గోముఖ పర్వతం ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో ఉంది. ఇక్కడ గంగోత్రి హిమానీనదం ముగింపు.. అదే సమయంలో ఇక్కడ నుంచే భాగీరథి నది ప్రారంభమవుతుంది. గంగా నదికి ప్రధాన మూలం. ఈ పర్వతం గర్హ్వాల్ హిమాలయాలలో 4,023 మీటర్లు (13,200 అడుగులు) ఎత్తులో ఉంది. హిందూ మతంలో ఈ పర్వతానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పర్వతం హిందువులకు పవిత్రమైన పుణ్యక్షేత్రం.
గోముఖ్ పర్వతం వెనుక ఉన్న హిమానీనదం భగీరథ పర్వతం అని పిలుస్తారు. గంగను భూమిపైకి వచ్చే ముందు.. ఆమెను శివుడు తన శిగలో బంధించాడు. ఈ పర్వతంలో మూడు శిఖరాలు కనిపిస్తాయి. వీటి పేర్లు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. శివుడు తన శిగలో బంధించిన గంగమ్మని భువికి చేరుకోమంటూ విడిచిపెట్టాడు. ఆ శిఖరం గోముఖ పర్వతం వెనుక ఉంది. అటువంటి గోముఖ పర్వతంలో అనేక మార్పులు వచ్చినట్లు తెలుస్తుంది.
ఈ గోముఖ పర్వతం నిరంతరం కదులుతూ ఉంటుంది. అయితే అది ఎంత వేగంగా కదులుతుంది అనేది స్పష్టంగా తెలియదు. ఈ పర్వతం నిరంతరం జారిపోవడం వెనుక 2013 విపత్తు కారణమా లేదా.. మరేదైన ఏదైనా కారణం ఉందా అనే విషయంపై శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేస్తున్నారు. డెహ్రాడూన్‌లో ఉన్న వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా హిమాలయాలలోని హిమానీనదాలను పర్యవేక్షిస్తోంది. ఈ సంస్థ శాస్త్రవేత్తలు హిమానీనదంలో సంభవిస్తున్న మార్పులపై కూడా అధ్యయనం చేస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, 2013 విపత్తు తర్వాత గోముఖ పర్వతంపై చాలా మార్పులు వచ్చాయి.
వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ కారణంగా గోముఖ పర్వతం జరుగుతోందని ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ కాలాచంద్ సైన్ తెలిపారు. అంతేకాదు పెరుగుతున్న ఉష్ణోగ్రత కారణంగా పర్వతం కూడా వెనక్కి జారిపోతోంది. 1935లో ఉన్న పర్వత ముఖద్వారం.. ఇప్పుడు 15-20 మీటర్ల వెనుకకు వెళ్ళిపోయిందని చెప్పారు. అయితే పర్వతం అంతరించిపోతుందనే ఆలోచనను నిపుణులు తిరస్కరించారు. డాక్టర్ కాలాచంద్ పర్వతం అంతరించిపోతుందని అన్న వ్యాఖ్యలను ఖండించారు. పర్వతం వెనుకకు వెళ్ళిపోవడానికి గల కారణాలను మరింత అధ్యయనం చేయాలనీ.. అయితే ఈ పర్వతం అంతరించిపోతుందని చెప్పలేమని అంటున్నారు.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.