Vidura Niti: విదురుడు చెప్పిన అవకాశవాదులు వీరే.. నేటికీ సమాజంలో ఇటువంటి వ్యక్తులు కనిపిస్తారు సుమా..
మాండవ్య ఋషి మానవ జీవిత పరిణామాలను గురించి తెలుసుకోమంటూ యమధర్మ రాజుని భూమి మీద జన్మించమని శపించాడు. ఆ శాపం వలన యమధర్మ రాజు మర్త్య లోకంలో విదురుడిగా జన్మించాడు. విదురుడు కురు రాజ్యానికి ప్రధానమంత్రి. మహాభారతంలో కీలక పాత్ర పోషించాడు. పాండవులు, కౌరవులకు పిన తండ్రి. మంత్రి విదుర హస్తినాపురానికి రాజైన అన్న ధృతరాష్ట్రుడికి అనేక నైతిక విషయాలు చెప్పాడు. అలంటి వాటిల్లో ఒకటి ఆశావాదుల గురించి.. వీరు తమ సొంత ప్రయోజనాలకి మాత్రమే విలువ ఇస్తారని చెప్పాడు.

ద్వాపర యుగంలో మహాత్మా విదురుడు హస్తినాపురానికి రాజైన ధృతరాష్ట్రుని ఆస్థానంలో మంత్రి పదవిగా విధులను నిర్వహించారు. మంత్రిగా రాజు ధృతరాష్ట్రుడికి మంచి చెడులను గురించి చెప్పేవాడు. విదురుడు అవకాశ వాదుల గురించి చెబుతూ కొంతమంది తమ సొంత ప్రయోజనాల కోసం, సిద్ధాంతాలను, నైతిక విలువలను లేదా ఇతరుల ప్రయోజనాలను పెద్దగా పట్టించుకోకుండా చేసిన ఉపకారాలను మరచిపోయి, పని పూర్తయిన తర్వాత అవతలి వారిని అసహ్యించుకునే వ్యక్తుల గురించి కూడా ధృతరాష్ట్రుడికి చెప్పాడు. నేటికీ కలియుగంలో కూడా విదుర నీతికి సంబంధించిన విషయాలు నిజమని నిరూపించబడతాయి. ప్రజలు తమ పని పూర్తయిన తర్వాత ఏ విషయాలను అసహ్యించుకుంటారో తెలుసుకుందాం?
మహాత్మా విదురుడి ప్రకారం శిష్యుడు, వివాహిత కుమారుడు, పురుషుడు, గురువు, నది దాటే వ్యక్తి, రోగి తనకు వైద్యం చేసిన వ్యక్తిని అగౌరవపరుస్తారు.
తన గురువుని మరిచే శిష్యుడు: కొంత మంది శిష్యులు విద్యను అభ్యసించిన తర్వాత వెళ్లిపోయినప్పుడు.. తమ గురువు అనుగ్రహాన్ని అంగీకరించరు. పైగా తనకు అన్నీ తెలుసు అనే అహంకారంతో తన గురువును అగౌరవపరుస్తారని మహాత్మా విదురుడు చెప్పాడు.
పెళ్లి చేసుకున్న తర్వాత కొడుకు: పెళ్లి చేసుకున్న చాలా మంది కొడుకులు తమ తల్లి చేసిన మేలులను మరచిపోతారు. వారు తమ తల్లిని అగౌరవపరుస్తారు.
స్త్రీ పురుషుడు: విదురుడి ప్రకారం పురుషుడు లైంగిక కోరికతో బాధపడుతున్నప్పుడు అతను ఒక స్త్రీతో లైంగిక సంబంధం కలిగి ఉంటాడు. అతని లైంగిక కోరిక తీరిన తర్వాత అతను ఆ స్త్రీని అగౌరవపరుస్తాడు.
పని చేసే మనిషిని గౌరవించని యజమాని: ఎవరి ఇంట్లోనైనా పనిమనిషి ఉంటే.. వారు పని పూర్తి చేసి వెళ్ళిపోతున్నప్పుడు.. ఆ పనిమనిషిని వారి యజమాని గుర్తించడు. అహంకారంతో నడుచుకుంటూ వారి అనుగ్రహంగా చూసే బదులు, వారిని అవమానిస్తాడు.
నది దాటే వ్యక్తి : ఒక వ్యక్తి నదిని దాటాల్సి వచ్చినప్పుడు.. నది ఒడ్డున పడవ ఎక్కి అవతలి ఒడ్డుకు వెళ్తాడు. అతను నది దాటిన తర్వాత.. అతను పడవను గౌరవించడు. ఆ పడవ, పడవ నడిపే వ్యక్తి తనకు చేసిన మేలుని గుర్తించడు.
వైద్యుడిని మార్చే రోగి: ఒక వ్యక్తి ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే.. అతను చికిత్స కోసం వైద్యుడి వద్దకు వెళ్తాడు. వైద్యుడు అతన్ని నయం చేస్తాడు. అతను తనకు వ్యాధి నయమైన తర్వాత.. ఆ వ్యక్తి వైద్యుడు చేసిన మేలుని మరచిపోతాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








