Ugadi 2022: తెలుగు సంవత్సరాల పేర్లు… వాటి అర్ధం.. 60 ఏళ్లకు ఉన్న ప్రాముఖ్యత.. మీరు ఏ తెలుగు సంవత్సరంలో పుట్టారో తెలుసుకోండి

Ugadi 2022: తెలుగు వారికీ కొత్త సంవత్సరం(Telugu New Year) వసంత ఋతువు, చైత్ర మాసం(Chaitra Maas)లోని పాడ్యమి రోజునుంచి ప్రారంభమవుతుంది. ఈరోజుని ఉగాది పర్వదినంగా హిందువులు(Hindus) జరుపుకుంటారు..

Ugadi 2022: తెలుగు సంవత్సరాల పేర్లు... వాటి అర్ధం.. 60 ఏళ్లకు ఉన్న ప్రాముఖ్యత.. మీరు ఏ తెలుగు సంవత్సరంలో పుట్టారో తెలుసుకోండి
Telugu 60 New Years
Follow us

|

Updated on: Apr 01, 2022 | 7:46 AM

Ugadi 2022: తెలుగు వారికీ కొత్త సంవత్సరం(Telugu New Year) వసంత ఋతువు, చైత్ర మాసం(Chaitra Maas)లోని పాడ్యమి రోజునుంచి ప్రారంభమవుతుంది. ఈరోజుని ఉగాది పర్వదినంగా హిందువులు(Hindus) జరుపుకుంటారు. చైత్ర శుక్ల పాడ్యమి రోజున అనగా ఉగాది రోజున సృష్టి ప్రారంభించాడని పురాణాల కథనం. అందుకనే అందుకే చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయవేళకు పాడ్యమి తిథి ఉన్నరోజును ఉగాదిగా నిర్ణయిస్తారు. ఉగస్య ఆదిః ఉగాదిః అంటారు. ఉగ అంటే నక్షత్ర గమనం. దీనికి ప్రారంభమే ఉగాది అని అర్థం. బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభవ. తెలుగు సంవత్సరాలు 60. అయితే కాలక్రమంలో వచ్చిన మార్పుల్లో భాగంగా తెలుగు సంత్సరాల పేర్లు నేటి జనరేషన్ కు పెద్దగా తెలియవు.. ఇంకా చెప్పాలంటే.. ఇప్పుడు ఎవరినైనా మీరు ఏ సంవ‌త్సరంలో పుట్టారని అడిగితే.. అంటే ఠ‌క్కున చెప్పేస్తారు. కానీ, ఏ తెలుగు సంవ‌త్సరంలో పుట్టారు అంటే చెప్పలేరు. ఈరోజు తెలుగు సంవత్సరాల పేర్లు.. వాటి అర్ధం.. పుట్టుక.. 60 ఏళ్లకు ఉన్న ప్రాముఖ్యత.. గురించి తెల్సుకుందాం..

పేర్ల వెనకవున్న పురాణ కథనం తెలుగు సంవ‌త్సరాల వెనుక పురాణాల్లో ఒక కథ ఉంది. బ్రహ్మ మానస పుత్రుడు నారద మహాముని ఓసారి విష్ణు మాయ వల్ల స్త్రీగా మారి.. రాజును పెళ్లాడాడు. ఈ దంపతులకు 60 మంది సంతానం జన్మించారు. ఆ రాజు తన సంతానంతో కలిసి ఓ యుద్ధంలో పాల్గొంటే.. అప్పుడు ఆ 60 మంది సంతానం యుద్ధంలో మరణిస్తారు.. తన పిల్లలు మరణాన్ని తట్టుకోలేని స్త్రీ రూపంలో ఉన్న నారదుడు విష్ణువుని ప్రార్ధించగా విష్ణువు కరుణించి.. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని వరమిచ్చాడట. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయని పౌరాణిక కథనం.

