AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దైవ మహత్యమా..! లేక నిర్మాణ నైపుణ్యమా..! కార్తీక మాసం మొదటి రోజు శివాలయంలో వింత.. పోటెత్తిన భక్తులు

కార్తీక మాసం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలలోని శివ క్షేత్రాలు, శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంటుంది. శివయ్యను దర్శించుకుని పూజలను నిర్వహిస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని ఒక శివాలయంలో కార్తీక మాసం మొదటి రోజు శివాలయంలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఈ ఆలయంలో గత కొన్ని వందల ఏళ్లుగా ఎన్నడూ జరగని ఘటన జరగడంతో భారీగా భక్తులు ఈ వింతను చూడడానికి ఆసక్తిని చూపించారు. శివయ్య మహిమగా కీర్తించారు.

దైవ మహత్యమా..! లేక నిర్మాణ నైపుణ్యమా..! కార్తీక మాసం మొదటి రోజు శివాలయంలో వింత.. పోటెత్తిన భక్తులు
Lord Shiva Temple
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Nov 03, 2024 | 8:18 AM

Share

కార్తీక మాసం మొదటి రోజు శైవ క్షేత్రంలో వింత చోటు చేసుకుంది. స్వామివారి గర్భగుడిలోని శివలింగాన్ని సూర్యకిరణాలు తాకడంతో అక్కడి భక్తుల్లో ఎనలేని ఆధ్యాత్మికత ఉప్పొంగింది. ఇది శివుడి మహాత్యమా లేక నిర్మాణ నైపుణ్యమా అంటూ ఉప్పొంగిపోతున్నారు శివ భక్తులు. కార్తీక మాసం మొదటి రోజు జరిగిన ఈ సంబరం ఆశ్చర్యాన్ని చూసేందుకు ఆలయానికి తండోపతండాలుగా తరలివచ్చారు. నంద్యాల జిల్లా సిరివెళ్లలోని శ్రీ ఓంకారేశ్వర ఆలయం ను 700 సంవత్సరాల క్రితం ప్రతాపరుద్ర మహారాజు కాలంలో శివలింగం ప్రతిష్టించారని ప్రతీతి. ఈ ఆలయంలోని గర్భగుడి శివలింగాన్ని కార్తీక మాసం మొదటి రోజు సూర్యకిరణాలు తాకాయి. ఇది పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో తండోపతండాలుగా దర్శనార్థం భక్తులు తరలివచ్చారు.

ఇది వింతనా లేక నిర్మాణంలోనే నైపుణ్యమా అంటూ భక్తుల్లో చర్చ మొదలైంది. నిర్మాణ నైపుణ్యం అయితే ప్రతిరోజు జరగాలి. అలా కాకుండా చాలా ఏళ్ల తర్వాత అది కూడా కార్తీకమాసం మొదటి రోజే జరగడం పట్ల నిజంగా దైవ మహత్యం గా స్థానిక భక్తులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే
ఉలవల బెనిఫిట్స్ తెలిస్తే ఒక్క రోజూ కూడా మిస్ చెయ్యరు
ఉలవల బెనిఫిట్స్ తెలిస్తే ఒక్క రోజూ కూడా మిస్ చెయ్యరు
మూడో కంటికి తెలియకుండా.. వారు అనుకున్నది సాధిస్తారు..!
మూడో కంటికి తెలియకుండా.. వారు అనుకున్నది సాధిస్తారు..!
చెత్త ఫీల్డింగ్‌తో నవ్వులపాలైన పాకిస్తాన్ ఫ్యూచర్ స్టార్
చెత్త ఫీల్డింగ్‌తో నవ్వులపాలైన పాకిస్తాన్ ఫ్యూచర్ స్టార్
కిడ్నీ రాళ్లపై నిమ్మకాయ మంత్రం..! ప్రచారంలో నిజమెంత..?
కిడ్నీ రాళ్లపై నిమ్మకాయ మంత్రం..! ప్రచారంలో నిజమెంత..?
పచ్చి గుడ్లు తాగితే ఎక్కువ బలం వస్తుందా..? అపొహలు కాదు అసలు..
పచ్చి గుడ్లు తాగితే ఎక్కువ బలం వస్తుందా..? అపొహలు కాదు అసలు..
ఎన్నో కలలు కన్నాడు.. కానీ తలనొప్పి అతని జీవితానికి శాసనం రాసింది.
ఎన్నో కలలు కన్నాడు.. కానీ తలనొప్పి అతని జీవితానికి శాసనం రాసింది.