్ 3 న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారం

త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి’గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది.

 అక్టోబర్ 4 న శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారం

మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది.

అక్టోబర్ 5  శ్రీ సరస్వతీ దేవి అవతారం

చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది.

అక్టోబర్ 6 న శ్రీ దుర్గాదేవి అవతారం

దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు’ అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా’ అని పిలుస్తారు. శ్రీ దుర్గాదేవి ఉగ్ర స్వరూపిణి కనుక ఈ దేవిని దుర్గా అష్టోత్తారాలు, దుర్గా సహస్రనామాలకు బదులు శ్రీ లలితా అష్టోత్తరాలు, శ్రీ లలిత సహస్రనామాలుతో పూజిస్తారు. ెందుకంటే లలితా పరమ శాంత రూపం కనుక.

 అక్టోబర్ 7 న శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అవతారం

మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది.

 అక్టోబర్ 8 న ఉత్సవాల ఆఖరి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమివ్వనున్న దుర్గమ్మ

అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత’ అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ’ అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై ఉంటుంది.

ఉత్సవాల తొలిరోజు స్నపనాభిషేకం అనంతరం ఉదయం 9 గంటలకు దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ప్రతీ రోజు ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు.  అక్టోబర్ 8 వ తేదీన సాయంత్రం క్రుష్ణానది లో తెప్పోత్సవం నిర్వహించనున్నారు వేద పండితులు .

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu