Vastu Rules: సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారా? మీ ఇంటిని ఇలా నిర్మించుకోండి..!
Vastu Rules: సూర్యని కదలిక ఆధారంగా వాస్తు నియమాలను రూపొందించడం జరిగింది. ఫలితంగా సూర్యుని శక్తి, ప్రభావం ఇంట్లోకి నేరుగా ప్రవేశించగలదని..
Vastu Rules: సూర్యని కదలిక ఆధారంగా వాస్తు నియమాలను రూపొందించడం జరిగింది. ఫలితంగా సూర్యుని శక్తి, ప్రభావం ఇంట్లోకి నేరుగా ప్రవేశిస్తుందని విశ్వాసం. ఇంట్లో సానుకూల ప్రభావం వస్తుంది. తద్వారా ఆనందం, శాంతి ఎల్లప్పుడూ ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో ఏ ప్రదేశంలో శక్తి ప్రభావం ఉంటుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాస్తు, సూర్యునికి ప్రత్యేకమైన సంబంధం ఉంది. సూర్యుని కదలిక, దిశ ఆధారంగా ఇంటి నిర్మాణం చేపడితే మంచి జరుగుతుందని విశ్వాసం. మరి ఆ వాస్తు నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. సూర్యోదయానికి ముందు మధ్యాహ్నం 3 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు బ్రహ్మ ముహూర్తం. ఈ సమయంలో సూర్యుడు ఇంటికి ఈశాన్యంలో ఉంటాడు. ఈ పవిత్ర సమయం ధ్యానం, ఆరాధనకు ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఈ నేపథ్యంలో వాస్తు నియమాల ప్రకారం పూజా మందిరాన్ని ఈశాన్య దిశలో నిర్మించాలి.
2. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు సూర్యుడు ఇంటికి తూర్పు వైపున ఉంటాడు కావున తగినంత సూర్యరశ్మి ఇంట్లోకి వచ్చేలా ఇంటిని నిర్మించుకోవాలి. ఉదయ పూట వచ్చే సూర్యకాంతి ఇంట్లోకి ప్రవేశించడం వల్ల ఇంట్లోని వ్యక్తుల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతంది. అందుకే ఇంటి కిటికీలు, తలుపులు అన్నీ ఉదయాన్నే తెరవాలని వాస్తు శాస్త్రంలో సూచిస్తున్నారు.
3. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సూర్యుడు ఇంటికి ఆగ్నేయంలో ఉంటాడు. ఈ సమయం స్నానానికి, వంటకు అనుకూలంగా ఉంటుంది. వంటగది, బాత్రూమ్ ఎల్లప్పుడూ తడిగా ఉంటాయి. ఆగ్నేయంలో సూర్యుడు ప్రకాశించే సమయంలో వంట, స్నానం చేయడం వలన ఆ ప్రాంతాలు త్వరగా ఎండిపోతాయి. వ్యాధులను కూడా దూరం చేసుకోవచ్చు.
4. మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు విశ్రాంతి సమయం. ఈ సమయంలో సూర్యుడు దక్షిణ దిశలో ఉంటాడు కాబట్టి పడకగదిని ఈ దిశలో నిర్మించుకోవాలి. వాస్తు ప్రకారం, పడకగదిలోని కర్టెన్లు ముదురు రంగులో ఉండాలి. ఈ సమయంలో సూర్యుడి నుండి ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు విడుదలవుతాయి. ముదురు రంగు తెరలు ఆ కిరణాలను అడ్డుకుని, ఆరోగ్యానికి హానీ కలిగించకుండా ఉంటాయి.
5. వాస్తు నిబంధనల ప్రకారం.. పఠనం, పని చేసే సమయం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల మధ్య ఉండాలి. ఈ సమయంలో సూర్యుడు నైరుతిలో ఉంటాడు. కాబట్టి ఈ స్థలం స్టడీ రూమ్ లేదా లైబ్రరీకి ఉత్తమమైనది.
6. సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు.. తినడం, కూర్చోవడం, చదువుకోవడానికి అనుకూలమైన సమయం. కావున, గదికి పడమటి మూలలో డైనింగ్ లేదా లివింగ్ రూమ్ నిర్మించుకోవాలి. ఈ సమయంలో సూర్యుడు పడమర వైపు కదులుతాడు.
7. రాత్రి 9 గంటల నుండి అర్ధరాత్రి వరకు సూర్యుడు ఇంటికి వాయువ్య దిశలో ఉంటాడు. ఈ స్థలం పడకగదికి అనుకూలంగా ఉంటుంది.
8. అర్ధరాత్రి నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు సూర్యుడు ఇంటి ఉత్తర భాగంలో ఉంటాడు. ఈ సమయం చాలా గోప్యంగా ఉంటుంది. విలువైన వస్తువులు లేదా నగలు మొదలైన వాటిని ఉంచడానికి కూడా ఈ అంశం ఉత్తమ సమయం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..