Best Vastu tips: సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం ఈ వాస్తు చిట్కాలను పాటించండి..
Best Vastu tips: కొన్నిసార్లు అనుమానాలు, మనస్పర్థలు, అవగాహన లేమి, గొడవలు వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. ఇవి సంతోషకరమై జీవితాన్ని నాశనం చేస్తాయి.
Best Vastu tips: కొన్నిసార్లు అనుమానాలు, మనస్పర్థలు, అవగాహన లేమి, గొడవలు వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. ఇవి సంతోషకరమై జీవితాన్ని నాశనం చేస్తాయి. అయితే, దంపతుల మధ్య గొడవలకు వాస్తు కారణాలు కూడా కారణం అవుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కొన్ని వాస్తు చిట్కాలను పాటిస్తే.. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని చెబుతున్నారు. మరి వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..
పడకగది కిటికీ.. పడకగదిలో కిటికీ ఉండాలి. ఇది దంపతుల మధ్య విభేదాలను తగ్గిస్తుందట. పరస్పర ప్రేమానురాగాలను పెంచుతుందట. ప్రేమ సంబంధంలో ఉంటుంది.
పడక గదిలో అద్దం.. వాస్తు ప్రకారం పడకగదిలో అద్దం పెట్టుకోవడం మంచిది. ఈ కారణంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తగ్గి, వారి మధ్య ప్రేమ పెరుగుతుందట.
పడకగదిలో ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంచొద్దు.. పడకగదిలో ఎలక్ట్రానిక్ పరికరాలను ఎప్పుడూ ఉంచవద్దు. వాస్తు ప్రకారం అవి సానుకూల శక్తిని తగ్గిస్తాయి. ఇది మీ సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది.
ముళ్ళ పువ్వులు ఉంచవద్దు.. పడకగదిలో ఎండిపోయిన, ముళ్ళు గల మొక్కలను ఎప్పుడూ ఉంచవచ్చు. వీటి కారణంగా భార్యాభర్తల మధ్య టెన్షన్ పెరుగుతుంది.
ఏవైపు పడుకోవాలంటే.. భార్య ఎల్లప్పుడూ తన భర్తకు ఎడమ వైపున నిద్రిరంచాలి. ఇది వారి మధ్య పరస్పర ప్రేమను పెంచుతుంది.
సరైన రంగులను ఎంచుకోండి.. పడక గదికి లేత గులాబీ రంగు, లేత ఆకుపచ్చ రంగు వేయడం మంచిది. ముదురు రంగులను ఎప్పుడూ ఉపయోగించవచ్చు. లేత గులాబీ రంగు, లేత ఆకుపచ్చ రంగులు ఆహ్లాదకరంగా పరిగణనించబడుతాయి. ఈ రంగులు ఒత్తిడిని తగ్గించడంలో, భాగస్వామిని దగ్గర చేయడంలో సహాయపడుతాయి.
పడకగదిలో దేవతా చిత్రాలను పెట్టొద్దు.. భార్యాభర్తలు పడుకునే గదిలో దేవుళ్లు, దేవతల చిత్రాలను పెట్టవద్దు. దంపతుల తమ పాదాల వైపు నీరు ప్రవహిస్తున్నట్లుగా ఉండే చిత్ర పటాన్ని పెట్టాలి. ప్రవహించే నీరు ప్రేమకు చిహ్నం. దానిని ఉంచితే దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతంది.
మనీ ప్లాంట్ ఉంచండి.. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్‌ను ఉంచడం మంచిది. దీనిని శుక్రుని చిహ్నంగా పేర్కొంటారు. భార్యాభర్తల మధ్య బంధాన్ని మధురంగామారుస్తుంది. వారి మధ్య ప్రేమను పెంచుతుంది.
Also read:
Andhra Pradesh: మెడలో నగలు ఉంటే పెన్షన్ రాదట.. అది నమ్మిన వృద్ధురాలి పరిస్థితి ఏమైందంటే..
Anandayya Medicine: మరో వివాదంలో ఆనందయ్య మందు.. నోటీసులు జారీ చేసిన కలెక్టర్.. వారం రోజుల గడువు..!