Panch Prayags: ఈ ప్రదేశాల్లో నదుల సంగమం అద్భుతం చూసి తీరాల్సిందే.. కర్ణుడి ఆలయం ఎక్కడంటే..
దేవభూమి ఉత్తరాఖండ్ ప్రకృతి అందాలతో మాత్రమే కాదు ఆధ్యాత్మిక క్షేత్రాలు, పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఉత్తరాఖండ్ అణువణువున ఆధ్యాత్మిక సుగంధం వేల్లువిరుస్తుంది. ఈ ప్రాంతాన్ని చూసేందుకు దూర ప్రాంతాల నుంచి భక్తులు, పర్యాటకులు వస్తారు. అయితే ఇక్కడ మరొక అందమైన పవిత్రమైన దృశ్యం ఏమిటంటే.. పవిత్ర నదులు కలిసే ఐదు ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. ఉత్తరాఖండ్ వెళ్ళిన వారు ఈ నదులను తప్పని సరిగా సందర్శించాల్సిందే అంటారు చూసినవారు. ఈ సంగమ ప్రదేశాలు ఏమిటంటే..

భారతదేశం మతపరమైన ప్రాముఖ్యత, సంస్కృతితో చాలా ప్రసిద్ధి చెందింది. ప్రతి రాష్ట్రానికి దాని సొంత సంస్కృతి ఉంది. ఇది ఆ ప్రాంతాన్ని విభిన్నంగా, ప్రసిద్ధి చెందేలా చేస్తుంది. ఉత్తరాఖండ్‌ను దేవభూమి అని పిలుస్తారు. ఇది దాని సహజ సౌందర్యం, పర్వతాలు, తీర్థయాత్ర స్థలాలతో చాలా ప్రసిద్ధి చెందింది. కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి , హేమకుండ్ సాహిబ్ వంటి అనేక తీర్థయాత్ర స్థలాలు ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి తీర్థయాత్ర స్థలాలను సందర్శించడానికి వస్తే.. ప్రకృతి ప్రేమికులు పర్యాటకులు ప్రకృతి అందాన్ని వీక్షిచేందుకు కుటుంబ సభ్యులతో, స్నేహితులతో తిరగడానికి వస్తారు.
గంగా, యమునా నదుల జన్మ స్థలం ఉత్తరాఖండ్‌లో ఉంది. ముస్సోరీ ఉత్తరాఖండ్‌లోని అత్యంత ప్రసిద్ధ హిల్ స్టేషన్‌లలో ఒకటి. ఇక్కడ పర్వతాలు, నదులు, మైదానాలు వంటి అందమైన ప్రదేశాలలో ప్రశాంతంగా గడపడానికి అవకాశం లభిస్తుంది. హిందువులు హరిద్వార్, రిషికేశ్‌లకు గంగానదిలో స్నానం చేయడానికి వస్తారు. దీనితో పాటు అనేక పవిత్ర నదులు, నదుల సంగమాలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలు స్నానం చేయడానికి వస్తారు. వాస్తవంగా సంగం అంటే గంగా, యమునా, సరస్వతి నదులు కలిగే ప్రాంతం త్రివేణీ సంగమం అని అంటారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఉత్తరాఖండ్‌లో కొన్ని పవిత్ర నదులు కలిసే ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఆ ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
దేవ ప్రయాగ: అలకనంద, భాగీరథి నదుల సంగమం దేవప్రయాగలో జరుగుతుంది. ఈ రెండు నదులు కలిసి గంగా నదిని ఏర్పరుస్తాయి. ఇది ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్హ్వాల్ జిల్లాలో ఉంది. ఇది అత్యంత ప్రసిద్ధ సంగమ ప్రదేశాలలో ఒకటిగా కూడా పరిగణించబడుతుంది. దేవప్రయాగ రిషికేశ్ సమీపంలో ఉంది. ఇక్కడ రఘునాథ్ ఆలయం సహా అనేక ఇతర దేవాలయాలను సందర్శించవచ్చు. దీనితో పాటు సస్పెన్షన్ బ్రిడ్జి, తీన్ ధార కూడా ఇక్కడ సందర్శించడానికి చాలా ప్రసిద్ధ ప్రదేశాలు.
రుద్రప్రయాగ అలకనంద, మందాకిని నదులు రుద్రప్రయాగ వద్ద కలుస్తాయి. ఇది అలకనంద నది ఐదు సంగమ ప్రదేశాలలో ఒకటి. దీనిని పంచ ప్రయాగలలో ఒకటిగా కూడా పరిగణిస్తారు. మందాకిని నది కేదార్‌నాథ్ ఆలయానికి 1 కిలోమీటరు దూరంలో ఉన్న చౌరబారి హిమానీనదం కరిగే మంచు నుంచి ఉద్భవించింది. అలకనంద నది అలకపురి హిమానీనదం నుంచి ఉద్భవించింది. రుద్రప్రయాగ బద్రీనాథ్, కేదార్‌నాథ్ మధ్య ఉంది.
ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి
View this post on Instagram
కర్ణప్రయాగ అలకనంద,పిందార్ నదుల సంగమం కర్ణప్రయాగ వద్ద జరుగుతుంది. ఈ ప్రదేశం ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉంది. అలకనంద నది ఐదు ప్రయాగలలో ఇది మూడవ ప్రయాగ. ఇది బద్రీనాథ్ జాతీయ రహదారి సమీపంలో ఉంది. ఈ నది పిందార్ నదికి రెండు వైపులా ఉంది. చిన్న కొండలతో చుట్టుముట్టబడి ఉంది. అలకనంద నది బద్రీనాథ్ ద్వారా ఇక్కడికి చేరుకుని పిందార్ నదిలో కలుస్తుంది. ఇక్కడ ఉమా దేవి ఆలయం, కర్ణ ఆలయాన్ని సందర్శించవచ్చు. అంతేకాదు నౌటి గ్రామం, నందప్రయాగ వంటి అందమైన ప్రదేశాలను కూడా అన్వేషించవచ్చు.
ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి
View this post on Instagram
నంద ప్రయాగ అలకనంద, మందాకిని నదులు నందప్రయాగ్ వద్ద కలుస్తాయి. ఈ ప్రదేశం ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉంది. ఇది పంచ ప్రయాగలలో ఒకటి. నందప్రయాగ్‌లోని పవిత్ర సంగమ స్థలానికి సమీపంలో ఉన్న చండికా ఆలయం, గోపాల ఆలయం, శివాలయాన్ని సందర్శించవచ్చు. రూప కుండం సరస్సు వంటి అందమైన ప్రదేశాలను సందర్శించవచ్చు. ఇక్కడ ట్రెక్కింగ్, రాఫ్టింగ్, రాక్ క్లైంబింగ్, స్కీయింగ్ చేసే అవకాశం కూడా ఉంది.
ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి
View this post on Instagram
విష్ణుప్రయాగ అలకనంద, ధౌలిగంగ నదుల సంగమం విష్ణుప్రయాగలో జరుగుతుంది. ఈ సంగమం ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో కూడా జరుగుతుంది. విష్ణుప్రయాగలో ప్రసిద్ధ విష్ణువు బద్రీనాథ్ ఆలయం ఉంది. చార్ ధామ్ యాత్ర సమయంలో భారీ సంఖ్యలో భక్తులు కనిపిస్తారు. ధౌలిగంగను ధౌలి నది అని కూడా పిలుస్తారు.ఇది పవిత్ర గంగా నది ఆరు మూల ప్రవాహాలలో ఒకటి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








