
భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రధాన గుర్తింపుగా అతి పురాతన నగరం వారణాసి దక్కించుకుంది. ప్రపంచంలో రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన ఆధ్యాత్మిక గమ్యస్థానంగా వారణాశి నిలిచిందని.. విశ్వాస ఆధారిత పర్యాటక ధోరణులను విశ్లేషించే వేదిక అయిన మై క్రాస్ ఇటీవల నిర్వహించిన ప్రపంచ అధ్యయనం ప్రకారం తెలిసింది.
ఈ ప్రసిద్ది ఆధ్యాత్మిక నగరాల ఎంపికను ఐదు అంశాల్లో అధ్యయనం చేసి.. ఐదు కీలక పారామితుల ఆధారంగా నగరాలను మూల్యాంకనం చేసింది. ఆధ్యాత్మిక నగరంలో వార్షిక సందర్శకుల సంఖ్య, నగరంలో మతపరమైన ప్రదేశాల సంఖ్య, ఆన్‌లైన్ శోధన పరిమాణం, సోషల్ మీడియా ప్రస్తావనల, అందుబాటులో ఉన్న వసతి సదుపాయాలను పరిగణలోకి తీసుకుంది. ప్రతి గమ్యస్థానానికి 1 నుంచి 100 స్కేల్‌పై సాధారణీకరిం.. స్కోరు కేటాయించబడింది.
ఈ ఐదు అంశాల్లో నూటికి నూరు స్కోర్ తో అగ్రస్థానంలో జపాన్‌లోని క్యోటో నిలిచింది. తర్వాత వారణాశి 78 స్కోరుతో 100 స్కోరుతో సెకండ్ ప్లేస్ ని సొంతం చేసుకుంది. క్యోటో 75 మిలియన్లకు పైగా సందర్శకులతో వార్షిక సందర్శనలో అగ్రస్థానంలో ఉండడమే కాదు అత్యధిక సంఖ్యలో మతపరమైన ప్రదేశాలను కలిగి ఉంది. ఆన్‌లైన్ శోధన పరిమాణంలో వారణాసి దాదాపు 2.8 మిలియన్ల నెలవారీ శోధనలతో అగ్రస్థానంలో ఉంది. సర్వే చేయబడిన అన్ని గమ్యస్థానాల్లో వారణాసిదే అత్యధికం. వారణాసి తర్వాత స్థానంలో వాటికన్ నగరం 70 స్కోరుతో మూడవ స్థానంలో నిలిచింది. దీనికి కేవలం తొమ్మిది మతపరమైన ప్రదేశాలు మాత్రమే ఉన్నప్పటికీ.. కాథలిక్కులకు ఈ నగరం అత్యధిక వసతిని అందిస్తుంది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి విశ్వాస కేంద్రంగా ఉంది.
వారణాసి నగరానికి ఏడాదికి 11 మిలియన్ల మంది సందర్శకులు వస్తున్నారు. అయితే వారణాసి 1,149 వసతి సౌకర్యాలను అందిస్తుంది. ఇది క్యోటో కంటే దాదాపు రెట్టింపు, ఇది వారణాసికి బలమైన ఆతిథ్య మౌలిక సదుపాయాల కల్పన. అంతేకాదు వారణాసిలో సందర్శించే యాత్రికులు, పర్యాటకులను స్వాగతించడానికి ఎప్పుడూ రెడీగా ఉంటుందని ఈ సదుపాయాల ద్వారా తెలియజేస్తున్నాయి. వారణాసి నగరం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, ముఖ్యంగా గంగానదిలో చేసే పవిత్ర స్నానాలు .. గంగా తీరంలో ఘాట్‌లపై పూర్వీకుల కర్మలను ఆచరించే హిందువులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూనే ఉన్నారు.
వారణాసికి ప్రపంచవ్యాప్తంగా దక్కిన గుర్తింపుపై ఉత్తరప్రదేశ్ పర్యాటక మంత్రి జైవీర్ సింగ్ స్పందించారు. ఈ నివేదిక ప్రభుత్వం ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడంపై దృష్టి సారించడాన్ని ధ్రువీకరిస్తుందని ప్రశంసించారు. వారణాసి ప్రపంచవ్యాప్తంగా రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన ఆధ్యాత్మిక గమ్యస్థానంగా గుర్తింపు పొందడం చాలా గర్వకారణం అని సింగ్ అన్నారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ప్రభుత్వం ఆధ్యాత్మిక రంగంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, మన ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రదర్శించడానికి చేస్తున్న అంకితభావంతో కూడిన ప్రయత్నాలు స్పష్టంగా ఫలించాయి. వారణాసిని ప్రపంచ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా మరింత అభివృద్ధి చేయడానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పారు.
వారణాసికి చెందిన టూర్ ఆపరేటర్ రమేష్ సింగ్ మాట్లాడుతూ గత సంవత్సరం నుంచి వారణాసికి వస్తున్న అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింద” అని ఆయన అన్నారు. ఈ పవిత్ర నగర సంస్కృతి, సంగీతం , పురాతన సంప్రదాయాలను అన్వేషించడానికి కూడా వస్తున్నారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, నదీ తీర సుందరీకరణ, గంగా ఆరతి వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు పర్యాటకుల అనుభవాన్ని మెరుగుపరిచాయని చెప్పారు.
మై క్రాస్ అధ్యయనంలో మొదటి పది గమ్యస్థానాలలో రియో డి జనీరో (బ్రెజిల్), లాసా (టిబెట్), మక్కా మదీనా (సౌదీ అరేబియా), జెరూసలేం (ఇజ్రాయెల్), సీమ్ రీప్ (కంబోడియా) , కాంటర్బరీ (యుకె) ఉన్నాయి.
మతపరమైన పర్యాటకం ఆధ్యాత్మిక సంప్రదాయాలను ఆధునిక ప్రయాణాలతో మిళితం చేస్తోంది. నేటి ప్రపంచ యాత్రికుడి అవసరాలను స్వీకరించేటప్పుడు వాటి పవిత్ర మూలాలను గౌరవించేవి అత్యంత విజయవంతమైన గమ్యస్థానాలు” అని మై క్రాస్ ప్రతినిధి పేర్కొన్నారు. కాగా ప్రపంచ పటంలో వారణాసి ప్రకాశిస్తుండటంతో భారతదేశ ఆధ్యాత్మిక పర్యాటక రంగం మరింత వృద్ధికి సిద్ధంగా ఉంది.. సంప్రదాయాన్ని పరివర్తనతో సమతుల్యం చేస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..