భద్రాచలంలో డిసెంబరు 13 నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు.. 23న ఉత్తరద్వార దర్శనం.. నిత్యకల్యాణం రద్దు
ముల్లోకాలను నడిపించే విష్ణువు ముక్తిని ఇస్తాడని..పుణ్యఫలం లభిస్తుందని.. కార్యసాధకుడికి లక్ష్య సిద్ధి సొంతం అవుతుందని విశ్వాసం. దీంతో హిందువులు వైకుంఠ ఏకాదశి రోజున వైష్ణవాలయాలకు పోటెత్తుతారు. ఈ ఏడాది డిసెంబర్ 23న వైకుంఠ ఏకాదశి వచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలోని రామాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

తిథుల్లో ఏకాదశి తిథికి విశిష్ట స్థానం ఉంది. ఏడాదిలో ప్రతి ఏకాదశికి ప్రత్యేక ఉంది.. శ్రీ మహావిష్ణువుని అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. అయితే ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని వైకుంఠ ఏకాదశి అని అంటారు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన ఏకాదశుల్లో అత్యంత ముఖ్యమైంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి దర్శించుకుంటారు. ఇలా చేయడం ద్వారా ముల్లోకాలను నడిపించే విష్ణువు ముక్తిని ఇస్తాడని..పుణ్యఫలం లభిస్తుందని.. కార్యసాధకుడికి లక్ష్య సిద్ధి సొంతం అవుతుందని విశ్వాసం. దీంతో హిందువులు వైకుంఠ ఏకాదశి రోజున వైష్ణవాలయాలకు పోటెత్తుతారు. ఈ ఏడాది డిసెంబర్ 23న వైకుంఠ ఏకాదశి వచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలోని రామాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో డిసెంబరు 13 నుంచి శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలను జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో రమాదేవి చెప్పారు.
- ఈ అధ్యయనోత్సవాల్లో భాగంగా డిసెంబరు 13న రామయ్య మత్స్యావతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
- డిసెంబర్ 14వ తేదీన కూర్మావతారంలో దర్శనం
- డిసెంబర్ 15వ తేదీన రామయ్య వరాహావతారంలో దర్శనం ఇవ్వనున్నారు.
- డిసెంబర్ 16న నరసింహావతారంలో దర్శనం ఇవ్వనున్నారు.
- డిసెంబర్ 17న వామనావతారం లో దర్శనం ఇవ్వనున్నారు.
- డిసెంబర్ 18న పరశురామావతారంలో దర్శనం ఇవ్వనున్నారు.
- డిసెంబర్ 19న శ్రీరామావతారంలో దర్శనం ఇవ్వనున్నారు.
- డిసెంబర్ 20న బలరామావతారంలో దర్శనం ఇవ్వనున్నారు.
- డిసెంబర్ 21న శ్రీకృష్ణావతారంలో రామయ్య భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
- డిసెంబర్ 22న శ్రీ తిరుమంగైలపై ఆళ్వారుల పరమ పదోత్సవం జరపనున్నారు. సాయంత్రం గోదావరిలో సీతారాములకు తెప్పోత్సవం నిర్వహించనున్నారు.
- డిసెంబర్ 23న వైకుంఠ ఏకాదశి.. కనుక ఈ రోజుఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఉత్తర ద్వారం దగ్గర ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. అనంతరం స్వామివారి భక్తులకు ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకునే వీలు కల్పించనున్నారు.
- ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి జనవరి 8న విశ్వరూప సేవ ఉంటుంది.
- జనవరి 12న కూడారై ఉత్సవాన్ని నిర్వహించనున్నారు.
- జనవరి 14న తెలుగువారి అతి పెద్ద పండగ భోగి సందర్భంగా శ్రీ గోదాదేవి కల్యాణం నిర్వహించనున్నారు.
- జనవరి 15న మకర సంక్రాంతి సందర్భంగా స్వామివారి రథోత్సవం నిర్వహించనున్నారు.
- అయితే ఈ ప్రత్యేక అధ్యయనోత్సవాల సందర్భంగా డిసెంబర్ 13 వ తేదీ నుంచి 23 వరకు సీతారాములకు నిర్వహించే నిత్య కల్యాణాలను రద్దు చేస్తున్నట్లు ఈవో రమాదేవి చెప్పారు.
- అంతేకాదు ధనుర్మాసం సందర్భంగా డిసెంబరు 17 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాస పూజలు.. తిరుప్పావై నిర్వహించనున్నామని వెల్లడించారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..