ఆధ్యాత్మిక సంబంధ కథనం మనం సౌరమానంలో జీవిస్తున్నాం ఏదైనా బిందువు దగ్గర నుంచి చుట్టు తిరిగితే 360 డిగ్రీలు పూర్తవుతుంది. కేంద్రం నుంచి మనిషి గమనిస్తే ముందు 180 డిగ్రీలు వెనక 180 డిగ్రీలూ అన్నమాట, వెనక వున్న గతం 180 డిగ్రీలూ గతం నిలబడిన రేఖ వర్తమానం ముందున్నవి భవిష్యత్ సూచకాలు. కృత త్రేతా ద్వాపర యుగాలకంటే మానవ ఆయుర్ధాయం పడిపోయి కేవలం 120 సంవత్సరాలకు వచ్చిందట. అందుకే 60 ఏళ్ళు పూర్తవగానే సగం జీవితం పూర్తయ్యిందని గుర్తుచేస్తూ లోక సంభంద విషయాలు పూర్తిచేసు కొమ్మని షష్టిపూర్తి ఉత్సవంగా చేస్తారు. అంటే మిగిలిన 60 ఏళ్లు తరువాతి తరాలకు మార్గదర్శనం చేస్తూ ఆధ్యాత్మిక చింతనలో బ్రతకాలని చెప్పకనే చెప్తున్నారన్నమాట.

