AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ketu Remedies: జాతకంలో కేతు స్థానం బలహీనంగా ఉంటే లక్షణాలు ఇవే.. కేతు అనుగ్రహం కోసం ఏ పరిహారాలు చేయాలంటే..

జాతకంలో కేతువు అపసవ్యదిశలో పయనిస్తుంటాడు. కేతు మహర్దశాకాలం ఏడు సంవత్సరాలు. రాశిలో ఒకటిన్నర సంవత్సరకాలం ఉంటాడు. ఎవరి జాతకంలోనైనా కేతువు బలహీనంగా ఉంటే ఆ వ్యక్తి చేపట్టిన ప్రతి పని చెడిపోతుంది. కనుక ఈ గ్రహాన్ని బలోపేతం చేయడానికి కొన్ని సులభమైన పరిహారాలు చేయాల్సి ఉంటుంది. ఈ రోజు జాతకంలో కేతువు స్థానం బలంగా ఉండేలా ఎలా చేయాలో తెలుసుకుందాం.

Ketu Remedies: జాతకంలో కేతు స్థానం బలహీనంగా ఉంటే లక్షణాలు ఇవే.. కేతు అనుగ్రహం కోసం ఏ పరిహారాలు చేయాలంటే..
Ketu Remedies
Surya Kala
|

Updated on: Jul 07, 2025 | 9:24 PM

Share

జ్యోతిషశాస్త్రం ప్రకారం కేతువును ఛాయా గ్రహంగా పరిగణిస్తారు. కేతువు ముక్తికారకుడు. ఈ గ్రహ స్థానం జాతకంలో బలహీనంగా ఉన్నప్పుడు అనేక ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. జాతకంలో కేతు దోషం ఉండటం వల్ల ఒక వ్యక్తి జీవితంలో అనేక సమస్యలు తలెత్తవచ్చు. ఇప్పటికే చేసిన పనిలో అడ్డంకులు తలెత్తవచ్చు. అటువంటి పరిస్థితిలో కేతు దోషాన్ని వదిలించుకోవడం చాలా ముఖ్యం. జ్యోతిషశాస్త్రం ప్రకారం జాతకంలో కేతువు చెడుగా ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది? కేతువును సంతోషపెట్టడానికి ఏమి చేయాలో ఈ రోజు తెలుసుకుందాం..

కేతువు చెడుగా ఉంటే ఏమి జరుగుతుంది?

జ్యోతిషశాస్త్రం ప్రకారం జాతకంలో కేతువు స్థానం చెడుగా ఉన్నప్పుడు.. ఆ వ్యక్తి శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. దీనితో పాటు కేతువు ప్రతికూల ప్రభావం కారణంగా చెడు అలవాట్లను చేసుకోవచ్చు. ఏ పని మొదలు పెట్టినా ఆటంకాలు ఉండవచ్చు. ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా ఏర్పడవచ్చు.

కేతువు ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి అనేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అవి ఏమిటంటే..

  1. కేతువు స్థానం బలోపేతానికి తీసుకోవాల్సిన పరిహారాలు
  2. గణేశుడు, శివుడు, కాల భైరవుడిని పూజించాలి.
  3. ఇవి కూడా చదవండి
  4. కేతు దోషానికి ‘ఓం కేం కేతవే నమః’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
  5. కుక్కకు నల్ల నువ్వులు, దుప్పటి, కొబ్బరి, ఆహారాన్ని అందించాలి.
  6. ప్రతి మంగళవారం గణేశుడికి దర్భగడ్డిని సమర్పించాలి.
  7. కేతువు బీజ మంత్రం అయిన ‘ఓం శ్రాం శ్రీం శ్రౌం సః కేతవే నమః అని జపించాలి .
  8. నుదిటిపై కుంకుమ లేదా పసుపుతో తిలకం దిద్దుకోవాలి.
  9. పేదలు, అవసరార్థులకు సహాయం చేయాలి.
  10. కేతు దోష నివారణకు బంగారు చెవిపోగులు ధరించాలి.
  11. కేతువు ప్రతికూల ప్రభావాలను నివారించడానికి ఒక కుక్కను పెంచుకోవాలి.
  12. కేతువు కోసం ఒక ఘనమైన వెండి ఏనుగును తయారు చేయించుకుని ఇంట్లో ఉంచాలి.
  13. బార్లీని నీటిలో కలిపి త్రాగడం ద్వారా కేతు దోషం నుంచి ఉపశమనం పొందవచ్చు.
  14. కేతు దోషానికి , ‘ఓం స్రం శ్రీం స్రం సః కేత్వే నమః ‘ అనే మంత్రాన్ని 5, 11 లేదా 18 జపాలు జపించాలి.
  15. ప్రతి శనివారం, రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి పేదలకు దానధర్మాలు చేయండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.