Monsoon Health Tips: ఈ సీజన్ లో రోజుని ఈ పానీయంతో మొదలు పెట్టండి.. సీజనల్ వ్యాధులకు గుడ్ బై చెప్పండి..
వేసవి నుంచి ఉపశమనం ఇస్తూ వర్షాకాలం వచ్చేసింది. వానలతో పాటు సీజనల్ వ్యాధులు కూడా విజ్రుభించే సమయం కూడా ఇదే.. ముఖ్యంగా ఈ సమయంలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటం వల్ల ప్రజలు తరచుగా అనారోగ్యానికి గురవుతారు. కనుక రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడం తప్పనిసరి. ఈ రోజు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే సహజ పానీయం గురించి తెలుసుకుందాం. దీనిని రోజూ తాగడం వలన అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలు చాలా పెరుగుతాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తి బలంగా ఉంటే మారుతున్న వాతావరణంలో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. కనుక సీజనల్ వ్యాధులు దరి చేరకుండా ఉండాలంటే ఈ పానీయాన్ని రోజువారీ ఆహార ప్రణాళికలో భాగం చేసుకోవాలి. ఔషధ గుణాలతో నిండిన ఈ పానీయం గురించి తెలుసుకుందాం.
వర్షాకాలంలో, రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటం వల్ల ప్రజలు తరచుగా అనారోగ్యానికి గురవుతారు. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ప్రభావవంతంగా పని చేసే సహజ పానీయం ఏమిటంటే..
రోజూ తేనె నిమ్మకాయ నీరు త్రాగాలి తేనె, నిమ్మకాయ రెండింటిలోనూ లభించే అన్ని పోషకాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉన్నాయని నిరూపించబడ్డాయి. తేనె నిమ్మకాయ నీరు శరీరంపై ఎన్ని సానుకూల ప్రభావాలను చూపుతుందో మీకు తెలుసా? ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఈ పానీయాన్ని తాగడం ప్రారంభించండి.. కొన్ని వారాలలోనే మీకు ఈ పానీయం ఎలా శరీరంపై ప్రభావాన్ని చూపిస్తుందో మీకే స్వయంగా తెలుస్తుంది.
తేనె, నిమ్మకాయ నీటిని ఎలా తయారుచేసుకోవాలంటే ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక గ్లాసు నీరు వేయండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఈ నీటిని గోరువెచ్చగా చేయండి. ఇప్పుడు మీరు ఈ నీటిని ఒక గ్లాసులో పోసి దానికి కొంచెం తేనె , నిమ్మరసం కలపాలి. ఆయుర్వేదం ప్రకారం మెరుగైన ఫలితాలను పొందడానికి పోషకాలు అధికంగా ఉండే ఈ పానీయాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం మంచిది.
శరీరం ఉక్కులా అవుతుంది తేనె, నిమ్మకాయ నీటిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు మంచి మొత్తంలో ఉంటాయి. ఈ పానీయాన్ని క్రమం తప్పకుండా తాగడం ద్వారా రోగనిరోధక శక్తిని చాలా వరకు పెంచుకోవచ్చు. . వర్షాకాలం ప్రారంభానికి కొన్ని వారాల ముందు ఈ పానీయాన్ని తాగడం ప్రారంభించండి.. తద్వారా వర్షాకాలంలో వ్యాధులు శరీరంపై దాడి చేయవు.
అంతేకాదు ఈ పానీయం జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఈ పానీయంలోని తేనెలోని చక్కెరలు త్వరగా శక్తిని అందిస్తాయి. దీంతో ఈ పానీయంతో రోజుని ప్రారంభించడం మొదలు పెడితే.. రోజంతా చురుకుగా ఉండేలా చేస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








