AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu tips: వంటగది దగ్గర పూజా మందిరం ఉంటే ఎంత నష్టమో తెలుసా?

వాస్తు శాస్త్రం అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఇంటి నిర్మాణంతోపాటు ఏ వస్తువు ఎక్కడ ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తుందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. వాస్తు శాస్త్రం.. రెండు విషయాల ఆధారంగా పనిచేస్తుంది, అవి సానుకూల శక్తి, ప్రతికూల శక్తి. వాస్తు శాస్త్రం ప్రకారం.. మీ ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగినప్పుడు, అది మీపై, మీ మొత్తం కుటుంబంపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది.

Vastu tips: వంటగది దగ్గర పూజా మందిరం ఉంటే ఎంత నష్టమో తెలుసా?
Puja Mandir
Rajashekher G
|

Updated on: Jan 08, 2026 | 7:14 PM

Share

వాస్తు శాస్త్రం అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఇంటి నిర్మాణంతోపాటు ఏ వస్తువు ఎక్కడ ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తుందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. వాస్తు శాస్త్రం.. రెండు విషయాల ఆధారంగా పనిచేస్తుంది, అవి సానుకూల శక్తి, ప్రతికూల శక్తి. వాస్తు శాస్త్రం ప్రకారం.. మీ ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగినప్పుడు, అది మీపై, మీ మొత్తం కుటుంబంపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. దీంతో ఇంట్లో వివిధ సమస్యలు తలెత్తుతాయి.

ఉదాహరణకు ఇంట్లో అకస్మాత్తుగా పెద్ద సంక్షోభం, ఇంట్లో ఎటువంటి కారణం లేకుండా వాదనలు పెరగడం, ఆకస్మిక ఆర్థిక సంక్షోభం, వివిధ ఆరోగ్య సమస్యలు మొదలైనవి. దీనికి విరుద్ధంగా, మీ ఇంట్లో సానుకూల శక్తి ఉంటే.. అది మీపై, మీ కుటుంబంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది, ఎందుకంటే ఇంట్లోని అన్ని రకాల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

వంట గదికి దగ్గరగా పూజా మందిరం ఎందుకు ఉండకూడదో తెలుసా?

వాస్తు శాస్త్రం.. మీ ఇంట్లోని పూజా మందిరం లేదా పూజా గదికి పలు నియమాలను సూచించింది. మీ పూజా మందిరం మీ వంటగదికి దగ్గరగా ఉండకూడదని స్పష్టం చేసింది. అలా ఉంటే.. ఇది శక్తి సంఘర్షణకు కారణమవుతుందని, ప్రతికూల శక్తిని సృష్టిస్తుందని తెలిపింది. అందుకే వాస్తు శాస్త్రం ఏమి చెబుతుందో తెలుసుకుందాం.

పూజా మందిరం, వంట గది అనేవి మన ఇంట్లో రెండు ముఖ్యమైన భాగాలు. వంటగది, పూజా మందిరం మన ఇంట్లో రెండు ప్రధాన శక్తి వనరులుగా వాస్తు శాస్త్రం చెబుతోంది. రజస్, తమస్ శక్తి ఎల్లప్పుడూ వంటగది నుంచి వెలువడుతుంది. అయితే సానుకూల శక్తి మాత్రం ఎల్లప్పుడూ మీ పూజా గది నుంచి వెలువడుతుంది. అలాంటి సందర్భంలో.. మీ పూజా మందిరం.. వంటగదికి సమీపంలో ఉంటే.. వంటగది నుంచి వెలువడే శక్తికి, పూజా మందిరం నుంచి వెలువడే శక్తికి మధ్య ఒక రకమైన వైరుధ్యం ఏర్పడుతుంది. దీని కారణంగా ఇంట్లో ప్రతికూల శక్తి సృష్టించబడుతుంది.

ఇంట్లో ప్రతికూల శక్తి సృష్టించబడితే.. వాస్తు దోషం ఏర్పడుతుంది. అందువల్ల, ఇంట్లో వాస్తు దోషాన్ని నివారించడానికి మీ పూజా మందిరాన్ని.. వంటగదికి దగ్గరగా ఉండకూడదని వాస్తు శాస్త్రం చెబుతుంది.

పూజా మందిరం ఏ దిశలో, ఎలా ఉండాలి?

వాస్తు శాస్త్రం ప్రకారం.. మీ పూజా గది లేదా పూజా మందిరం ఎప్పుడూ పూర్తి లేదా పశ్చిమ దిశ వైపు ఉండాలి. అది ఈశాన్య దిశలో ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఈశాన్య దిశ దేవుని దిశ. అలాగే, మీ పూజా మందిరంలో ఒకే దేవుని రెండు విగ్రహాలు లేదా చిత్రాలు ఉండకూడదు. అదేవిధంగా, మీ పూర్వీకుల ఫోటోలను పూజా మందిరంలో ఉంచకూడదు, ఎందుకంటే ఇది వాస్తు లోపాలను సృష్టిస్తుంది. పూజాగది‌లో శివలింగం, గణపతి, కుటుంబ దేవత విగ్రహాలు ఉండాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇలా ఉంటే మంచిదని పేర్కొంటోంది.

Note: ఈ వార్తలోని సమాచారం వాస్తుశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. TV9తెలుగు దీనిని ధృవీకరించదు.