Badrachalam: రామయ్య ఆలయంలో పెరిగిన సేవలు, ప్రసాదం ధరలు.. రేపటి నుంచి అమలు.. ఎంత మేర పెరిగాయంటే
Badrachalam: తెలంగాణ(Telangana) లోని గోదావరి నదీ (Godavari River) తీరాన వేలాసిన ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం. ఇక్కడ భక్త రామదాసు(Ramadasu) నిర్మించిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం..
Badrachalam: తెలంగాణ(Telangana) లోని గోదావరి నదీ (Godavari River) తీరాన వేలాసిన ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం. ఇక్కడ భక్త రామదాసు(Ramadasu) నిర్మించిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం తెలుగు రాష్ట్రాల్లో ఖ్యాతిగాంచింది. భద్రాద్రి రామయ్యకు జరిగే కళ్యాణ వేడుక, పట్టాభిషేకం వేడుకలను కనులారా దర్శించడానికి తెలుగురష్ట్రాలతో పాటు.. అనేక ప్రాంతాల నుంచి భారీ సంఖ్యంలో భక్తులు హాజరవుతారు. ఇప్పటికే శ్రీరామనవమి వేడుకల కోసం సీతారాముల ఆలయం ముస్తాబవుతుంది. అయితే తాజాగా దేవస్థానం టికెట్ల ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో వివిధ సేవల టికెట్ల ధరలతో పాటు, ప్రసాదాల ధరలను కూడా పెంచుతున్నట్లు దేవస్థాన అధికారులు ప్రకటించారు. సీతారాముల ఆలయంలో నిత్యకల్యాణం రూ.1,500, అభిషేకం టికెట్ రూ.1,500, అర్చన రూ.300లకు పెంచారు. కేశఖండన టిక్కెట్ రూ.15 నుంచి రూ.20లకు పెంచారు. అంతేకాదు స్వామివారి ప్రసాదం లడ్డు, పులిహోర, చక్కెరపొంగలి ధరలను కూడా స్వల్పంగా పెంచారు. పెరిగిన ధరల ప్రకారం..100 గ్రాముల చిన్న లడ్డు ప్రస్తుత ధర రూ.20 లు ఉండగా..ఐదు రూపాయలు పెంచి రూ.25లకు విక్రయించనున్నారు. ఇదే విధంగా పులిహోర రూ.10 నుంచి ఐదు రూపాయలు పెంచి ఇక నుంచి 15లకు పెంచారు. ఇక చక్కెరపొంగిలి కూడా రూ.10 నుంచి రూ.15లకు పెంచుతూ దేవస్థానం అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 500 గ్రాముల మహా లడ్డును రూ. 100 లకు భక్తులకు అందించేవారు. అయితే ఈ మహాలడ్డు ధర 100 లు ఉంచి బరువు మాత్రం 500 గ్రాముల నుంచి 400 గ్రాములకు తగ్గించారు. ఇలా పెంచిన కొత్త టికెట్ల ధరలు రేపట్నుంచి అమల్లోకి రానున్నాయని దేవస్థానం ఈవో చెప్పారు.