తెలుగు సంవత్సరాల పేర్లు… వాటి అర్థాలు

  1.  1867, 1927,1987: ప్రభవ అంటే… ప్రభవించునది… అంటే… పుట్టుక
  2. 1868,1928,1988: విభవ – వైభవంగా ఉండేది.\
  3. 1869,1929,1989: శుక్ల… అంటే తెల్లనిది. నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక
  4. 1870,1930,1990: ప్రమోదూత…. ఆనందం. ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత.
  5. 1871,1931,1991: ప్రజోత్పత్తి… ప్రజ ఆంటే సంతానం. సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి.
  6. 1872,1932,1992: అంగీరస… అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి, ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ దేవుడి పేరు మీదే ఈ పేరొచ్చింది అని అర్థం.
  7. 1873,1933,1993: శ్రీముఖ… శుభమైన ముఖం. ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదనే అర్ధం.
  8. 1874,1934,1994: భావ…. భావ అంటే భావ రూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావ నారాయణుడు. ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు.
  9. 1875,1935,1995: యువ…. యువ అనేది బలానికి ప్రతీక.
  10. 1876,1936,1996: ధాత… అంటే బ్రహ్మ. అలాగే ధరించేవాడు, రక్షించేవాడు.
  11. 1877,1937,1997: ఈశ్వర… పరమేశ్వరుడు.
  12. 1878,1938,1998: బహుధాన్య… సుభిక్షంగా ఉండటం.
  13. 1879,1939,1999: ప్రమాది… ప్రమాదమున్నవాడు అని అర్థమున్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడనవసరం లేదు.
  14. 1880,1940,2000: విక్రమ… విక్రమం కలిగిన వాడు.
  15. 1881,1941,2001: వృష … చర్మం.
  16. 1882,1942,2002: చిత్రభాను… భానుడంటే సూర్యుడు. సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించటం. చిత్రమైన ప్రకాశమంటే మంచి గుర్తింపు పొందడమని అర్థం.
  17. 1883,1943,2003: స్వభాను… స్వయం ప్రకాశానికి గుర్తు. స్వశక్తి మీద పైకెదిగేవాడని అర్థం.
  18. 1884,1944,2004: తారణ… తరింపచేయడం అంటే దాటించడం. కష్టాలు దాటించడం, గట్టెక్కించడం అని అర్థం.
  19. 1885,1945,2005: పార్థివ… పృధ్వీ సంబంధమైనది, గుర్రం అనే అర్థాలున్నాయి. భూమికున్నంత సహనం, పనిచేసేవాడని అర్థం.
  20. 1886,1946,2006: వ్యయ… ఖర్చు కావటం. ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చై ఉంటుందని ఈ సంవత్సరం అర్థం.
  21. 1887,1947,2007: సర్వజిత్తు…. సర్వాన్ని జయించినది.
  22. 1888,1948,2008: సర్వధారి -…సర్వాన్ని ధరించేది.
  23. 1889,1949,2009: విరోధి…. విరోధం కలిగినట్టువంటిది.
  24. 1890,1950,2010: వికృతి… వికృతమైనటువంటిది.
  25. 1891,1951,2011: ఖర…. గాడిద, కాకి, ఒక రాక్షసుడు, వాడి, వేడి, ఎండిన పోక అనే అర్థాలున్నాయి.
  26. 1892,1952,2012: నందన … కూతురు, ఉద్యానవనం, ఆనందాన్ని కలుగజేసేది.
  27. 1893,1953,2013: విజయ… విశేషమైన జయం కలిగినది.
  28. 1894,1954,2014): జయ…. జయాన్ని కలిగించేది.
  29. 1895,1955,2015: మన్మథ… మనస్సును మధించేది.
  30. 1896,1956,2016: దుర్ముఖి… చెడ్డ ముఖం కలది.
  31. 1897,1957,2017: హేవిలంబి… సమ్మోహన పూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం.
  32. 1898,1958,2018: విలంబి… సాగదీయడం.
  33. 1899,1959,2019: వికారి…. వికారం కలిగినది.
  34. 1900,1960,2020: శార్వరి… రాత్రి.
  35. 1901,1961,2021): ప్లవ… తెప్ప. కప్ప, జువ్వి… దాటించునది అని అర్థం.
  36. 1902,1962,2022: శుభకృత్… శుభాన్ని చేసి పెట్టేది.
  37. 1903,1963,2023: శోభకృత్… శోభను కలిగించేది.
  38. 1904,1964,2024: క్రోధి… క్రోధాన్ని కలిగినది.
  39. 1905,1965,2025: విశ్వావసు… విశ్వానికి సంబంధించినది.
  40. 1906,1966,2026: పరాభవ … అవమానం.
  41. 1907,1967,2027: ప్లవంగ… కోతి, కప్ప.
  42. 1908,1968,2028: కీలక…. పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య.
  43. 1909,1969,2029: సౌమ్య… మృదుత్వం.
  44. 1910,1970,2030: సాధారణ… సామాన్యం.
  45. 1911,1971,2031: విరోధికృత్… విరోధాలను కలిగించేది.
  46. 1912,1972,2032: పరీధావి… భయకారకం.
  47. 1913,1973,2033: ప్రమాదీచ… ప్రమాద కారకం.
  48. 1914,1974,2034: ఆనంద… ఆనందమయం.
  49. 1915,1975,2035: రాక్షస… రాక్షసత్వాన్ని కలిగినది.
  50. 1916,1976,2036: నల…. నల్ల అనే పదానికి రూపాంతరం.
  51. 1917,1977,2037: పింగళ… ఒక నాడి, కోతి, పాము, ముంగిస.
  52. 1918,1978,2038: కాలయుక్తి… కాలానికి తగిన యుక్తి.
  53. 1919,1979,2039: సిద్ధార్థి… కోర్కెలు సిద్ధించినది.
  54. 1920,1980,2040: రౌద్రి… రౌద్రంగా ఉండేది.
  55. 1921,1981,2041: దుర్మతి… దుష్ట బుద్ధి.
  56. 1922,1982,2042: దుందుభి … వరుణుడు.
  57. 1923,1983,2043: రుధిరోధ్గారి… రక్తాన్ని స్రవింప చేసేది.
  58. 1924,1984,2044: రక్తాక్షి… ఎర్రని కన్నులు కలది.
  59. 1925,1985,2045: క్రోదన… కోప స్వభావం కలది.
  60. 1926,1986,2046: అక్షయ… నశించనిది

Also Read: Ugadi Holiday: ఉగాదికి సెలవు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. కొత్త జిల్లాల ఏర్పాటుకు ముహూర్తం ఖరారు

రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?