Vastu Tips: ఇంట్లో శాంతి నెలకొనాలంటే.. ఏఏ పువ్వుల మొక్కలను వాస్తు ప్రకారం ఏ దిశలో ఏర్పరచుకోవాలంటే..

పువ్వులు పూజకు మాత్రమే కాదు.. ఇంటి శాంతిని కాపాడతాయని నమ్మకం. వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో నాటవలసిన ఆ పువ్వుల మొక్కలు ఏమిటో తెలుసుకుందాం.

Vastu Tips: ఇంట్లో శాంతి నెలకొనాలంటే.. ఏఏ పువ్వుల మొక్కలను వాస్తు ప్రకారం ఏ దిశలో ఏర్పరచుకోవాలంటే..
Vastu Tips
Follow us
Surya Kala

|

Updated on: May 15, 2022 | 6:22 PM

Vastu Tips: ఇంట్లో పువ్వుల మొక్కలు పరిసరాలను అందంగా, స్వచ్ఛంగా ఉంచుతాయి. కొన్ని పువ్వులు దేవుడి పూజకు ఉపయోగిస్తారు. కొన్ని పువ్వుల మొక్కలను వాస్తుకి అనుగుణంగా ఏర్పాటు చేసుకుంటే.. ఇంటికి చాలా శుభప్రదంగా వర్ణించబడ్డాయి. ఇంటి ఐశ్వర్యాన్ని తీసుకొస్తాయని నమ్మకం. అంతేకాదు జీవితంలో సానుకూల శక్తి ప్రసారం చేస్తాయి. అంతేకాదు ఇలా ఏర్పాటు చేసిన మొక్కలు ప్రతికూలతను తొలగించడానికి సహాయపడతాయి. ఈ మొక్కల పువ్వులు పూజకు మాత్రమే కాదు.. ఇంటి శాంతిని కాపాడతాయని నమ్మకం. వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో నాటవలసిన ఆ పువ్వుల మొక్కలు ఏమిటో తెలుసుకుందాం.

మందార పువ్వు:  ఎరుపు రంగు మందార పువ్వును ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ పువ్వులు దుర్గ అమ్మవారికి, గణేశుడికి సమర్పిస్తారు. వాస్తు ప్రకారం.. ఇంట్లో సానుకూలతను తీసుకురావడానికి ఈ పూల మొక్కలను నాటడం మంచిది. ఈ మొక్కను ఉత్తరం లేదా తూర్పు దిశలో నాటాలి. ఈ మందార పువ్వులను మంగళవారం హనుమంతుడికి కూడా సమర్పించవచ్చు. ఎరుపు మందార పువ్వును సూర్య భగవానుని పూజ కూడా ఉపయోగించవచ్చు.

తామర పువ్వు:  తామర పువ్వు లక్ష్మీ దేవి, బుద్ధ భగవానుడికి మంచి సంబంధం  ఉంది. ఈ పువ్వు ఆధ్యాత్మికతకు చిహ్నంగా పరిగణించబడుతుంది. తామర మొక్కను ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం వలన ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. వాస్తు ప్రకారం ఈ మొక్కను నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈశాన్య లేదా ఉత్తరం లేదా తూర్పు దిశలో తామర పువ్వు మొక్కలను ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరం.

ఇవి కూడా చదవండి

బంతి పువ్వులు:  పూజలో ఎక్కువగా పసుపు రంగులో ఉండే బంతి పువ్వులను ఉపయోగిస్తారు. ఇవి అదృష్టానికి, ఆశావాదానికి చిహ్నం.  పసుపురంగు బంతిపువ్వులు జీవితంలో అదృష్టాన్ని తెస్తాయని నమ్మకం. దీపావళి వంటి సందర్భాలలో ఇంటిని అలంకరించుకోవడానికి ప్రజలు బంతి పువ్వులను కూడా ఉపయోగిస్తారు.

గులాబీ పువ్వులు: ఈ పువ్వు ప్రేమకు చిహ్నంగా పరిగణించబడుతున్నాయి. వాస్తు ప్రకారం గులాబీపువ్వులు అదృష్ట పుష్పం. వాస్తు శాస్త్రం ప్రకారం  గులాబీ మొక్కలను నైరుతి దిశలో ఏర్పాటు చేసుకోవాలి. ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తాయి.

సంపంగి పువ్వులు:  సంపంగి పువ్వులు చాలా అందంగా ఉంటాయి. లేత పసుపు, తెలుపు, ఆకు పచ్చ రంగులో ఉంటాయి. వీటిని తరచుగా పూజలో ఉపయోగిస్తారు. వాస్తు ప్రకారం, ఈ పువ్వులు అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడతాయి.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..