Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దిష్టి నివారణకు గుమ్మడికాయ కడుతున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయకండి..!

ఇళ్ళు, వ్యాపార స్థలాలు ప్రారంభించినప్పుడు దిష్టి తగలకుండా గుమ్మడికాయ కట్టడం మన సంప్రదాయం. దీనిని నరదిష్టి, కనుదిష్టి నివారణకు, అడ్డంకులు తొలగించడానికి చేస్తారు. అయితే ఈ ఆచారాన్ని పాటించే ముందు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

దిష్టి నివారణకు గుమ్మడికాయ కడుతున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయకండి..!
Hanging Ash Gourd
Follow us
Prashanthi V

|

Updated on: Feb 14, 2025 | 5:56 PM

గుమ్మడికాయలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి కూరలకు ఉపయోగించేది. మరొకటి దిష్టి కోసం వాడే బూడిద గుమ్మడికాయ. దీనిని కట్టేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. గుమ్మడికాయను కడగకూడదు. దానిపై పేరుకున్న బూడిదను శుభ్రం చేయాలనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. కానీ అలా చేయడం వల్ల దాని శక్తి తగ్గిపోతుంది. కేవలం పసుపు, కుంకుమ బొట్లు పెడితే సరిపోతుంది.

గుమ్మడికాయను తొడిమతో పట్టుకోవాలి. తొడిమ ఊడిపోతే దాని శక్తి పోతుంది. తొడిమ లేకుండా కడితే ఫలితం ఉండదు. మార్కెట్ నుండి తెచ్చేటప్పుడు గుమ్మడికాయను తిరగేసి పట్టుకోకూడదు. అంటే కాడ కిందికి, కాయ పైకి ఉండేలా పట్టుకోకూడదు. కాడ పైకి ఉండేలా పట్టుకుంటేనే దాని శక్తి నిలుస్తుంది.

గుమ్మడికాయను కట్టడానికి సరైన సమయం

  • అమావాస్య రోజున సూర్యోదయానికి ముందే కడితే మంచిది. అది దిష్టిని తొలగించి, శుభ ఫలితాలను ఇస్తుంది.
  • అమావాస్య కుదరకపోతే, బుధవారం లేదా శనివారం సూర్యోదయానికి ముందే కట్టవచ్చు.
  • సూర్యోదయానికి ముందు కడితే విశేష ఫలితాలు, సూర్యోదయం తర్వాత కడితే సాధారణ ఫలితాలు ఉంటాయి. సూర్యాస్తమయం తర్వాత కడితే ఫలితం ఉండదు.

గుమ్మడికాయను కట్టడం చాలా సులభం. గుమ్మడికాయను ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. దానికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టాలి. దానిని జాలిలో పెట్టి ఇంటి ముందు వేలాడదీయాలి. ఈ నియమాలను పాటించి సరైన సమయంలో గుమ్మడికాయను కట్టడం వల్ల దిష్టి ప్రభావం నుంచి బయటపడవచ్చు.

(ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది)