AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఏడాది తులసి వివాహం ఎప్పుడు? నవంబర్ 12 లేదా 13నా ఖచ్చితమైన తేదీ, పూజా విధానం తెలుసుకోండి..

కార్తీక మాసంలో విష్ణువు ,తులసిల వివాహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు నుండి శుభ మరియు శుభ కార్యాలు మళ్లీ ప్రారంభమవుతాయి. ఈ ఏడాది తులసి వివాహం ఎప్పుడు నిర్వహించబడుతుందో ఖచ్చితమైన తేదీ, పూజా విధానం, పరిహారం, ప్రాముఖ్యతను తెలుసుకుందాం.

ఈ ఏడాది తులసి వివాహం ఎప్పుడు?  నవంబర్ 12 లేదా 13నా ఖచ్చితమైన తేదీ, పూజా విధానం తెలుసుకోండి..
Tulasi Vivaham
Surya Kala
|

Updated on: Nov 03, 2024 | 10:04 AM

Share

హిందూ మతంలో శ్రీ మహా విష్ణువు, తులసిలో శాలిగ్రామ అవతార వివాహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసంలోని ద్వాదశి రోజున తులసి కళ్యాణం నిర్వహిస్తారు. ఈ రోజు నుండి అన్ని శుభ కార్యాలు మళ్లీ ప్రారంభమవుతాయి. ఈ రోజున, తల్లి తులసి , శ్రీమహావిష్ణువు రూపమైన శాలిగ్రాముల వివాహం హిందువులు తమ ఇళ్లలో నిర్వహించుకుంటారు. దేవాలయాలలో జరుపుతారు.

తులసి వివాహం 2024 తేదీ వేద పంచాంగం ప్రకారం కార్తీక మాసం ద్వాదశి తిథి మంగళవారం, నవంబర్ 12 సాయంత్రం 4:02 గంటలకు ప్రారంభమవుతుంది. ముగింపు తేదీ నవంబర్ 13 బుధవారం మధ్యాహ్నం 1:01 గంటలకు ఉంటుంది. సాయత్రం పూజ ను పరిగణలోకి తీసుకుంటే నవంబర్ 12న తులసి వివాహం జరపనుండగా.. ఉదయ తిథి లెక్క ప్రకారం నవంబర్ 13న తులసి వివాహాన్ని జరుపుకుంటారు.

తులసీ వివాహ పూజ విధి

ఇవి కూడా చదవండి

తులసి వివాహం కోసం, ఒక పీటం మీద ఆసనాన్ని పరచి తులసి మొక్కను, శాలిగ్రామ విగ్రహాన్ని ప్రతిష్టించండి, ఆ తర్వాత పీటం చుట్టూ చెరకుతో మంటపాన్ని ఏర్పాటు చేసి ఆ మండపాన్ని అలంకరించి కలశాన్ని ప్రతిష్టించండి. ముందుగా కలశాన్ని, గౌరీ గణేశుడిని పూజించండి. అప్పుడు తులసి మొక్కకు, శాలిగ్రామ స్వామికి ధూపం, దీపం, వస్త్రాలు, దండలు, పువ్వులు సమర్పించండి. ఆ తర్వాత తులసి సౌభాగ్య సూచన అయిన పసుపు , కుంకుమ, వంటి వస్తువులతో పాటు ఎరుపు రంగు చున్నీని అందించండి. పూజ అనంతరం తులసి మంగళాష్టకం పఠించండి. ఆ తరువాత శాలిగ్రామంతో తులసికి ఏడు ప్రదక్షిణలు చేయండి., ఈ ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత విష్ణువు,తులసికి హారతి చేయండి. పూజ అనంతరం ప్రసాదం పంచిపెట్టండి.

తులసి వివాహంపై రోజున చేయాల్సిన నివారణలు చర్యలు

  1. తులసి వివాహం రోజున ఆచారాల ప్రకారం శాలిగ్రామాన్ని, తులసిని పూజించడం వల్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులు తొలగిపోయి ఆనందం నెలకొంటుంది. శాంతిని కాపాడుతుందని విశ్వాసం.
  2. తులసి వివాహం సమయంలో తులసి మొక్కకు అలంకరణ వస్తువులు సమర్పించడం వలన అఖండ సౌభాగ్యాలు కలుగుతాయి.
  3. తులసి వివాహం రోజున సాయంత్రం వేళ రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల ఇంట్లోని దారిద్ర్యం తొలగిపోయి సుఖ సంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయి.
  4. తులసి వివాహం రోజున తులసి మొక్కకు ఏడుసార్లు ప్రదక్షిణ చేసి, సంధ్యా సమయంలో నెయ్యి దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది.

తులసి వివాహం ప్రాముఖ్యత తులసిని వివాహం జరపడం వలన వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. ఎవరికైనా వివాహం ఆలస్యమైతే తులసి వివాహం చేయడం వల్ల పెళ్లి కుదురుతుందని నమ్మకం. అంతే కాకుండా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. సిరి సంపదలకు లోటు ఉండదని నమ్మకం.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

Note: పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.